Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

రబీలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రబీలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.
  • గురువారం బైంసాలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
  • నియోజకవర్గంలోని అన్ని మండలాలకు 9 వేల బస్తాల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రబీ సీజన్‌లో రైతులు శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. గురువారం బైంసాలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు 9 వేల బస్తాల శనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా సబ్సిడీపై అందించేలా ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, వ్యవసాయ శాఖ అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *