Sunday, 17 May 2026
  • Home  
  • అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి!!
- తెలంగాణ

అమలులోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి!!

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున, తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూ.చా. తప్పకుండా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ,ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృశ్య వచ్చే సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమము జరగదని అందువల్ల జిల్లా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వినతులను సమర్పించేందుకు సోమవారం జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పిటిసి,
గ్రామపంచాయతీ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున, తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూ.చా. తప్పకుండా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
గ్రామపంచాయతీ,ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృశ్య వచ్చే సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని, అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమము జరగదని అందువల్ల జిల్లా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వినతులను సమర్పించేందుకు సోమవారం జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.