వర్షాకాల పనులపై మేయర్ ఆదేశాలు
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్ సోమవారం మేయర్ ఛాంబర్‌లో 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ సమస్యలపై ప్రజారోగ్య శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. వారధి, పెట్రోల్ బంక్ డౌన్ ప్రాంతాల్లో వర్షాకాలానికి ముందే సీసీ రోడ్లు, డ్రైన్లు, అవసరమైన ఇతర పనులు చేపట్టి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఇంజనీరింగ్ విభాగం డి.ఈ, ఏ.ఈ పాల్గొన్నారు.


