Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఐదుగురు అరెస్ట్ నగదు, వాహనాలు, ఫోన్లు స్వాధీనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి: ఐదుగురు అరెస్ట్ నగదు, వాహనాలు, ఫోన్లు స్వాధీనం

వార్త ముఖ్యాంశాలు

  • కీసర: తిమ్మాయపల్లి రెవెన్యూ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఒక పేకాట స్థావరంపై కీసర పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.
  • ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
  • ​కీసర ఎస్ఐ (SI) నేతృత్వంలో సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను ఎస్హెచ్ఓ (SHO) వెల్లడించారు.

కీసర:
తిమ్మాయపల్లి రెవెన్యూ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఒక పేకాట స్థావరంపై కీసర పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
​కీసర ఎస్ఐ (SI) నేతృత్వంలో సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ దాడులకు సంబంధించిన వివరాలను ఎస్హెచ్ఓ (SHO) వెల్లడించారు. తిమ్మాయపల్లి పరిధిలో పేకాట ఆడుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి స్థావరంపై దాడి జరిపారు.
​ఈ దాడుల్లో నిందితుల నుంచి రూ. 35,000 రోక్కం, 5 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు మరియు పేకాట ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వార్తా మూలాలు

  • Keesara police stationపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *