Sunday, 21 June 2026
  • Home  
  • ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- తూర్పు గోదావరి

ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి దేవాదాయ శాఖ కమిషనర్‌ను కోరిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు  పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా  రాజమహేంద్రవరం, జూన్ 20 ( పున్నమి న్యూస్ ): రాజమహేంద్రవరంలోని దేవాదాయ శాఖ అతిథి గృహంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ గారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పైన శ్రీ వీరేశ్వరస్వామి ఆలయం, సంపర ఈక్షణ ముక్తేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ఈ ఆలయాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.

✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు 

పున్నమి న్యూస్ రిపోర్టర్, తూర్పు గోదావరి జిల్లా 

రాజమహేంద్రవరం, జూన్ 20 ( పున్నమి న్యూస్ ): రాజమహేంద్రవరంలోని దేవాదాయ శాఖ అతిథి గృహంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ గారిని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, పైన శ్రీ వీరేశ్వరస్వామి ఆలయం, సంపర ఈక్షణ ముక్తేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ఈ ఆలయాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.