శ్రీ కాళహస్తి, జూన్ 23, (పున్నమి న్యూస్) : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తన ఉదారతను చాటుకున్నారు. దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అందుకున్న మొట్టమొదటి జీతభత్యాన్ని సమాజ సేవకు కేటాయించారు. జీతం తీసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే, స్థానికంగా నిర్మించబోతున్న అయ్యప్ప స్వామి ఆలయ పనుల కోసం రూ. 1,17,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ఆలయ ప్రాంగణంలో బోరు బావి తవ్వించడానికి, మోటార్ ఏర్పాటు చేయడానికి వినియోగించనున్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు, సనాతన ధర్మ పరిరక్షణకు అనుగుణంగా సాయి ప్రసాద్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామి తత్వమసి సేవా సమితి కమిటీ సభ్యులు సాయి ప్రసాద్‌కు శుభాభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్, సాయి ప్రసాద్‌లపై అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ తొలి జీతం విరాళం