రామచంద్రపురం సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి
రామచంద్రాపురం మండలంలోని అనుపల్లి పంచాయతీ గడ్డకిందపల్లెలో సోమవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. రోడ్డుపక్కన ఆవులను మేపుకుని ఇంటికి వెళ్తున్న కామసాని కల అనే మహిళను సాయంత్రం 6.45 గంటల సమయంలో స్కూటర్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి కిందకు తోసేసినట్లు సమాచారం. అనంతరం ఆమె మెడలోని సుమారు ఏడు సవరాల మంగళసూత్రం, బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


