అనంతసాగరం సెప్టెంబర్ 15,పున్నమి ప్రతినిధి:
అనంతసాగరం గ్రామ గిరిజన కాలనిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలలో అనంతసాగరం మండల సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రిటైర్డ్ టీచర్ మరియు యూటీఫ్ నాయకులు పాపిశెట్టి నరసింహులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కాలనీలో ఉండే వారందరు ఐక్యతగా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. కాలనీలో ఉండే వారు తమ పిల్లలను చదివించుకొని మంచి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా తీర్చిదిదాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అన్వర్ బాషా, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు వేము పెంచలయ్య, డాక్టర్ సుబ్బారాయుడు, గాడి సుధాకర్ మరియు సిపిఎం పార్టీ గిరిజన శాఖ కార్యదర్శి నాగులూరు వెంకటేష్, పార్టీ సభ్యులు వంశీ, మస్తాన్, పెంచల నరసింహులు, అంకయ్య, బాలేష్,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


