Wednesday, 30 September 2026
  • Home  
  • *సిండికేట్ దోపిడీకి అధికారుల వత్తాసు?* : *కిలో రూ.75కి చేరిన బియ్యం.. పట్టించుకోని పౌరసరఫరాల శాఖపై మండిపడ్డ పౌర సంక్షేమ సంఘం!*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*సిండికేట్ దోపిడీకి అధికారుల వత్తాసు?* : *కిలో రూ.75కి చేరిన బియ్యం.. పట్టించుకోని పౌరసరఫరాల శాఖపై మండిపడ్డ పౌర సంక్షేమ సంఘం!*

​ కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 30 (పున్నమి న్యూస్): పేద,మధ్యతరగతి ప్రజల కడుపు కొడుతూ మిల్లర్లు, దళారులు బహిరంగ దోపిడీకి తెగబడుతుంటే..పౌరసరఫరాల శాఖ,నిఘా విభాగం అధికారులు చోద్యం చూస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాకినాడ మార్కెట్లో కిలో బియ్యం ఏకంగా రూ.75కు చేరడం వెనుక దళారుల సిండికేట్,అధికారుల ఉదాసీనతే కారణమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలకడం మానుకోకపోతే త్వరలోనే కిలో బియ్యం రూ.90కి చేరినా ఆశ్చర్యం లేదని హెచ్చరించారు. ​ *అక్రమ నిల్వలు.. కృత్రిమ కొరత: దళారుల రాజ్యానికి అడ్డుకట్ట ఏదీ?* గోదాముల్లో టన్నుల కొద్దీ ధాన్యం, బియ్యం నిల్వలున్నా.. దళారులు, మిల్లర్లు కుమ్మక్కై మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెంచి సామాన్యుడిని నిలువునా దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ,టాస్క్‌ఫోర్స్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఆంతర్యమేమిటని రమణరాజు ప్రశ్నించారు. దళారుల అక్రమ వ్యాపారానికి అధికారుల మౌనమే రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు. ​ *సబ్సిడీ పేరిట ‘ముద్ద అన్నం’ మోసం!* రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో రూ.50, రూ.52లకు సబ్సిడీ బియ్యం ఇస్తున్నామంటూ అధికారులు చేస్తున్న ప్రచారమంతా డొల్లేనని తేలిపోయింది.వండితే ముద్దగా మారి, తింటే అరగని నాసిరకం కొత్త “దాళ్వా బియ్యాన్ని” ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. అధికారులు పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేయడంతో,ఈ నాసిరకం బియ్యం తినలేక ప్రజలు గత్యంతరం లేక దళారులు నిర్ణయించిన అధిక ధరలకే బహిరంగ మార్కెట్లో బియ్యం కొంటూ అప్పులపాలవుతున్నారు. ​ *జీవోలు కాగితాలకే పరిమితం.. రేషన్ డిపోల్లో నూకల దందా!* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం రేషన్ బియ్యంలో నూకల శాతాన్ని 25% నుంచి 10%కి తగ్గించి, సార్టెక్స్ చేసిన మేలైన బియ్యాన్ని ఇవ్వాలి. అయితే అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో నాసిరకం, పురుగుపట్టిన బియ్యాన్నే పేదలకు అంటగడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కుతున్నా సంబంధిత తనిఖీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రమణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ​ **అధికారులు నిద్రమత్తు వీడాలి.. తక్షణమే దాడులు చేయాలి!* జిల్లాయంత్రాంగం,పౌరసరఫరాల శాఖ ఇకనైనా దళారీ అనుకూల వైఖరిని వీడి తక్షణమే రంగంలోకి దిగాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ​హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల అక్రమ నిల్వలపై తక్షణమే ఆకస్మిక తనిఖీలు (రైడ్స్) నిర్వహించాలి. ​ధరల నియంత్రణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు, బ్లాక్ మార్కెట్ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ​రైతు బజార్లతో పాటు రేషన్ డిపోల్లోనూ వాసన లేని, తినడానికి యోగ్యమైన సార్టెక్స్ పాత బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలి. ​అధికారులు ఇప్పటికైనా స్పందించి దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని దూసర్లపూడి రమణరాజు స్పష్టం చేశారు.

​
కాకినాడ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 30 (పున్నమి న్యూస్):

పేద,మధ్యతరగతి ప్రజల కడుపు కొడుతూ మిల్లర్లు, దళారులు బహిరంగ దోపిడీకి తెగబడుతుంటే..పౌరసరఫరాల శాఖ,నిఘా విభాగం అధికారులు చోద్యం చూస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాకినాడ మార్కెట్లో కిలో బియ్యం ఏకంగా రూ.75కు చేరడం వెనుక దళారుల సిండికేట్,అధికారుల ఉదాసీనతే కారణమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలకడం మానుకోకపోతే త్వరలోనే కిలో బియ్యం రూ.90కి చేరినా ఆశ్చర్యం లేదని హెచ్చరించారు.
​
*అక్రమ నిల్వలు.. కృత్రిమ కొరత: దళారుల రాజ్యానికి అడ్డుకట్ట ఏదీ?*

గోదాముల్లో టన్నుల కొద్దీ ధాన్యం, బియ్యం నిల్వలున్నా.. దళారులు, మిల్లర్లు కుమ్మక్కై మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెంచి సామాన్యుడిని నిలువునా దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ,టాస్క్‌ఫోర్స్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఆంతర్యమేమిటని రమణరాజు ప్రశ్నించారు. దళారుల అక్రమ వ్యాపారానికి అధికారుల మౌనమే రక్షణ కవచంగా మారిందని ఆరోపించారు.
​
*సబ్సిడీ పేరిట ‘ముద్ద అన్నం’ మోసం!*

రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో రూ.50, రూ.52లకు సబ్సిడీ బియ్యం ఇస్తున్నామంటూ అధికారులు చేస్తున్న ప్రచారమంతా డొల్లేనని తేలిపోయింది.వండితే ముద్దగా మారి, తింటే అరగని నాసిరకం కొత్త “దాళ్వా బియ్యాన్ని” ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. అధికారులు పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేయడంతో,ఈ నాసిరకం బియ్యం తినలేక ప్రజలు గత్యంతరం లేక దళారులు నిర్ణయించిన అధిక ధరలకే బహిరంగ మార్కెట్లో బియ్యం కొంటూ అప్పులపాలవుతున్నారు.

​ *జీవోలు కాగితాలకే పరిమితం.. రేషన్ డిపోల్లో నూకల దందా!*

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ప్రకారం రేషన్ బియ్యంలో నూకల శాతాన్ని 25% నుంచి 10%కి తగ్గించి, సార్టెక్స్ చేసిన మేలైన బియ్యాన్ని ఇవ్వాలి. అయితే అధికారుల అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని క్షేత్రస్థాయిలో నాసిరకం, పురుగుపట్టిన బియ్యాన్నే పేదలకు అంటగడుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కుతున్నా సంబంధిత తనిఖీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రమణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
​
**అధికారులు నిద్రమత్తు వీడాలి.. తక్షణమే దాడులు చేయాలి!*

జిల్లాయంత్రాంగం,పౌరసరఫరాల శాఖ ఇకనైనా దళారీ అనుకూల వైఖరిని వీడి తక్షణమే రంగంలోకి దిగాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
​హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల అక్రమ నిల్వలపై తక్షణమే ఆకస్మిక తనిఖీలు (రైడ్స్) నిర్వహించాలి.
​ధరల నియంత్రణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు, బ్లాక్ మార్కెట్ దారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
​రైతు బజార్లతో పాటు రేషన్ డిపోల్లోనూ వాసన లేని, తినడానికి యోగ్యమైన సార్టెక్స్ పాత బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలి.
​అధికారులు ఇప్పటికైనా స్పందించి దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని దూసర్లపూడి రమణరాజు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.