Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు బిట్-2లో సింగవరపు సుధారాణి ఘన విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు బిట్-2లో సింగవరపు సుధారాణి ఘన విజయం

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: మండలంలోని బిట్-2 ఎంపీటీసీ స్థానంలో సింగవరపు సుధారాణి ఘన విజయం సాధించారు.
  • ప్రత్యర్థులపై 748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.
  • ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆమె మద్దతుదారులు, అనుచరుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

దుత్తలూరు: మండలంలోని బిట్-2 ఎంపీటీసీ స్థానంలో సింగవరపు సుధారాణి ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై 748 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆమె మద్దతుదారులు, అనుచరుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈ విజయంతో ఆమె వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. ఓటర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని సుధారాణి తెలిపారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. బిట్-2లో ఆమె సాధించిన ఈ విజయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *