పున్నమి న్యూస్ మాచర్ల ప్రతినిధి ఆగస్టు 25:
సాగర్ డ్యామ్ నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం ఆగస్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నీటి విడుదల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సిబ్బందితో ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేశారు.
నీటి విడుదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పశువులను నీటి ప్రవాహ ప్రాంతాలకు తీసుకెళ్లడం, పిల్లలను ఈతకు పంపించడం, వ్యవసాయ పనుల కోసం నీటిలో మోటార్లను వినియోగించడం పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ విషయాలను ప్రతి గ్రామంలో దండోరా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజలంతా అధికారుల సూచనలు పాటించి సహకరించాలని అధికారులు కోరారు.
