పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గ్రామంలో ఉండే సామాజిక, సాంఘిక, రాజకీయ పరిణామాలు అర్ధం చేసుకొను నిమిత్తం పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నిన్న అనకాపల్లి మండలం లో అత్యంత సమస్యాత్మక గ్రామమైన మామిడిపాలెం గ్రామంలో అనకాపల్లి రూరల్ పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని యువత మరియు గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సత్ప్రవర్తనతో మెలగాలని, గొడవలకు, వర్గ విభేదాలకు దూరంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని సూచించారు.
సాధారణ సమయాల్లో జరిగే గొడవల కన్నా, ఎలక్షన్ సమయంలో జరిగే గొడవలపై మరియు ఆ కేసుల్లోని నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా నిరంతరం వారిపై నిఘా ఉండేలా రౌడీ షీట్లు తెరవడం, సత్ప్రవర్తన కలిగి ఉండేలా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.


