ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి గ్రామంలో కుక్కల దాడిలో ఓ చుక్కల దుప్పి మృతి చెందింది. అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి వచ్చిన దుప్పిని వీధికుక్కలు వెంటాడి దాడి చేయడంతో అది చనిపోయింది. ఘటనాస్థలాన్ని డీఆర్డి శ్రీనివాసరావు పరిశీలించి, సుమారు ఐదేళ్ల వయస్సు గల దుప్పి గర్భవతి అని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి, అటవీ జంతువుల సంరక్షణకు అవసరమైన చర్యలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.



