ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సింగపూర్‌లో జరిగిన వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ఆయన ఈ విజన్‌ను వివరించారు.
అమరావతిని జ్ఞాన ఆధారిత నగరంగా, క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా, అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలతో కూడిన రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద నగర నిర్మాణ ప్రాజెక్టులలో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.


