బిరదవాడలోని డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణను పరిశుభ్రపరిచి స్వచ్ఛత ప్రాధాన్యతను వివరించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం భవిష్యత్ తరాలకు అందించే అమూల్యమైన సంపద అని ఆమె పేర్కొన్నారు. పరిశుభ్రమైన పాఠశాలలు, పచ్చని పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవన విధానం సమాజ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ