సర్ (SIR) ప్రక్రియలో మానవతా దృక్పథం.. * అనారోగ్యంతో ఉన్న వృద్ధుడి ఇంటికే వెళ్లిన అధికారులు
సర్ (SIR) ప్రక్రియలో మానవతా దృక్పథం.. * అనారోగ్యంతో ఉన్న వృద్ధుడి ఇంటికే వెళ్లిన అధికారులు పున్నమి న్యూస్ మాచర్ల, ప్రతినిధి ఆగస్టు 30: మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కాలేని పరిస్థితిని గుర్తించిన అధికారులు, వృద్ధుడి ఇంటి వద్దకే వెళ్లి విచారణ నిర్వహించారు. మాచర్ల తహశీల్దార్, హౌసింగ్ ఏఈ, బూత్ లెవల్ అధికారి, కార్యాలయ సిబ్బంది, స్వయంగా కొత్తూరు గ్రామంలోని వృద్ధుడి ఇంటికి వెళ్లి అవసరమైన వివరాలను సేకరించి హియరింగ్ నిర్వహించారు. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని ఇబ్బందులకు గురిచేయకుండా ఇంటి వద్దకే వెళ్లి విచారణ చేపట్టడం పట్ల స్థానికులు అధికారుల చర్యను అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా, అవసరమైన సందర్భాల్లో వారి వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్న అధికారుల తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.




