Wednesday, 12 August 2026

Tag: పొలిటికల్

ఖమ్మం

కళాశాలల్లో ఏబీవీపీ సభ్యత్వ నమోదు

ఖమ్మం ఆగష్టు 11 (పున్నమి న్యూస్) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఖమ్మం నగర శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని పలు కళాశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఏబీవీపీ సభ్యత్వాన్ని స్వీకరించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యారంగ అభివృద్ధి, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మం

పాస్‌బుక్ లేని రైతులకూ ఎరువులు అందించాలి: బి. కె యస్.

ఖమ్మం ఆగష్టు 11 (పున్నమి ప్రతినిధి) ఖమ్మం: పట్టా పాస్‌బుక్కులు లేని రైతులకు ఎరువులు అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ఖమ్మం జిల్లా అధ్యక్షులు పగడవరపు శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ పుల్లయ్యను కలిసి రైతుల సమస్యపై చర్చించారు. గతంలో పాస్‌బుక్కులు లేని రైతులు యూరియా కోసం ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులకు అన్యాయం జరగకుండా జిల్లా కలెక్టర్‌తో మరోసారి చర్చించి చర్యలు తీసుకుంటామని శ్రీ పుల్లయ్య హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.

ఖమ్మం

సంగమేశ్వర స్వామి భూములపై సర్వే.. 120 ఎకరాలే గుర్తింపు

ఖమ్మం ఆగష్టు 11 (పున్నమి ప్రతి నిధి) ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 150 ఎకరాల దేవాదాయ మాన్యం భూములు అన్యాక్రాంతమైనట్లు అధికారుల దృష్టికి రావడంతో మంగళవారం వరంగల్ ఎండోమెంట్ కమిషనరేట్ నుంచి వచ్చిన సర్వేయర్ సర్వే నిర్వహించారు. ప్రస్తుతం 120 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. గిరిజన రైతులకు సంబంధించిన భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. ముస్లింలకు సంబంధించిన భూముల సర్వేకు వారు అభ్యంతరం వ్యక్తం చేసి సరిహద్దు రాళ్లు వేయకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో వేణుగోపాలచార్యులు, ఆలయ ఇన్‌స్పెక్టర్ సమత, గుమస్తాలు, పోలీస్ సిబ్బంది, బీజేపీ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్, టీఆర్ఎస్ నాయకులు భూక్యా శంకర్, మాజీ సర్పంచ్ బాలు నాయక్, మలోత్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

ఋగ్వేదం స్కూల్ కరెస్పాండెంట్ భాను ప్రకాష్ బీజేపీలో చేరిక

ఖమ్మం ఆగష్టు 11 (పున్నమి న్యూస్) ఖమ్మం నగరం లోని ఋగ్వేదం స్కూల్ కరెస్పాండెంట్ బొర్రా భాను ప్రకాష్ బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో, ఓబీసీ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు రేఖ సత్యనారాయణ యాదవ్ సారథ్యంలో ఆయన పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు భాను ప్రకాష్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు వేల్పుల సుధాకర్,ధనియాకుల వెంకట్ నారాయణ అ నంత్ ఉపేందర్ గౌడ్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.