Thursday, 24 September 2026

Tag: #SaveNelloreEducation #GenZStandUp #ప్రభుత్వవిద్య

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యా హక్కుల కోసం మేల్కో నెల్లూరు

నెల్లూరులో ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల కొరతతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆరోపించింది. ప్రభుత్వ ఇంజనీరింగ్, పీజీ, లా, మెడికల్, ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. డీకే మహిళా కళాశాల, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐలకు మౌలిక వసతులు, శాశ్వత అధ్యాపకులను కల్పించాలని కోరింది. మూతపడిన ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పునఃప్రారంభించాలని, విద్యా హక్కుల కోసం యువత ప్రశ్నించాలని పిలుపునిచ్చింది. ఈమేరకు పీఏఏపీ నేతలు స్పష్టం చేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.