Monday, 17 August 2026

Tag: నిజామాబాద్

నిజామాబాద్

పలు శుభ కార్యక్రమాలకు హాజరైన ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్,

*తేదీ: 16-08-2026* *తేదీ: 16-08-2026 ఆదివారం నాడు ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఆర్మూర్ పట్టణంలో పలు వివాహాది వేడుకలకు, శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను కలిశారు. అనంతరం విజయ్ అగర్వాల్ గృహప్రవేశం మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయన వెంట ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, హైమద్, గంగా మోహన్, బ్యాంకు నవీన్, తదితరులు పాల్గొన్నారు.*

నిజామాబాద్

ఆలూరు మండలంలో టీ కొట్టు ముచ్చట్లు ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్,

*తేదీ: 16-08-2026 ఆదివారం నాడు ఆలూరు మండల కేంద్రంలో “టీ కొట్టు ముచ్చట్లు” కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ గారు ఆలూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో మిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానికులను పలకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. ఆలూరు గ్రామం అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. అలాగే స్థానిక చెరువును సందర్శించారు. చెరువును పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులను కోరారు. అనంతరం గ్రామంలో పలువురిని పలకరించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యోగక్షేమాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కెవి రమణ, రజనీష్ కిరాడ్, హైమద్, తదితరులు పాల్గొన్నారు.*

నిజామాబాద్

డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణి,

నిజామాబాద్ జిల్లా లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డ్ అందించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, రూలర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు గ్రామ సర్పంచులు ఉప సర్పంచ్లు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలకు భారీ ఎత్తున ప్రజలు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు…. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం అందించి లేనివారికి ఒక రెండు కిలోల బియ్యం ఎక్కువచ్చిన పర్వాలేదని సభ ముఖం మీద తెలిపారు, రైస్ మిల్లలో అవకతవకలు జరుగుతున్నాయని సుదర్శన్ రెడ్డికి పేర్కొన్నారు, ఎస్ ఐ ఆర్ సర్వేలో భాగంగా కొన్ని ఓట్లను తొలగించారు, మళ్లీ కొన్నిచోట్ల యాడ్ అయినట్లు తెలిసిందన్నారు ప్రభుత్వం వెంటనే తొలగించాలని సుదర్శన్ రెడ్డికి తెలిపారు….

నిజామాబాద్

వివాహ శుభ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులతో ముచ్చటిస్తున్న ఈరవత్రి రాజశేఖర్ ——————*

ఆర్మూర్ పట్టణం శ్రీరామకాలనీకి చెందిన చిన్నరెడ్డి పుత్రుని వివాహం హైదరాబాద్లో శనివారం జరిగింది. ఈ వివాహానికి ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ వివాహానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ రెడ్డి, ఈరవత్రి అనిల్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఈరవత్రి రాజశేఖర్ గారు కాంగ్రెస్ నాయకులు సునీల్ రెడ్డి, ఈరవత్రి అనిల్ లను భోజన సమయంలో కలుసుకొని పలు అంశాలపై, ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.

నిజామాబాద్

పాఠశాల విద్యార్థుల కోసం డిజిటల్ బోర్డ్,

నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బోర్డులు మరియు ఇతర విద్యా సామగ్రి కోసం రూ.25,000/- ఆర్థిక సహాయం అందించినందుకు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దూడ వెంకటేష్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది. విద్యాభివృద్ధికి అందించిన ఈ సహకారం అభినందనీయం. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు.

నిజామాబాద్

మండలం కేంద్రంలోని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

*నందిపేట్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూడ వెంకటేష్ గారు జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 🇮🇳* *ఈ కార్యక్రమంలో నందిపేట్ టౌన్ ప్రెసిడెంట్ కాంతం చిన్నయ్య గారు, నందిపేట్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం గారు, నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మంద మహిపాల్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పిప్పెర సాయి రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.*

నిజామాబాద్

గ్రామ గ్రామాల్లో రిపలేపల ఆడుతున్న త్రివర్ణ పథకాలు,

నందిపేట్ మండలం కేంద్రంలో ఐలాపూర్ గ్రామం గ్రామపంచాయతీ ఆవరణలో మువ్వలన జెండాను గ్రామ సర్పంచ్ మీసాలlలక్ష్మీనారాయణ ఎగరవేశారు, హై స్కూల్ పిల్లలతో జాతీయ గీతాన్ని పిల్లలతో పాడించి జెండా ఎగరవేశారు….

నిజామాబాద్

గ్రామ గ్రామాల్లో రిపలేపల ఆడుతున్న త్రివర్ణ పథకాలు,

నందిపేట్ మండలం కేంద్రంలో ఐలాపూర్ గ్రామం గ్రామపంచాయతీ ఆవరణలో మువ్వలన జెండాను గ్రామ సర్పంచ్ మీసాలlలక్ష్మీనారాయణ ఎగరవేశారు, హై స్కూల్ పిల్లలతో జాతీయ గీతాన్ని పిల్లలతో పాడించి జెండా ఎగరవేశారు….

నిజామాబాద్

ఈరోజు వైన్స్ షాప్ లు బంద్

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా వైన్స్ లు, చికెన్, మటన్, షాపులు బంద్ పాటించాలి. లేనిపక్షంలో కేసులు నమోదు అవుతాయని కమిషనర్ తెలిపారు..

నిజామాబాద్

జాతీయ పక్షి నెమలిని రక్షించిన ఫారెస్ట్ అధికారులు..

రోడ్డుపై ప్రమాదానికి గురైన జాతీయ పక్షి, నెమలిని ఆర్మర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు రక్షించారు. వేల్పర్ మండలంలోని లక్కోర గ్రామ రహదారిపై శుక్రవారం నెమలి ప్రమాదానికి గురికాగా, స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు వెళ్లి రోడ్డు ప్రమాదంతో గాయపడ్డ జాతీయ పక్షి నెమలిని రక్షించారు. దీంతో ఎఫ్ ఆర్ ఓ బి, అరుణ్ కుమార్, డిప్యంటీ ఎఫ్ ఆర్ ఓ శ్రీదేవి లు ఆర్మర్లోని ఫారెస్ట్ కార్యాలయానికి తీసుకొచ్చి చికిత్స అందించారు. వీరితో పాటు, ఎస్ఆర్ఆ కార్యాలయ సిబ్బంది, డ్రైవర్ సాజిద్, తదితరు….

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.