ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు
నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవళంపేట గ్రామంలో గుర్తుతెలియైన దుండగులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పుంటిచ్చి తగలబెట్టడం సిగ్గుచేటని, దుండగులను వెంటనే అరెస్ట్ చేసి
ఈయొక్క రాష్ట్రం లో ఇలాంటి కార్యకలాపాలకి పాల్పడినటువంటి వ్యక్తులపై
పీడీ యాక్ట్ పెట్టి 1989 వచ్చినటువంటి అట్రాసిటీ యాక్ట్ ఫైల్ చేసి కఠినంగా
శిక్షించాలి అని, అలా శిక్షించని ఎడల రాష్ట్రవ్యాప్తంగా అన్ని మాల ఉద్యోగుల సంఘం లు,మాల సంఘాలు ఉద్యమం చేస్తాం అని అశోక్ బాబు హెచ్చరించారు
, రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అని, మన భారతదేశానికి
రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకి ప్రొటెక్షన్ కల్పించాలని ,
సామాజిక న్యాయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దళితుల మీద జరుగుతున్న దాడుల మీద స్పందించకపోవడం ఇది ఎక్కడ సామాజిక న్యాయమని అశోక్ బాబు ఎద్దేవా చేశారు
ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా మాలల జేఏసీ అధ్యక్షులు కొప్పోలు ఏడుకొండలు గారు,
గౌరవ సలహాదారులు మేడిది రవి, ప్రకాశం జిల్లా మీడియా కోఆర్డినేటర్ శాంతారావు, ఉపాధ్యక్షులు మేడికొండ లక్ష్మీనారాయణ, ఉద్యోగుల సంఘం నాయకులు టి శ్రీకాంత్ మరియు ప్రకాశం జిల్లా మాలల జేఏసీ, ఉద్యోగ సంఘ నాయకులు
..కూటమి ప్రభుత్వాన్ని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం, మాలల జేఏసీ డిమాండ్ చేశారు.


