*అద్దె ఒక్క రూపాయే
*ఇతరత్రా ఛార్జీలు అదనం
*పేద , మధ్యతరగతికి అందుబాటులో
*అన్ని సౌకర్యాలు మంత్రి చోరవుతో ఏర్పాటు
* ఇంజనీరింగ్ డిజైన్ లో లోపం వేదిక ఎత్తు తక్కువ
* పార్కింగ్ కొరత – వాహనాలకు రోడ్డే గతి
* అధికారులూ మరోసారి పరిశీలించండి
ఈరోజుల్లో అన్ని సౌకర్యాలు ఉన్న ఫంక్షన్ హాల్స్ దొరకడం చాల కష్టంగా ఉంది .ఒకవేళ దొరికిన అలంటి ఫంక్షన్ హాల్స్ వేలు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది పెద్ద మధ్య తరగతి ప్రజల శుభ అశుభ కార్యక్రమాలకు వెలు లక్షలు ఖర్చు చేసే పరిస్థుతులలో మధ్య తరగతి వాళ్ళకి అంత శక్తీ ఉండటం లేదు కానీ జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో కేవలం ఒక్క రూపాయి అద్దేకే అన్ని సౌకర్యాలు ఉన్న అద్భుతమైన ఫంక్షన్ హాలు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి ఒచ్చింది . మునిసిపల్ సఖ మంత్రి పి నారాయణ చొరవతో కూటమి ప్రభుత్వంలో ఈ ఫంక్షన్ హాల్ తాజాగా నెల్లూరు నగరంలో రూపు దిద్దుకుంది నగరంలోని స్టోన్ హౌస్ పేట సమీపం రేబాల వారి వీధి చివరిలో ఈ కల్యాణ మండపాన్ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 1.30 కోట్లతో నిర్మించింది . 6 నెలల వరకు ఫంక్షన్ హాల్ అద్దెను నెల్లూరు కార్పొరేషన్ ఒక్క రూపాయి గా మాత్రమే నిర్ణయించడం విశేషం . ఈ ఫంక్షన్ హాల్ ను ఆగష్టు నెల 15 వ తేదీన మంత్రి నారాయణ తన చేతుల మీదుగా ప్రారంభించారు . దీనితో ఈ హాలు ప్రారంభమై ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంది . నగరంలోని ప్రజలే కాక జిల్లా లోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఫంక్షన్ హాల్ ను ఉపయోగించుకోవచ్చు . ఫంక్షన్ హాల్ కావాల్సిన వారు నెల్లూరు కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ ఉద్యోగులను సంప్రదించి తమకు కావాల్సిన తేదీలలో సమయాలలో బుక్ చేస్కోవచ్చు . ఈ ఫంక్షన్ హాల్ లో నాలుగు వందల మంది కూర్చొని కార్యక్రమాలను వీక్షించే కెపాసిటీ ఉంది . ఫంక్షన్ హాల్ అంటే ఆశ మాషిగా లేదు . ఈ ఫంక్షన్ హాల్ కు ఏసీ సౌకర్యం కూడా ఉంది . అయితే తొలి వంద యూనిట్ ల వరకు యూనిట్ కు తొమ్మిది రూపాయల వంతున రెండు వందల యూనిట్ లకు 15 రూపాయల వంతున రెండు వందల యూనిట్ లు దాటితే 20 రూపాయల వంతున విద్యుత్ ఛార్జ్ లు చెల్లించాల్సి ఉంది . ఫంక్షన్ హాల్ లోపల అత్యాధునికంగా వేదిక ఉంటుంది . వేదిక కు చెరోవైపు పెళ్ళి కుమారుడి గది , పెళ్లి కుమార్తి గది ఉంటాయి . అలాగే ఫంక్షన్ హాల్ ప్రాంగణంలోనే డైనింగ్ హాల్ సౌకర్యం కూడా ఉంది . అలాగే ఫంక్షన్ హాల్ ను ఆనుకొని పురుషులకు మహిళలకు వేరువేరుగా జిం సౌకర్యం కూడా ఉంది . ఇక లెట్రీన్లు బాత్రూం లు సౌకర్యం చక్కగా పరిశుభ్రంగా ఉన్నాయి . ఫంక్షన్ హాల్ అవరణంలో చక్కని మొక్కలతో గ్రీనరీ ని ఏర్పరచి ఉన్నారు . అవసరానికి తగినంత మంచి నీటిని వాడుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు . ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి 6 నెలల వరకు ఒక్క రూపాయి అద్దేకే ఇచ్చేలా మునిసిపల్ మంత్రి పి నారాయణ ప్రకటించి ఉన్నారు . త్వరలో ఈ ఫంక్షన్ హాల్ ను ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించే యోచన లో కార్పొరేషన్ సిద్ధమై ఇప్పటికే బహిరంగంగా టెండర్ పిలిచి ఉన్నారు . టెండర్ లో ఏదేని ప్రైవేట్ యాజమాన్యం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న కార్పొరేషన్ సూచించిన నియమ నిబంధనల ప్రకారం మలుచుకోవాల్సి ఉంది . ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఈ రూపాయ అద్దె ఫంక్షన్ హాల్ చర్చ ప్రజలలో విపరీతంగా నడుస్తుంది . బహుశా రాష్ట్రంలోనే రాష్ట్ర బ్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్క రూపాయి అద్దేకే దొరికే ఫంక్షన్ హాల్ ఇదే . మొదటిగా రికార్డు ను సొంతం చేసుకుంది .
*వేదిక ఎత్తు తక్కువ అంటూ విమర్శలు
ఈ ఫంక్షన్ హాల్ చీప్ అండ్ బెస్ట్ లో పెద్ద మధ్యతరగతి వర్గాలకు అందు బాటులోకి వచ్చిన ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం జరిగే వేదికను అత్యంత తక్కువ ఎత్తులో నిర్మించడం పట్ల ప్రజలనుంచి వినియోగదారుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి . సంబంధిత నిర్మాణ ఇంజనీరింగ్ ఇంజినీర్ల పర్యవేక్షణ లో ఈ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది .సంబంధిత ఇంజినీర్లు ఈ వేదిక విషయంలో పెద్ద లోపం చేసినట్లు విమర్శలు వస్తున్నాయి . సాధారణంగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో వేదిక ను 2.5 నుంచి 3.5 అడుగుల ఎత్తులో నిర్మిస్తారు కానీ ఈ ఫంక్షన్ హాల్ డిజైన్ రూపొందించిన ఇంజినీర్లు వేదిక ను ఎత్తు లేకుండా చేసి వీక్షకులను ఇబ్బందుల్లోకి నెట్టి వేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు . వేదిక తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మండపంలో వేదిక పైన వధువు వరులు పెళ్లి పీతల మీద కూర్చున్నప్పుడు వెనుక వరుసలలో ఆశీనులైన వీక్షకులకు వారి దృశ్యాలు కనిపించడంలో ఎన్నో లోపాలు తలెత్తుతాయి పూర్తి స్థాయి చిత్రాలను చూడలేకపోతారు . ఈ కల్యాణ మండపానికి లోపల ప్రాంతంలో ఇది ఒక పెద్ద మైనస్ గా కూడా కనిపిస్తుంది . ఇప్పటికైనా కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ అధికారులు దున్న ఈనింది అంటే గాత కట్టేయమన్న సామెత గ కాకుండా మరోసారి వేదిక నిర్మాణాన్ని పరిశీలించి వీలైతే వేదిక ను మరింత ఎత్తు పెంచే చర్యలు తీసుకోవాలని మండపాన్ని వినియోగించుకునే వినియోగదారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు 1.30 కోట్లు ఖర్చు చేసి ఫంక్షన్ హాల్ అయితే నిర్మించారు కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి మంత్రి నారాయణ కలలకు అంతరాయం కలిగించారన్న ఆరోపణలు చేస్తున్నారు . మంత్రి కమీషనర్ లైనా ఆగష్టు 15 న ప్రారంభోత్సవం చేసేందుకు వచ్చిన సందర్భం లో నిర్మాణంలో జరిగిన ఇలాంటి లోపాలను తప్పులను చూసి ఉండాలి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు . ఫంక్షన్ హాల్ కట్టింది ప్రజాధనం ఖర్చు చేయడానికి కాంట్రాక్టర్ లబ్ది పొందడానికి తద్వారా వచ్చే పర్సెంటేజిలు తీసుకోవడానికి కాదు కదా అని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు .
* పార్కింగ్ ఒకటే కొరత.
ఒక్క రూపాయే అద్దెకు ఈ ఫంక్షన్ హాల్ అన్ని సౌకర్యాలతో లభించే అవకాశం ఉన్నా ఈ ఫంక్షన్ హాల్ కు పార్కింగ్ కొరత కనిపిస్తుంది . కార్యక్రమాలకు హాజరు అయ్యే వారి వాహనాలకు పార్కింగ్ మాత్రం లేదు . అధికారులు ఈ ఒక్క విషయంలో ముందు చూపు లేకుండా నిర్మాణం చేశారన్న విమర్శలు వస్తున్నాయి . ఈ ఫంక్షన్ హాల్ కు హాజరు అయ్యేవారి వాహనాలు హాల్ ఎదురుగా ఉన్న రోడ్ లో పార్కింగ్ చేయాల్సి వస్తుంది . ఈ ఫంక్షన్ హాల్ కు ఇది ఒక్కటే మైనస్ గ కనిపిస్తుంది . అయితే మంత్రి నుంచి కార్పొరేషన్ అధికారుల వరకు ఆలోచన చేసి హాల్ కు సమీపంలో ఉన్న సుబ రిజిస్టర్ కార్యాలయం వద్ద కల స్థలంలో పార్కింగ్ వసతి చూపితే ఎంతో బాగుంటుంది అని ప్రజలు విజ్ఞప్తి చేస్తూఇన్నారు . అధికారులు ఈ దశగా అలోచించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు .

అద్భుతమైన ఏసి ఫంక్షన్ హాల్
*అద్దె ఒక్క రూపాయే *ఇతరత్రా ఛార్జీలు అదనం *పేద , మధ్యతరగతికి అందుబాటులో *అన్ని సౌకర్యాలు మంత్రి చోరవుతో ఏర్పాటు * ఇంజనీరింగ్ డిజైన్ లో లోపం వేదిక ఎత్తు తక్కువ * పార్కింగ్ కొరత – వాహనాలకు రోడ్డే గతి * అధికారులూ మరోసారి పరిశీలించండి ఈరోజుల్లో అన్ని సౌకర్యాలు ఉన్న ఫంక్షన్ హాల్స్ దొరకడం చాల కష్టంగా ఉంది .ఒకవేళ దొరికిన అలంటి ఫంక్షన్ హాల్స్ వేలు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది పెద్ద మధ్య తరగతి ప్రజల శుభ అశుభ కార్యక్రమాలకు వెలు లక్షలు ఖర్చు చేసే పరిస్థుతులలో మధ్య తరగతి వాళ్ళకి అంత శక్తీ ఉండటం లేదు కానీ జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో కేవలం ఒక్క రూపాయి అద్దేకే అన్ని సౌకర్యాలు ఉన్న అద్భుతమైన ఫంక్షన్ హాలు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి ఒచ్చింది . మునిసిపల్ సఖ మంత్రి పి నారాయణ చొరవతో కూటమి ప్రభుత్వంలో ఈ ఫంక్షన్ హాల్ తాజాగా నెల్లూరు నగరంలో రూపు దిద్దుకుంది నగరంలోని స్టోన్ హౌస్ పేట సమీపం రేబాల వారి వీధి చివరిలో ఈ కల్యాణ మండపాన్ని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 1.30 కోట్లతో నిర్మించింది . 6 నెలల వరకు ఫంక్షన్ హాల్ అద్దెను నెల్లూరు కార్పొరేషన్ ఒక్క రూపాయి గా మాత్రమే నిర్ణయించడం విశేషం . ఈ ఫంక్షన్ హాల్ ను ఆగష్టు నెల 15 వ తేదీన మంత్రి నారాయణ తన చేతుల మీదుగా ప్రారంభించారు . దీనితో ఈ హాలు ప్రారంభమై ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉంది . నగరంలోని ప్రజలే కాక జిల్లా లోని ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఈ ఫంక్షన్ హాల్ ను ఉపయోగించుకోవచ్చు . ఫంక్షన్ హాల్ కావాల్సిన వారు నెల్లూరు కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ ఉద్యోగులను సంప్రదించి తమకు కావాల్సిన తేదీలలో సమయాలలో బుక్ చేస్కోవచ్చు . ఈ ఫంక్షన్ హాల్ లో నాలుగు వందల మంది కూర్చొని కార్యక్రమాలను వీక్షించే కెపాసిటీ ఉంది . ఫంక్షన్ హాల్ అంటే ఆశ మాషిగా లేదు . ఈ ఫంక్షన్ హాల్ కు ఏసీ సౌకర్యం కూడా ఉంది . అయితే తొలి వంద యూనిట్ ల వరకు యూనిట్ కు తొమ్మిది రూపాయల వంతున రెండు వందల యూనిట్ లకు 15 రూపాయల వంతున రెండు వందల యూనిట్ లు దాటితే 20 రూపాయల వంతున విద్యుత్ ఛార్జ్ లు చెల్లించాల్సి ఉంది . ఫంక్షన్ హాల్ లోపల అత్యాధునికంగా వేదిక ఉంటుంది . వేదిక కు చెరోవైపు పెళ్ళి కుమారుడి గది , పెళ్లి కుమార్తి గది ఉంటాయి . అలాగే ఫంక్షన్ హాల్ ప్రాంగణంలోనే డైనింగ్ హాల్ సౌకర్యం కూడా ఉంది . అలాగే ఫంక్షన్ హాల్ ను ఆనుకొని పురుషులకు మహిళలకు వేరువేరుగా జిం సౌకర్యం కూడా ఉంది . ఇక లెట్రీన్లు బాత్రూం లు సౌకర్యం చక్కగా పరిశుభ్రంగా ఉన్నాయి . ఫంక్షన్ హాల్ అవరణంలో చక్కని మొక్కలతో గ్రీనరీ ని ఏర్పరచి ఉన్నారు . అవసరానికి తగినంత మంచి నీటిని వాడుకునేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు . ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి 6 నెలల వరకు ఒక్క రూపాయి అద్దేకే ఇచ్చేలా మునిసిపల్ మంత్రి పి నారాయణ ప్రకటించి ఉన్నారు . త్వరలో ఈ ఫంక్షన్ హాల్ ను ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించే యోచన లో కార్పొరేషన్ సిద్ధమై ఇప్పటికే బహిరంగంగా టెండర్ పిలిచి ఉన్నారు . టెండర్ లో ఏదేని ప్రైవేట్ యాజమాన్యం పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న కార్పొరేషన్ సూచించిన నియమ నిబంధనల ప్రకారం మలుచుకోవాల్సి ఉంది . ప్రస్తుతం నెల్లూరు నగరంలో ఈ రూపాయ అద్దె ఫంక్షన్ హాల్ చర్చ ప్రజలలో విపరీతంగా నడుస్తుంది . బహుశా రాష్ట్రంలోనే రాష్ట్ర బ్రభుత్వ ఆధ్వర్యంలో ఒక్క రూపాయి అద్దేకే దొరికే ఫంక్షన్ హాల్ ఇదే . మొదటిగా రికార్డు ను సొంతం చేసుకుంది . *వేదిక ఎత్తు తక్కువ అంటూ విమర్శలు ఈ ఫంక్షన్ హాల్ చీప్ అండ్ బెస్ట్ లో పెద్ద మధ్యతరగతి వర్గాలకు అందు బాటులోకి వచ్చిన ఫంక్షన్ హాల్ లో కార్యక్రమం జరిగే వేదికను అత్యంత తక్కువ ఎత్తులో నిర్మించడం పట్ల ప్రజలనుంచి వినియోగదారుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి . సంబంధిత నిర్మాణ ఇంజనీరింగ్ ఇంజినీర్ల పర్యవేక్షణ లో ఈ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది .సంబంధిత ఇంజినీర్లు ఈ వేదిక విషయంలో పెద్ద లోపం చేసినట్లు విమర్శలు వస్తున్నాయి . సాధారణంగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ లో వేదిక ను 2.5 నుంచి 3.5 అడుగుల ఎత్తులో నిర్మిస్తారు కానీ ఈ ఫంక్షన్ హాల్ డిజైన్ రూపొందించిన ఇంజినీర్లు వేదిక ను ఎత్తు లేకుండా చేసి వీక్షకులను ఇబ్బందుల్లోకి నెట్టి వేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు . వేదిక తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మండపంలో వేదిక పైన వధువు వరులు పెళ్లి పీతల మీద కూర్చున్నప్పుడు వెనుక వరుసలలో ఆశీనులైన వీక్షకులకు వారి దృశ్యాలు కనిపించడంలో ఎన్నో లోపాలు తలెత్తుతాయి పూర్తి స్థాయి చిత్రాలను చూడలేకపోతారు . ఈ కల్యాణ మండపానికి లోపల ప్రాంతంలో ఇది ఒక పెద్ద మైనస్ గా కూడా కనిపిస్తుంది . ఇప్పటికైనా కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇంజనీరింగ్ అధికారులు దున్న ఈనింది అంటే గాత కట్టేయమన్న సామెత గ కాకుండా మరోసారి వేదిక నిర్మాణాన్ని పరిశీలించి వీలైతే వేదిక ను మరింత ఎత్తు పెంచే చర్యలు తీసుకోవాలని మండపాన్ని వినియోగించుకునే వినియోగదారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు 1.30 కోట్లు ఖర్చు చేసి ఫంక్షన్ హాల్ అయితే నిర్మించారు కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి మంత్రి నారాయణ కలలకు అంతరాయం కలిగించారన్న ఆరోపణలు చేస్తున్నారు . మంత్రి కమీషనర్ లైనా ఆగష్టు 15 న ప్రారంభోత్సవం చేసేందుకు వచ్చిన సందర్భం లో నిర్మాణంలో జరిగిన ఇలాంటి లోపాలను తప్పులను చూసి ఉండాలి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు . ఫంక్షన్ హాల్ కట్టింది ప్రజాధనం ఖర్చు చేయడానికి కాంట్రాక్టర్ లబ్ది పొందడానికి తద్వారా వచ్చే పర్సెంటేజిలు తీసుకోవడానికి కాదు కదా అని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు . * పార్కింగ్ ఒకటే కొరత. ఒక్క రూపాయే అద్దెకు ఈ ఫంక్షన్ హాల్ అన్ని సౌకర్యాలతో లభించే అవకాశం ఉన్నా ఈ ఫంక్షన్ హాల్ కు పార్కింగ్ కొరత కనిపిస్తుంది . కార్యక్రమాలకు హాజరు అయ్యే వారి వాహనాలకు పార్కింగ్ మాత్రం లేదు . అధికారులు ఈ ఒక్క విషయంలో ముందు చూపు లేకుండా నిర్మాణం చేశారన్న విమర్శలు వస్తున్నాయి . ఈ ఫంక్షన్ హాల్ కు హాజరు అయ్యేవారి వాహనాలు హాల్ ఎదురుగా ఉన్న రోడ్ లో పార్కింగ్ చేయాల్సి వస్తుంది . ఈ ఫంక్షన్ హాల్ కు ఇది ఒక్కటే మైనస్ గ కనిపిస్తుంది . అయితే మంత్రి నుంచి కార్పొరేషన్ అధికారుల వరకు ఆలోచన చేసి హాల్ కు సమీపంలో ఉన్న సుబ రిజిస్టర్ కార్యాలయం వద్ద కల స్థలంలో పార్కింగ్ వసతి చూపితే ఎంతో బాగుంటుంది అని ప్రజలు విజ్ఞప్తి చేస్తూఇన్నారు . అధికారులు ఈ దశగా అలోచించి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అంటున్నారు .

