దళితవాడ నుంచి ప్రారంభించిన మంత్రి ఆనం – రూ.34 లక్షల సీసీ రోడ్లు, డ్రైన్ల ప్రారంభం
ఆత్మకూరు, జూలై 27 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే “ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” కార్యక్రమానికి ఆత్మకూరులో విశేష స్పందన లభించింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం ముస్తాపురం దళితవాడలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వ విజయాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.మంత్రి ఆనంకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంత్రి వెంట ఆయన తనయ లీలా కైవల్య రెడ్డి, సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరినాయుడు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, నెరవేర్చిన హామీల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ముస్తాపురంలో రూ.34 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ డ్రైన్లను మంత్రి ప్రారంభించారు.రచ్చబండ వేదికగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ విజయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాన ప్రాధాన్యంతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల దేవాలయాల అభివృద్ధికి రూ.22.40 కోట్ల నిధులు మంజూరు చేశామని, ప్రధాన దేవాలయాలకు రూ.8 కోట్ల సీజీఎఫ్ నిధులు, 18 గ్రామీణ దేవాలయాలకు రూ.90 లక్షలు, 13 శ్రీవాణి భజన మందిరాలకు రూ.4.60 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రైతుల కోసం “అన్నదాత సుఖీభవ” పథకం, విద్యార్థుల కోసం “తల్లికి వందనం” పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.ఆత్మకూరు మున్సిపాలిటీలో రూ.75 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త పైప్‌లైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.26–40 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ముస్తాపురం దళిత కాలనీలో నూతన కోదండ రామస్వామి దేవాలయాన్ని అన్ని వసతులతో నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అయన వెంట ఆర్దిఒ పావని ,నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకులు ,కిమ్స్ హాస్పిటల్ ఈడి తాళ్లూరి గిరి నాయుడు , ఆనం తనయ లీలాకైవల్యరెడ్డి ,పట్టణాద్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి , తెలుగుమహిల రాష్ట్ర నాయకులు పులిమి శైలజ రెడ్డి ,మాజీ చైర్పర్సన్ వెంకటరమనమ్మా ,మాజీ కౌన్సిలర్లు మదాల శ్రీనివాసులు నాయుడు ,వేణు ,నాగభుషనమ్మ తదితరులున్నారు



