పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి, ఆగస్టు 22:
మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా అలుగురాజుపల్లిలో హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు. మాచర్ల ఎమ్మార్వో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు హియరింగ్ ప్రక్రియను చేపట్టారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ప్రజల నుంచి అవసరమైన పత్రాలు, వివరాలను స్వీకరించి నిబంధనల ప్రకారం పరిశీలన చేపట్టారు.
ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, తప్పులులేకుండా ఉండేలా సర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని హియరింగ్ ప్రక్రియను కొనసాగించారు.


