తిరుచానూరు, ఆగస్టు 12 పున్నమి ప్రతినిధి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బుధవారం తెలుగు సినీ దర్శకులు వెంకీ అట్లూరి దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


