Friday, 2 October 2026

Tag: జనగామ

జనగాం

భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్బంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ కు ఘనంగా సన్మానం

భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్బంగా జనగామ జిల్లా లో బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జీవన జ్యోతి ఆధ్వర్యంలో ధర్మ కంచ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో అంగన్వాడీ టీచర్ ల కు, ఆయాలకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ 140 కోట్ల జనాభా గల భారత దేశం లో మహిళలంటే మోడీ కి చాలా గౌరవం, ఎక్కడ అయితే మహిళా మణులకు గౌరవం లభిస్తుందో అక్కడ ధర్మం, న్యాయం, సత్యం దేశ అభివృద్ధి లో ఉంటుంది అనేది ప్రధాని ప్రగాఢ నమ్మకం.కేంద్ర ప్రభుత్వం లో నిర్మల సీతా రామన్ మహిళకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పదవి ,ఢిల్లీ ముఖ్య మంత్రి పదవి కూడా మహిళ కే ఇవ్వడం జరిగింది. దేశ చరిత్ర లోనే మొట్ట మొదటి సారిగా మహిళా బిల్లు 33% పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది మోడీ ప్రభుత్వమే. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధానకార్యదర్శి తోకల ఉమా రాణి, మహిళ మోర్చా జిల్లా ఇంచార్జి ఎనగందుల కళ్యాణి, రమ, అవంతిక, నీలిమ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు Uploaded Video:

జనగాం

జనగామ మున్సిపాలిటీ 74 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహణ :మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి

​జనగామ మున్సిపాలిటీ 74 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహణ ———————————————————————– జనగామ, అక్టోబర్ 1,పున్నమి జిల్లా ప్రతినిధి : జనగామ పురపాలక సంఘం (మున్సిపాలిటీ) స్థాపించబడి 74 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో 74వ జన్మదిన వేడుకలను అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా మున్సిపాలిటీ పురోగతి, పట్టణాభివృద్ధి, మరియు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ​ముఖ్య విశేషాలు: ​కేక్ కటింగ్ వేడుక: పురపాలక సంఘం 74 వసంతాలు పూర్తి చేసుకున్న సంతోషంతో చైర్పర్సన్ గారు,కమిషనర్, వైస్ చైర్మన్, అధికారులు, కౌన్సిలర్లు, మరియు సిబ్బంది కలసి కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. ​పట్టణాభివృద్ధికి పునరంకితం: జనగామ పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా, మరియు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ​ప్రజా సేవలు: తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, హరితహారం మరియు మౌలిక వసతుల కల్పనలో మున్సిపాలిటీ నిరంతరం ముందుంటుందని తెలిపారు. ​ఈ వేడుకలో చైర్పర్సన్,కమిషనర్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జనగాం

భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్బంగా అనాథ ఆశ్రమం లో పండ్లు పంపిణీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా పురస్కరించుకొని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ రవి ఆధ్వర్యంలో గిర్నిగడ్డలోని రాజరాజేశ్వరి అనాధ ఆశ్రమంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సౌడ రమేష్ మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు మహిళా సంక్షేమంఉజ్వల యోజన రైతు సంక్షేమం కోసం ఫసల్ బీమా యోజన రైతు కిసాన్ సామాన్ నిధి రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని ముద్ర యోజన వీధి వ్యాపారులకు అండగా ఉంటుందని సంక్షేమ పథకాలే కాకుండా తెలంగాణలో అత్యాధునికమైన సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని అందులో జనగామ రైల్వే స్టేషన్ ఉన్నదని మోడీ గారు తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని వారికి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శివరాజ్ యాదవ్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ఉమారాణి ఓబీసీ మోర్చా జిల్లా ఇన్చార్జ్ సోమయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ద జగదీష్ రమేష్ శ్రీనివాస్ శివకృష్ణ పూర్ణచందర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

జనగాం

అక్టోబర్ జనగామ మున్సిపల్ పరిధిలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు –కమిషనర్ రాజశేఖర్ రెడ్డి

జనగామ మున్సిపల్ పరిధిలో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు –కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ——————————————— పురపాలక సంఘ కార్యాలయం పరిధిలో మాంసం మరియు చికెన్ విక్రయదారులకు తెలియచేయనది ఏమనగా అక్టోబర్ 2వ తేది నాడు గాంధీ జయంతి సందర్బంగా జీవహింస చేయరాదు. అతిక్రమించిన వారి యొక్క ట్రేడ్ లైసెన్స్ రద్దు పరుస్తూ జరిమానా విధించి చట్ట రీత్య తగు చర్యలు తీసుకొనిబడునని జనగామ మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి తెలిపారు

జనగాం

వినాయక లడ్డు వేలం పాట 39,001 కు దక్కించుకున్న ఏపూరి మోక్షజ్ఞ

వినాయక లడ్డు వేలం పాట 39,001కు దక్కించుకున్న ఏపూరి మోక్షజ్ఞ ——————————————————————– గణేష్ నవరాత్రోత్సవ సందర్బంగా ఎల్ బి నగర్ సాతవాహన నగర్ 3/1 వార్డు లో నెలకొల్పిన వినాయక మండపం లో నిర్వాహకులు లడ్డు వేలం పాట పాడారు. ఈ వేలం పాటలో స్థానికులు భక్త జనం పాల్గొన్నారు. ఏపూరి అశోక్ కుమార్, స్వాతి దంపతుల కుమారుడు ఏపూరి మోక్షజ్ఞ విజయకరణ్ పాఠశాల 6వ తరగతి విద్యార్థి లడ్డు వేలం పాట లో పాల్గొని తల్లిదండ్రులను ఒప్పించి తాను నవరాత్రుల ఉత్సవాలు కొరకు పొదుపు చేసుకున్న డబ్బులతో వినాయక ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ లడ్డు ను ముప్పై తొమ్మిది వేల ఒక రూపాయలకు దక్కించుకున్నామని అశోక్ కుమార్ తెలిపారు.

జనగాం

ఇందిరమ్మ ఇళ్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ మంజూరు లో పారదర్శకత -వదంతులను నమ్మవద్దు :మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి

ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరులో పారదర్శకత – వదంతులను నమ్మవద్దు: మున్సిపల్ కమిషనర్ రాజ శేఖర్ రెడ్డి ———————————————————————- జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు/డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు మంజూరు విషయంలో ఒక లబ్ధిదారురాలి నుంచి రూ.1,00,000/- డిమాండ్ చేసినట్లు వచ్చిన సమాచారంపై మున్సిపల్ కమిషనర్ శ్రీ రాజశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత లబ్ధిదారురాలిని పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా సంబంధిత మున్సిపల్ సిబ్బందిని కూడా విచారించగా, మున్సిపల్ ఉద్యోగులు ఎవరూ తన ఇంటికి రాలేదని, తనను ఎవరూ డబ్బులు అడగలేదని, తాను కూడా ఎవరికీ ఎటువంటి డబ్బులు చెల్లించలేదని లబ్ధిదారురాలు స్పష్టం చేసినట్లు కమిషనర్ తెలిపారు. అయితే, ఒక గుర్తుతెలియని వ్యక్తి తన ఇంటికి వచ్చి రూ.1,00,000/- అడిగినట్లు ఆమె తెలిపిందన్నారు. ఈ విషయంపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో మున్సిపల్ సిబ్బందికి ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించబడినట్లు కమిషనర్ తెలిపారు. గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ సందీప్ కుమార్ ఝా IAS గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా, డ్రా విధానం ద్వారా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. కాబట్టి ప్రజలు ఆధారాలు లేని వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఎవరైనా ఇళ్ల మంజూరు పేరుతో డబ్బులు డిమాండ్ చేసినా లేదా అనుమానాస్పదంగా వ్యవహరించినా సంబంధిత ఆధారాలతో జనగామ మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిషనర్ సూచించారు. అటువంటి ఫిర్యాదులపై విచారణ జరిపి, వాస్తవాలు నిర్ధారణ అయిన పక్షంలో నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. — మున్సిపల్ కమిషనర్ జనగామ మున్సిపాలిటీ

జనగాం

ఘనపూర్ (స్టేషన్ ) మున్సిపాలిటీ లో 2బి బార్ ఏర్పాటు కోసం దరఖాస్తుల ఆహ్వానం :జిల్లా అబ్కారి శాఖ అధికారి ఎన్. అంజిరెడ్డి

ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీలో 2B బార్ ఏర్పాటు కోసం దరఖాస్తుల ఆహ్వానం ———————————————————————- దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు *లాటరీ ద్వారా ఎంపిక.. అక్టోబర్ 16న ఉదయం 11 గంటలకు* జిల్లాలో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధి ఏర్పాటుతో పట్టణ జనాభా పెరగడం, పట్టణ స్థానిక సంస్థల (ULBs) పరిధి విస్తరణ/విలీనం నేపథ్యంలో 2B బార్ల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ఘన్‌పూర్ (స్టేషన్) మున్సిపాలిటీ పరిధిలో ఒక 2B బార్ ఏర్పాటు కోసం ఆసక్తి గల దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు *జిల్లా అబ్కారీ శాఖ అధికారి ఎన్. అంజిరెడ్డి* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ (బార్ ద్వారా విక్రయానికి లైసెన్స్ మంజూరు, లైసెన్స్ షరతులు) రూల్స్, 2005 ప్రకారం.. ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు 27.09.2026న దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ అయిందని పేర్కొన్నారు. *దరఖాస్తు రుసుము రూ.1,00,000/-* గా ఉందని, ఆసక్తి గల దరఖాస్తుదారులు 12.10.2026 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలన్నారు. దరఖాస్తులను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు, 12.10.2026 వరకు స్వీకరిస్తారన్నారు. *దరఖాస్తులు సమర్పించాల్సిన ప్రదేశాలు* 1. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయం, జనగామ జిల్లా, రూమ్ నంబర్ S-8, 2వ అంతస్తు, IDOC కాంప్లెక్స్, జనగామ జిల్లా. 2. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం, వరంగల్, హెచ్. నం. 24-7/211/5/1, ప్రగతి నగర్, ఆర్‌ఈసీ దర్గా రోడ్ సమీపంలో, కాజీపేట, వరంగల్. 3. కమిషనర్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, తెలంగాణ రాష్ట్ర కార్యాలయం, అబ్కారీ భవన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కాంప్లెక్స్, నాంపల్లి, హైదరాబాద్. *లాటరీ ద్వారా ఎంపిక* దరఖాస్తుదారుల ఎంపిక కోసం 16.10.2026న ఉదయం 11.00 గంటలకు లాటరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. *దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పత్రాలు* 1. నిర్ణీత నమూనాలో *ఫారం–1(A)* లో దరఖాస్తు. 2. ప్రతి దరఖాస్తుకు రూ.1,00,000/- (ఒక లక్ష రూపాయలు) తిరిగి చెల్లించబడని రుసుముగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, జనగామ జిల్లా పేరుతో డీడీ (లేదా) చలాన్. 3. మూడు కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు. 4. ఆధార్ కార్డు (లేదా) పాన్ కార్డు స్వీయ ధృవీకరించిన ప్రతులు. 2B బార్‌లకు సంబంధించిన నోటిఫికేషన్, పట్టణ స్థానిక సంస్థల (ULBs) జాబితా, షెడ్యూల్, తదితర పూర్తి వివరాల కోసం http://tgbcl.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. ఈ మేరకు అర్హత కలిగిన ఆసక్తి గల దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని, నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. *వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లు:* జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, జనగామ – ఎన్. అంజిరెడ్డి: 87126 58996 ఎస్‌హెచ్‌ఓ, ఘన్‌పూర్: 87126 59006

జనగాం

పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

పట్టభద్రుల ఎమ్మెల్సీ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ ———————————————————————– వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కొత్త ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ విడుదలైనట్లు *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సందీప్ కుమార్ ఝా* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 నవంబర్ 1ని అర్హత తేదీగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 01-11-2026 నాటికి కనీసం 3 సంవత్సరాల క్రితం డిగ్రీ పూర్తి చేసిన అర్హత కలిగిన అభ్యర్థులు Form-18 దరఖాస్తును AEROలకు (లేదా) నియమిత అధికారికి సమర్పించాలన్నారు. నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 20 వరకు ముసాయిదా జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి, నవంబర్ 25న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబర్ 25లోగా వాటిని పరిష్కరించి, సప్లిమెంట్లను సిద్ధం చేస్తారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.

జనగాం

ఆర్ టీ సీ కార్మికులు బహుజన వర్కర్స్ యూనియన్ పోస్టర్ ఆవిష్కరణ

జనగామలో ‘బహుజన వర్కర్స్ యూనియన్’ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ ఆవిష్కరణ:టి ఆర్ పి జిల్లా నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ మాచర్ల బిక్షపతి,జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ——————————————————————- ఆర్టీసీ కార్మిక లోకానికి తీన్మార్ మల్లన్న కొండంత అండ. *ఆర్టీసీ కార్మికుల కోసం తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం.. ఆరు నెలల్లో విలీనం కాకుంటే సంఘం రద్దు.!* *ఆర్టీసీ కార్మికుల బాధలు ఖతం చేస్తాం.. ఒక్క అవకాశం ఇవ్వండి: టీఆర్పీ నేతల పిలుపు…* జనగామ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, బహుజన వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు.. జనగామ జిల్లా ఆర్టీసీ బస్టాండ్ కేంద్రంలో బహుజన వర్కర్స్ యూనియన్” ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ సిహెచ్ సంపత్ ముదిరాజ్. స్టేట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ సాజిద్. టీఆర్పీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ మాచర్ల బిక్షపతి, టీఆర్పీ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ హాజరై మేనిఫెస్టో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజన శ్రమజీవుల, కార్మికుల హక్కుల రక్షణ కోసం మరియు శ్రమదోపిడీకి వ్యతిరేకంగా జరిగే ఈ ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి, అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. తీన్మార్ మల్లన్న గారి ఆశయాల సాధన కోసం, బహుజనుల శ్రమశక్తికి చట్టసభల్లో సరైన స్థానం దక్కేలా పోరాడే అభ్యర్థులను ఆదరించాలి. తీన్మార్ మల్లన్న ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఈ ఎన్నికల ప్రచారాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆర్టీసీ అనుబంధ బహుజన్ వర్కర్ యూనియన్ తరఫున ఆయన కార్మికులకు ఒకటే భరోసా ఇస్తున్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో గెలిచిన 6 నెలల్లోగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించకపోతే నా సంఘాన్ని రద్దు చేస్తా’ అని మల్లన్న సవాల్‌తో కూడిన కార్యక్రమంలో మీ అందరి బాగు కోసం, మీ హక్కుల కోసం నిరంతరం కష్టపడుతున్న తీన్మార్ మల్లన్న గారికి, బహుజన వర్కర్స్ యూనియన్‌కు ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ బాధలన్నీ ఖతం చేస్తాం అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ అడిషనల్ జనరల్ సెక్రెటరీ రవి కిరణ్.ఎన్ ధర్మారావు,సత్యనారాయణ. కుషాయిగూడ బస్ డిపో సెక్రెటరీ ఎం దుర్గేష్ గౌడ్.స్టేట్ ట్రెజరర్ కుమార్ కురుమ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ అఫ్సర్ ,రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ అమ్జద్ పాషా, జిల్లా మైనార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీఫ్,టౌన్ మైనారిటీ యూత్ ప్రెసిడెంట్: అబ్దుల్ రహీమ్,ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్ పానుగంటి నరసింగరావు,జిల్లా యూత్ ప్రెసిడెంట్ యామంకి విజయ్, మల్లేష్ మరియు ఆర్టీసీ కార్మికుల తదితరులు పాల్గొన్నారు

జనగాం

రహదారి భద్రత చర్యలను వేగవంతం చేయాలి :జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రహదారి భద్రతా చర్యలను వేగవంతం చేయాలి-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ————————————————————- *ఘనపూర్, చిన్న పెండియాల్, కరుణాపురం ఎఫ్ఓబీ (FOB) పనుల్లో వేగం పెంచాలి* *ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లోనే అత్యవసర వైద్యం అందేలా చర్యలు* *పాఠశాల బస్సుల్లో నిఘా నేత్రాల ఏర్పాటు, వాటి పనితీరును తనిఖీ చేయాలి* *హైవేలపై రంబుల్ స్ట్రిప్స్, థర్మోప్లాస్టిక్ పాయింట్ల ఏర్పాటుతో వేగ నియంత్రణ* *అనధికార పార్కింగ్‌లను తొలగించాలి* *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* జిల్లాలో రహదారి భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధికారులను ఆదేశించారు. బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో *డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై రహదారి భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణ, అనధికార పార్కింగ్‌లు, రహదారి సూచికలు, లైటింగ్, సర్వీస్ రోడ్లు, వాహనాల వేగ నియంత్రణ, తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ క్రమంలో జాతీయ రహదారి-163పై ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాటు, రహదారి సూచికల (సైనేజ్) అప్‌గ్రేడేషన్, జనగామ పట్టణానికి సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు *ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, కలెక్టర్‌కు* వివరించారు. ఈ నేపథ్యంలో *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. కోమల్ల టోల్ ప్లాజా వద్ద అనధికార పార్కింగ్‌ను తొలగించాలని, కరుణాపురం ప్రాంతంలోని మద్యం దుకాణాల వద్ద పార్కింగ్ సమస్యలను పరిష్కరించి, రహదారిపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అనధికార పార్కింగ్‌ను కూడా తొలగించాలని సూచించారు. ఘనపూర్ (స్టేషన్), చిన్న పెండ్యాల, కరుణాపురం ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి (FOB) నిర్మాణాలను వేగవంతం చేసి, పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో రంబుల్ స్ట్రిప్స్, థర్మోప్లాస్టిక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జనగామ పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతంలోని రహదారి వద్ద ఉన్న వేగ నియంత్రణకు సంబంధించి బెల్ మార్క్‌ను సరిచేసి, వాహనాల రాకపోకలకు అనుకూలంగా సాఫీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎల్లమ్మ దేవాలయం వద్ద అవసరమైన లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాల బస్సుల్లో నిఘా నేత్రాలను (సీసీ టీవీ కెమెరాలు) ఏర్పాటు చేయడం (లేదా) ఇప్పటికే ఉన్న సీసీ టీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల రవాణా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్‌లోనే అత్యవసర వైద్య సేవలు అందేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సమీపంలోని అత్యవసర వైద్య సేవలు అందించే ఆసుపత్రికి బాధితులను వీలైనంత తక్కువ సమయంలో తరలించేలా గ్రీన్ ఛానల్, ఆసుపత్రుల మ్యాపింగ్, రూట్ మ్యాపింగ్ సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం *డీసీపీ* మాట్లాడుతూ.. పెంబర్తి వై-జంక్షన్ వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవాబుపేట కర్వ్ వద్ద రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేసి, వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, కిరణ్ ప్రకాష్, ఘనపూర్ (స్టేషన్) ఏసిపి భీం శర్మ, ఆర్టీఏ సభ్యులు చిలువేరు అభి గౌడ్, నేషనల్ హైవేస్ హెచ్ఎంఆర్ఈ మధుసూదన్ రెడ్డి, జనగామ, ఘనపూర్ (స్టేషన్) మున్సిపల్ కమిషనర్లు రాజశేఖర్ రెడ్డి, రాధాకృష్ణ, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీఎంహెచ్ఓ వాణిశ్రీ, డీపీఓ వెంకట్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.