దమ్మాయిగూడ:
వినాయక చవితి పండగను పురస్కరించుకుని ముప్పా రామారావు గారు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల ఉత్సవ కమిటీలకు తన వంతుగా ఆర్థిక సాయాన్ని అందించి ఉదారత చాటుకున్నారు. చవితి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో వివిధ వార్డుల్లోని కాలనీలకు ఈ క్రింది విధంగా విరాళాలు అందజేశారు:
రూ. 10,116/- — తిరుమల ఎన్క్లేవ్ ఫేజ్-2 (10వ వార్డు)
రూ. 5,116/- — రాజిరెడ్డి నగర్ ఎక్స్‌టెన్షన్ (15వ వార్డు)
రూ. 5,116/- — భావన రుషి హౌసింగ్ సొసైటీ, 80 ఫీట్ల రోడ్డు (పద్మశాలి టౌన్‌షిప్)
ఈ సందర్భంగా ఆయా కాలనీల ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ప్రజలు ముప్పా రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
— సందీప్, మేడ్చల్ జిల్లా ‘పున్నమి’ రిపోర్టర్



