మీ సమస్య నాకు చెప్పండి” : ప్రియాంక దండి
విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానిక ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, ఆ సమస్యలను వారు నా దృష్టికి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు ఇంచార్జ్ ప్రియాంక దండి తెలిపారు. స్థానిక నాయకులు, అధికారులు సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను తిప్పుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై దృష్టి పెడతామని, ప్రజలు తమ సమస్యలను పార్టీ కార్యాలయ ఇమెయిల్ priyankadandioffice@gmail.com ద్వారా లేదా వాట్సాప్ నెంబర్ 6305821260 కు పంపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పైన తెలిపిన ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి, పార్టీ కార్యాలయానికి నేరుగా వచ్చి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రియాంక దండి తెలిపారు.@all


