✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా తోడ్పాటు.
దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందేలా నిరంతరం కృషి.
రావులపాలెంలో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు.
రూ.40,88,661ల విలువైన చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. పేద ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, వేగవంతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. సోమవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని చెక్కులను అందజేశారు. పేదలు ఆరోగ్యపరంగా వైద్యానికి ఖర్చు పెట్టుకుని ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి ఆర్థికంగా సహాయం చేయాలని కోరగానే ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నెలా రూ.50 లక్షల వరకు ఆర్థిక సహాయం సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా మన నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ఇంకా రావాల్సినవి కూడా ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందేలా నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని, ప్రజల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆత్రేయపురం మండలానికి చెందిన 16 మందికి రూ.11,54,568లు, రావులపాలెం మండలానికి చెందిన 13 మందికి రూ.11,38,564లు, కొత్తపేట మండలానికి చెందిన 16 మందికి రూ.10,62,092లు, ఆలమూరు మండలానికి చెందిన 8 మందికి రూ.7,33,437లు మొత్తం 53 మందికి రూ.40,88,661ల విలువైన చెక్కులను అందజేశారు. ఇందులో 50 రియంబర్స్మెంట్ చెక్కులు కాగా మూడు ఎల్ఓసి లు ఉన్నాయి.
END

