పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 22 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల జిల్లాలో 8000 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యక్రాంతమయ్యాయని 2400 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు నెల రోజుల్లో విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామని సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు ఆరోపణలకు ఆధారాలు భూముల వివరాలను ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు ఈ అంశంపై ఆర్టిఐ ద్వారా వివరాలు సేకరిస్తూ న్యాయపరంగా ముందుకు వెళ్లనున్నారని తెలిపారు



