Wednesday, 30 September 2026

Tag: #Rapur #RapurNews #RoadAccident #RoadAccidentNews #NelloreNews #AndhraPradeshNews #BreakingNews #AccidentNews #RoadSafety #TrafficAccident #Nellore #APNews #LocalNews #TeluguNews #LatestNews

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోళ్ల వ్యాను ఢీకొని ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

రాపూరు: మండలంలోని బండేపల్లి రెస్ట్ బిల్డింగ్ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటగిరి వైపు వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన కోళ్ల వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చల్లటూరుకు చెందిన శివారెడ్డి (35) అక్కడికక్కడే మృతి చెందారు. బైకుపై ఉన్న తాతిపల్లికి చెందిన గోపాల్ (68) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను రాపూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.