అరకులోయ, సెప్టెంబర్ 29: ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026 సందర్భంగా అరకు వ్యాలీ మండలంలోని పద్మాపురం బొటానికల్ గార్డెన్తో పాటు పద్మాపురం, సుంకరమెట్ట, మాడగడ, పెదలబుడు గ్రామపంచాయతీల పరిధిలోని పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ మాదాంశెట్టి శ్రీధర్, ఎంపీడీవో వీసం ప్రసాద్, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ పాత్రుడు పాల్గొన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, స్వర్ణ గ్రామం సిబ్బంది సహకారంతో చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యాటక ప్రాంతాల పచ్చదనాన్ని పరిరక్షించడంపై ప్రజలు, పర్యాటకులకు అవగాహన కల్పించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని అధికారులు సూచించారు.

అరకు: పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్