అపోహలు విడిచి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు పొందాలని జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. కొంతమంది ఆరోగ్యశ్రీ పథకమును వక్రీకరించడం, ప్రజలను తప్పుదారి పట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇది సమంజసమైన పద్ధతి కాదని ఆయన హితువు పలికారు. గాయాలపాలై ఎముకలు విరిగిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా అప్రూవల్ (Approval) రావటానికి మూడు, నాలుగు రోజులు పడుతుందని, ఈ మూడు, నాలుగు రోజులలో ఇరిగిన ఎముక ప్రాంతం చెడిపోతుందని, నాణ్యమైన ఇంప్లాంట్ వేయరని చెప్పడం శుద్ధ అబద్ధమని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అపోహాలను నమ్మకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని నయా పైసా ఖర్చు చేయకుండా మొత్తం సేవలు ఉచితంగా పొందవచ్చని ఆయన తెలిపారు.
ఆరోగ్యశ్రీ ద్వారా అందించే సేవలు
1. గాయాలపాలైనప్పుడు అన్ని రకాల విరిగిన ఎముకలకు ఉచిత చికిత్స చేస్తారు.
2.ఇరువైనాలుగు గంటలలోపు అప్రూవల్ లభిస్తుంది.
3. నాణ్యమైన ఇంప్లాంట్ వేస్తారు.
4. రోగి ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రాత్రి భోజనం ఉచితంగా ఇవ్వబడుతుంది
5. రోగి డిశ్చార్జ్ అయినప్పుడు ఆసుపత్రి నుంచి ఇంటి వరకు ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుంది.
6. ఆసుపత్రిలో ఉన్నంతకాలం ఉచితంగా మందులు ఇవ్వబడును.
7. ఈ సౌకర్యాలన్ని మన జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
ప్రజలారా! ప్రభుత్వం ఇన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడు రూ పదివేల నుంచి 15 వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? ఆలోచించండి.
ఈ డబ్బులే మీ దగ్గర ఉంటే ఇంటికి వెళ్లిన తర్వాత పౌష్టికాహారం తినవచ్చు కదా!
ఈ డబ్బుల కోసం అప్పు చేసి తిప్పలు పడడం ఎందుకు? ఒక్కసారి మీరే ఆలోచించాలి. అంటూ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ ఆరోగ్యశ్రీ అందిస్తున్నటువంటి వైద్య సేవలను ప్రజలకు వివరించారు.


