Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Vijayawada…. Education

ఎన్ టి ఆర్ జిల్లా

“Green Careers for a Sustainable Tomorrow: Forestry Education and Opportunities with Biodiversity .. Guest Lecture in SDMSMK…. VJA

విజయవాడ: శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోని వృక్షశాస్త్ర విభాగం మరియు ఎకోక్లబ్ ఆధ్వర్యంలో, IQAC చొరవతో “Green Careers for a Sustainable Tomorrow: Forestry Education and Opportunities with Biodiversity Conservation” అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఆగస్టు 31, 2026న వెబినార్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి V. మనోజ్ రెడ్డి, M.Sc. Forestry (Forest Biology and Tree Improvement), Guest Faculty, Acharya Nagarjuna University రిసోర్స్ పర్సన్‌గా హాజరై విద్యార్థులకు అటవీ విద్య, అటవీ రంగంలోని వృత్తి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి మరియు జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అటవీ సంపద పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ సమతుల్యత మరియు స్థిరమైన అభివృద్ధిలో యువత పాత్రను ఆయన వివరించారు. అటవీ శాస్త్రంలో ఉన్న ఉన్నత విద్య, ఉద్యోగ మరియు కెరీర్ అవకాశాలను విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అడవుల పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ మరియు పర్యావరణ బాధ్యతపై అవగాహన పెంపొందింది. ప్రకృతి పరిరక్షణతో పాటు అర్థవంతమైన, స్థిరమైన కెరీర్‌లను ఎంచుకునేందుకు ఈ కార్యక్రమం విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. P. V. దుర్గావతి ప్రోత్సహించగా, వృక్షశాస్త్ర విభాగాధిపతి మరియు ఎకోక్లబ్ కన్వీనర్ T. సలోమి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

PB సిద్ధార్థ కళాశాలలో యువ కవితాగానం…. 29.8.2026

సిద్ధార్థ కళా పీఠం &PB సిద్ధార్థ తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29 -08-2026 వ తేదీన పి.బి .సిద్ధార్థ కళాశాలలో విద్యార్థులకు యువ కవితా గానం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థినులు పాల్గొని పలువురి ప్రశంసలను అందుకున్నారు. 2 ndAI కె. కృష్ణవేణి పి .దీప్తి పి. సుజన ఎం. జయ శ్రీ కె. వసుంధర బి. దివ్యశ్రీ ..ఎం. దుర్గా శ్రీ 2nd కెమిస్ట్రీ .. పి. విజయ్ కుమారి ఆర్. సిరి లక్ష్మి3rdBA. ప్రిన్సిపల్ డాక్టర్ పి దుర్గావతి తెలుగు విభాగ అధ్యక్షులు డా. సరళ. డా.మంజుల హర్షం వ్యక్తం చేశారు..

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

*శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల NAAC A ++ (కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని అటానమస్ కళాశాల, మచిలీపట్నం) 29.08.2026 వ తేదీన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. దుర్గావతి మేడం అధ్యక్షతన “కవయిత్రీ విజయం” అనే రూపక సాహితీ సదస్సు నిర్వహించబడినది. “కవయిత్రీ విజయం” అనే రూపకాన్ని రచించినది, నిర్వహించినది …..జాతీయ స్థాయి ఉత్తమ రచయిత్రీ అవార్డు గ్రహీత… శ్రీమతి మందరపు హైమవతి గారు. ఈ రూపకంలోని పాత్రలన్నీ భావోద్వేగాలతో, ఆదర్శ భావాలతో, సమస్యా పరిష్కారాలతో పోషింపబడ్డాయి. మొత్తంగా శ్రీవాద కవయిత్రులను పరిచయం చేశారు. ప్రతీ పాత్రనూ ఎంతో రసవంతంగా జీవింపజేయడం జరిగింది. *ఈ రూపకంలోని పాత్రలు – పాత్రధారులు :* 1. చావలి బంగారమ్మ -శ్రీమతి ఆలపాటిసత్యవతి 2. వాణి రంగారావు- శ్రీమతి.పాటిబండ్ల కవిత 3. పుట్ల హేమలత – డా. ఓలేటి ఉమాసరస్వతి 4. కొండపల్లి కోటీశ్వరమ్మ -శ్రీమతి కర్రి రాధాకృష్ణ 5. సావిత్రి -శ్రీమతి పంచాగ్నుల కృష్ణవేణి 6. శివలంక రాజేశ్వరీ దేవి – చింతలూరి ఉమాదేవి 7. రేవతి దేవి – యామినీ కృష్ణ బండ్లమూడి…. వీరు ఈ రూపకం ద్వారా స్త్రీవాద రచయిత్రుల రచనల్లో స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం,హక్కులు ప్రధానంగా కనిపింపజేశారు. “స్త్రీ కేవలం కుటుంబానికే పరిమితమైన వ్యక్తిగా కాకుండా, తన స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, ఆశయాలు కలిగిన వ్యక్తిగా గుర్తించాలి అని కోరారు. స్త్రీకి పురుషుడితో సమానమైన హక్కులు, అవకాశాలు కల్పించాలి, స్త్రీ తన జీవితంపై స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని,స్త్రీపై జరిగే వివక్ష,అణచివేత,హింస తొలగాలని,విద్యా ఉద్యోగం సామాజిక రంగాల్లో స్త్రీకి సమాన అవకాశాలు ఉండాలని,స్త్రీ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ స్వతంత్రంగా ఎదగాలని, స్త్రీ బలహీనురాలు కాదని ….ఆమెకు స్వేచ్ఛ సమానత్వం పురుషులతో సమాన గౌరవం అవసరం….అనే సందేశాన్ని ఈ రూపకం ద్వారా విద్యార్థులకు తెలియజేశారు. ఆద్యంతం అత్యంత ఆసక్తికరంగా జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.వి. దుర్గావతి మేడం, తెలుగు విభాగాధిపతి డా. కె. సరళ, తెలుగు విభాగాధ్యాపకులు డాక్టర్ ఐ. మంజుల, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ప్రాంగణంలో క్యాంపస్ టు టెక్ ఎనేబుల్ ఫైనాన్సియల్ కెరీర్ అనే అంశం మీద విద్యార్థులకు 24 -8- 2026న అవగాహన సదస్సు…..

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగం వారు కళాశాల ప్రాంగణంలో క్యాంపస్ టు టెక్ ఎనేబుల్ ఫైనాన్సియల్ కెరీర్ అనే అంశం మీద విద్యార్థులకు 24 -8- 2026న అవగాహన సదస్సును నిర్వహించారు మరియు TNS ఇండియా ఫౌండేషన్ వారితో MOU తీసుకున్నారు ఈ కార్యక్రమానికి మిస్టర్ కౌశిక్ పరియా ,ప్రోగ్రామ్ స్పెషలిస్ట్, ఫైనాన్స్,TNS ఇండియా ఫౌండేషన్, రిసోర్స్ పర్సన్ గా విచ్చేసి Fintech లోని ఉపాధి అవకాశాల గురించి వివరించారు. కమ్యూనికేషన్, టైం మేనేజ్మెంట్ , లీడర్ షిప్, డేసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్, బ్యాంకింగ్ నాలెడ్జ్, డేటా ఇంటర్ప్రిటేషన్, portfolio మేనేజ్మెంట్ అండ్ డిజిటల్ లిటరసీ అనే అంశాలు BFSI సెక్టార్ కి చాలా ముఖ్యమని వివరించారు . 54 రోజుల శిక్షణలో పవర్ BI మరియు అడ్వాన్స్డ్ Excel course లు అందజేస్తామని పొందుపరిచారు. ప్రిన్సిపల్(I/C) డాక్టర్. పి.వి దుర్గావతి ప్రసంగిస్తూ TNS ఇండియా ఫౌండేషన్ సంస్థతో చేసుకున్న అవగాహన ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని విద్యార్థులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్(I/C) డాక్టర్. పి.వి దుర్గావతి, వాణిజ్య మరియు మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్. వి. సంధ్యా లక్ష్మి, అధ్యాపకులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు