Thursday, 10 September 2026

Tag: #బుచ్చిమండలం #అన్నారెడ్డిపాలెం #విద్యుత్అంతరాయం #ప్రజాసమస్యలు #విద్యార్థులఇబ్బందులు #విద్యుత్‌శాఖ #నెల్లూరుజిల్లా

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బుచ్చి పరిసర మూడు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ అంతరాయం:ఎస్ ఈ గారు మా ఘోష పట్టించో కొండి

బుచ్చి మండలం అన్నారెడ్డిపాలెం పరిసర గ్రామాల్లో గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళ చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు తెలిపారు. నిరంతర విద్యుత్ అందిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత విద్యుత్ శాఖ ఎస్‌ఈ స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు. వ్యవసాయ పనులు, గృహ అవసరాలు కూడా ప్రభావితమవుతున్నాయని, మరమ్మతులు చేపట్టి నిరంతర సరఫరాను పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.