Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Public

మహబూబాబాద్

ఆబాది భూముల రీ సర్వే రికార్డుల ప్రక్రియను పరిశీలించిన మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి

ఆబాది భూముల రీ సర్వే రికార్డుల ప్రక్రియను పరిశీలించిన మరిపెడ తహసీల్దార్ కృష్ణవేణి మరిపెడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆబాది భూముల రీ సర్వే కార్యక్రమంలో భాగంగా మరిపెడ మండలంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మరిపెడ మండల తహసీల్దార్ కృష్ణవేణి రీ సర్వేకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, సర్వే ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రీ సర్వే పనులు పారదర్శకంగా, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని సూచించారు. అనంతరం క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఆబాది భూముల రీ సర్వే పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామపాలన అధికారి రమేష్, తెలంగాణ ప్రభుత్వ లైసెన్స్ పొందిన సర్వేయర్లు భూక్య రాము నాయక్, శివకుమార్, గ్రామ సిబ్బంది నాన్నయ్య, వెంకటాద్రి, గ్రామ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

టోల్‌ప్లాజాల సమీప నివాసులకు కేంద్రం తీపి కబురు.. ఏడాదికి రూ.1,500కే స్థానిక పాస్‌!

*20 కిలోమీటర్ల పరిధిలో ఉండే వారికి ప్రత్యేక రాయితీ.. నవంబర్ 1 నుంచి కొత్త విధానం అమలు.. వాణిజ్యేతర వాహనాలకే అవకాశం..* హైదరాబాద్, అక్టోబర్ 30 | జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. ముఖ్యంగా టోల్‌ప్లాజాల సమీపంలో నివసిస్తూ నిత్యం రాకపోకల కోసం టోల్‌ చార్జీలు చెల్లిస్తున్న స్థానిక ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేక రాయితీ పాస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన వాహన యజమానులు ఇకపై ఏడాదికి ఒకేసారి నిర్ణీత మొత్తం చెల్లించి స్థానిక పాస్‌ పొందవచ్చు. ఈ కొత్త విధానం 2026 నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. *ఏడాదికి ఎంత చెల్లించాలి?* కొత్త నిబంధనల ప్రకారం టోల్‌ప్లాజా ఉన్న ప్రాంతాన్ని బట్టి వార్షిక పాస్‌ ధర నిర్ణయించారు. * మున్సిపల్ లేదా పట్టణ పరిధికి వెలుపల ఉన్న టోల్‌ప్లాజాలకు ఏడాదికి రూ.1,500. * మున్సిపల్ లేదా స్థానిక పట్టణ పరిధిలో ఉన్న టోల్‌ప్లాజాలకు ఏడాదికి రూ.3,000. ఈ మొత్తాన్ని చెల్లించి అర్హత కలిగిన స్థానిక వాహనదారులు నిర్దిష్ట టోల్‌ప్లాజా వద్ద వార్షిక రాయితీ పాస్‌ పొందవచ్చు. దీనివల్ల ప్రతిసారీ టోల్‌ చార్జీలు చెల్లించాల్సిన అవసరం తగ్గుతుంది. *ఎవరికి ఈ అవకాశం వర్తిస్తుంది?* టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన వ్యక్తిగత వాహన యజమానులు ఈ పాస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ సౌకర్యం వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే వ్యక్తిగత వినియోగానికి ఉపయోగించే అర్హత కలిగిన కార్లు వంటి వాహనాలకు ఈ అవకాశం ఉంటుంది. ట్యాక్సీలు, ఇతర వాణిజ్య వాహనాలకు ఈ రాయితీ వర్తించదు. అలాగే వాహనానికి చెల్లుబాటు అయ్యే, సక్రమంగా పనిచేసే ఫాస్టాగ్‌ (FASTag) తప్పనిసరిగా ఉండాలి. నివాస పరిధి, వాహన అర్హత తదితర నిబంధనలను సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాతే పాస్‌ జారీ చేస్తారు. *ప్రతి టోల్‌ప్లాజాకు ఒకే పాస్‌ కాదు!* ఈ కొత్త విధానంలో మరో ముఖ్యమైన నిబంధన ఉంది. ఒక టోల్‌ప్లాజాకు సంబంధించి పొందిన స్థానిక పాస్‌ అదే టోల్‌ప్లాజా వద్ద మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మరో టోల్‌ప్లాజాకు వెళ్లినప్పుడు ఈ పాస్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఇతరులకు బదిలీ చేయడానికి కూడా వీలుండదు. ఒక ప్రాంతానికి సంబంధించిన పాస్‌తో దేశంలోని అన్ని టోల్‌ప్లాజాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని భావించకూడదు. *ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?* కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం 2026 నవంబర్ 1 నుంచి అర్హత కలిగిన టోల్‌ప్లాజాల వద్ద వార్షిక స్థానిక పాస్‌ అందుబాటులో ఉంటుంది. అలాగే డిసెంబర్ 1, 2026 నుంచి రాజ్‌మార్గ్‌యాత్ర (Rajmargyatra) మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఈ పాస్‌ పొందే సౌకర్యం అందుబాటులోకి రానుంది. వాహనదారులు తమ సమీప టోల్‌ప్లాజా వద్ద అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోవచ్చు. *కొన్ని ప్రాంతాలకు ఈ రాయితీ వర్తించదు!* ఈ పథకానికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై క్లోజ్డ్‌ యూజర్‌ ఫీ కలెక్షన్‌ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ఈ స్థానిక పాస్‌ వర్తించదు. అలాగే వాహనదారులు వినియోగించేందుకు సర్వీస్‌ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో ఉన్న సందర్భాల్లో కూడా ఈ పాస్‌ జారీ చేయరు. కాబట్టి టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా రాయితీ లభిస్తుందని భావించకూడదు. *స్థానిక ప్రజలకు ఎంత ప్రయోజనం?* టోల్‌ప్లాజాల సమీప గ్రామాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య, వైద్యం తదితర అవసరాల కోసం ప్రతిరోజూ ప్రయాణాలు చేస్తుంటారు. ఒక్కోసారి టోల్‌ చార్జీలు చెల్లించడం వల్ల నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒకే టోల్‌ప్లాజాను తరచూ దాటే స్థానిక వాహనదారులకు ఈ వార్షిక పాస్‌ ఆర్థికంగా ఉపయోగపడే అవకాశం ఉంది. *కేంద్రం కీలక నిర్ణయం.. స్థానిక ప్రయాణికులకు ఊరట!* కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 26న జారీ చేసిన సవరణ నోటిఫికేషన్‌ ద్వారా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. జాతీయ రహదారుల రుసుముల నిర్ణయం, వసూలుకు సంబంధించిన 2026 ఐదో సవరణ నిబంధనల కింద ఈ మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఫాస్టాగ్‌ వినియోగం విస్తరించిన నేపథ్యంలో స్థానిక ప్రజలకు ప్రయాణ ఖర్చులు తగ్గించే మరో అవకాశం కల్పించినట్లయింది. మొత్తానికి నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం టోల్‌ప్లాజాల సమీపంలో నివసించే అర్హులైన వ్యక్తిగత వాహనదారులకు ప్రయోజనం చేకూర్చనుంది. అయితే పాస్‌ తీసుకునే ముందు తమ నివాస ప్రాంతం, వాహనం, సమీప టోల్‌ప్లాజా ఈ నిబంధనలకు అర్హత పొందుతున్నాయో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.

మహబూబాబాద్

వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకున్న మామిండ్ల వెంకన్నకు మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ పరామర్శ

ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.. రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు బాగుంటుంది: డీఎస్ రెడ్యా నాయక్ చింతపల్లి, అక్టోబర్ 29 (పున్నమి): మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల వెంకన్న ఇటీవల వెన్నుముక శస్త్రచికిత్స చేయించుకోగా, గురువారం ఆయన స్వగృహానికి వెళ్లి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డీఎస్ రెడ్యా నాయక్ పరామర్శించారు. వెంకన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనలు పాటిస్తూ, తగిన విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా డీఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమని, ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని వెంకన్నకు భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తిరిగి సాధారణ జీవనంలోకి రావాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకరికొకరు అండగా నిలుస్తూ కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో సమష్టి కృషితో గట్టి పోటీ ఇచ్చేలా ఇప్పటి నుంచే ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగాలని ధైర్యాన్ని నింపినట్లు తెలిసింది. ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య, బొజ్జ నాయక్, పెద్ది వెంకన్న, ఎర్ర బాలాజీ, బికోజి, శ్రీశైలం, నరహరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్

మహబూబాబాద్

మేఘ్య తండాలో మాజీ ఉపసర్పంచ్‌ను పరామర్శించిన డి.ఎస్. రెడ్యా నాయక్

*చిన్నగూడూరు మండలం, మేఘ్య తండా*: డోర్నకల్ నియోజకవర్గం, చిన్నగూడూరు మండలం మేఘ్య తండా గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ శ్రీ భూక్య బాసు నాయక్ గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న డోర్నకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ డి.ఎస్. రెడ్యా నాయక్ గారు ఈరోజు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా బాసు నాయక్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. వారితోపాటు చిన్నగూడూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డి.ఎస్ రాంసింగ్ గారు ప్రధాన కార్యదర్శి కరే ధారాసింగ్ గారు. మండల యువజన నాయకులు వల్లూరి చెన్నారెడ్డి గారు. మండల యూత్ అధ్యక్షులు దుండి మురళి గారు. సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీరాములు గారు. గాడి పెళ్లి శీను గారు. అంబిరీష గారు. మేఘ్యతండా గ్రామ శాఖ అధ్యక్షులు భూక్య చిరంజీవి గారు. ఉప సర్పంచ్. గూగులోత్ వీరన్న గారు. వార్డు సభ్యులు. బాదావత్ జ్యోతి రెడ్డి గారు బాధావత్ వెన్నెల శ్రీకాంత్ గారు. నాయకులు బాదావత్ బాస్య గారు. తదితరులు

మహబూబాబాద్

బురహాన్‌పురంలో ఆబాది భూముల రీ- సర్వే

బురహాన్‌పురంలో ఆబాది భూముల రీ- సర్వే రీ సర్వేకు సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరిపెడ, అక్టోబర్ 29 (పున్నమి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బురహాన్‌పురం గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం ఆబాది భూముల రీ సర్వే నిర్వహించారు. గ్రామంలోని ఇళ్ల స్థలాల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ రీ సర్వే ప్రక్రియను చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలనాధికారి రమేష్, గ్రామ పంచాయతీ అధికారి, కార్యదర్శి మంజుల, గ్రామ సర్పంచ్ గుగ్గిల వెంకటమ్మ, ఉపసర్పంచి పెద్ద బోయిన సురేష్ , కెసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ పెద్ద బోయిన ఐలమల్లు, గ్రామ పెద్దలు పాల్గొని రీ సర్వే ప్రక్రియకు సహకరించారు. గ్రామ ప్రజలు తమ ఆబాది ఇంటి స్థలాలకు సంబంధించిన వివరాలను సర్వే సిబ్బందికి అందిస్తూ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ రీ సర్వే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ లైసెన్స్‌డ్ సర్వేయర్లు భూక్య రాము నాయక్, బాదావత్ శివకుమార్ పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఆబాది భూముల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసి, ఇంటి స్థలాల సరిహద్దులు, భూముల వివరాలను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని ఆబాది భూముల వివరాలను స్పష్టంగా గుర్తించేందుకు, భవిష్యత్తులో భూ సరిహద్దులకు సంబంధించిన సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు,గ్రామ సిబ్బంది ఆబోతు నాన్నయ్య, గుగ్గిళ్ళ వెంకటాద్రి గ్రామ పెద్దలు పాల్గొని రీ సర్వే ప్రక్రియకు సహకరించారు. గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలకు సర్వే బృందం కృతజ్ఞతలు తెలిపింది.

మహబూబాబాద్

ఏక్తా దివస్ జాతీయ కార్యక్రమానికి ఉపాధ్యాయుడు డా. వి. గోపీనాథ్ ఎంపిక

*గూడూరుకు గర్వకారణం* *ఏక్తా దివస్ జాతీయ కార్యక్రమానికి ఉపాధ్యాయుడు డా. వి. గోపీనాథ్ ఎంపిక* మహబూబాబాద్: గుజరాత్ రాష్ట్రం, నర్మదా జిల్లాలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (Statue of Unity) వద్ద కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న *’సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి – ఏక్తా దివస్ (జాతీయ సమైక్యతా దినోత్సవం) – అక్టోబర్ 31, 2026’* కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన *ఒక్కరు మారినా చాలు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు డా. వి. గోపీనాథ్* ఎంపిక కావడం గర్వకారణం. ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లా నుండి 5 గురు విశిష్ట వ్యక్తులను ఎంపిక చేయగా, అందులో ఒకరిగా తనకు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని డా. గోపీనాథ్ తెలిపారు. తనను ఎంపిక చేసిన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహించే అధికారిక పర్యటన అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ సమైక్యతా స్ఫూర్తిని చాటుతానని ఆయన పేర్కొన్నారు. గతంలో సేవా కార్యక్రమాలకు గాను డా. వి. గోపీనాథ్ ఢిల్లీ వేదికగా డా. బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు, గౌరవ డాక్టరేట్ అవార్డు మరియు 2025 జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్నారు.

మహబూబాబాద్

ప్రైవేటు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి – మాజీ మంత్రి

_*ప్రైవేటు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్*_ *మహబూబాబాద్, అక్టోబర్ 28:* _మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని *గాదె రుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్‌లో* ప్రైవేటు ఉపాధ్యాయులతో సమావేశమైన *మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* రానున్న నల్గొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రైవేటు ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు_ _ఇదే పాఠశాలలో తన ఇద్దరు పిల్లలు చదువుకున్నారని, ప్రస్తుతం వారు వైద్యవృత్తిలో కొనసాగుతున్నారని గుర్తుచేసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు_ _ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ,* తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రైవేటు విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు అందించిన సహకారం, చేసిన కృషి అభినందనీయమని అన్నారు,*గాదె రుక్మారెడ్డి పాఠశాల కరస్పాండెంట్, ప్రైవేటు స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TRASMA) మహబూబాబాద్ మండల అధ్యక్షులు శ్రీ కమ్మగాని కృష్ణమూర్తి గౌడ్ గారు* తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని అభినందించారు_ _ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని, ఇంకా ఓటరుగా నమోదు కాని అర్హులైన ఉపాధ్యాయులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర అర్హులైన గ్రాడ్యుయేట్లను సైతం ఓటరుగా నమోదు చేయించేందుకు కృషి చేయాలని కోరారు_ _ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు, వారి హక్కులు, సంక్షేమం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, వారి గౌరవం, హక్కుల పరిరక్షణకు పార్టీ తరఫున కృషి చేస్తామని తెలిపారు_ _ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారు, పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కమ్మగాని కృష్ణమూర్తి గౌడ్ గారు,డైరెక్టర్ వీణ గోపి కృష్ణ, ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు_

మహబూబాబాద్

బానోతు రామన్న నాయక్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి:LHPS రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమా నాయక్

*భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి!* *పెద్దగూడూరు మండలం, ఏపూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు బానోతు రామన్న నాయక్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ, ఆయనను వారి స్వగ్రామంలోని నివాసంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా* *ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమా నాయక్, MCPI కేంద్ర కమిటీ సభ్యులు పానుగంటి నరసయ్య డిమాండ్** తేదీ:-28/10/2026 📍మహబూబాబాద్ జిల్లా, పెద్దగూడూరు మండలం మహబూబాబాద్ జిల్లా పెద్దగూడూరు మండలం ఏపూరు గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు బానోతు రామన్న నాయక్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని లంబాడి హక్కుల పోరాట సంఘం (LHPS) రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ భీమా నాయక్, ఎంసీపీఐ కేంద్ర కమిటీ సభ్యులు పానుగంటి నరసయ్య అన్నారు. పెద్దగూడూరు మండల పరిధిలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు, భూసంబంధిత అక్రమాలను అడ్డుకునేందుకు, వన్ ఆఫ్ 70 చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులపై, భూస్వాములపై, రియల్ ఎస్టేట్ మాఫియా కార్యకలాపాలపై బానోతు రామన్న నాయక్ పోరాటం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బుధవారం పానుగంటి నరసయ్య నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రజల భూములు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యమ నాయకుడిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, దాడికి పాల్పడిన వారితో పాటు వారికి సహకరించినట్లు తేలిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హమైన ఆధారాలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం సంబంధిత భూస్వాములపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. **బానోతు రామన్న నాయక్‌పై దాడికి పాల్పడిన వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని, బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని** వారు స్పష్టం చేశారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే LHPS ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో LHPS పార్లమెంట్ ఇన్‌చార్జి బానోత్ రాందాస్ నాయక్, LHPS వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ చందులాల్ నాయక్, DSFI గూడూరు మండల ఇన్‌చార్జి బానోతు దేవేందర్, DSFI జిల్లా నాయకులు శివవర్మ నాయక్, లావుడియా నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

రేషన్ కార్డుదారులకు తీపి కబురు!

బియ్యంతో పాటు మరో ఆరు నిత్యావసర సరుకుల పంపిణీపై ప్రతిపాదన? సంక్రాంతి నుంచి అమలవుతుందా? ప్రభుత్వ నిర్ణయంపై పేద కుటుంబాల్లో ఆసక్తి! హైదరాబాద్, అక్టోబర్ 28 (పున్నమి న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు అదనపు నిత్యావసర సరుకులు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటికే రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పొందుతున్న లబ్ధిదారులకు బియ్యంతో పాటు మరో ఆరు రకాల నిత్యావసర వస్తువులను కూడా పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట కల్పించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశంగా భావిస్తున్నారు. బియ్యంతో పాటు ఏయే సరుకులు అందించనున్నట్లు ప్రచారం? ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదన ప్రకారం రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు కందిపప్పు, పామాయిల్, చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండి పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సరుకులను సబ్సిడీ ధరలకు అందిస్తారా? ఒక్కో రేషన్ కార్డుకు ఎంత పరిమాణంలో కేటాయిస్తారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రతినెలా కుటుంబ అవసరాల కోసం మార్కెట్‌లో నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే పేద కుటుంబాలకు కొంతమేర ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంటుంది. సంక్రాంతి కానుకగా అందిస్తారా? వచ్చే సంక్రాంతి పండుగ నాటికి అదనపు నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభమవుతుందనే ప్రచారం లబ్ధిదారుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే, సరుకుల కొనుగోలు, నిల్వలు, రవాణా, పంపిణీ విధానం, ప్రభుత్వంపై పడే వ్యయం వంటి అంశాలపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. సంక్రాంతి నుంచే పంపిణీ ప్రారంభమవుతుందనే విషయంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చినప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. కోట్లాది మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే అవకాశం తెలంగాణలో పెద్ద సంఖ్యలో కుటుంబాలు ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను కూడా అందిస్తే, మార్కెట్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఉపయోగకరంగా ఉండనుంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు, నిరుపేద వర్గాలకు ఈ తరహా పథకాలు ఎంతో తోడ్పడతాయి. అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు రేషన్ కార్డుదారులకు అదనపు సరుకులు పంపిణీ చేసే ప్రతిపాదన అమల్లోకి వస్తుందా? వస్తే ఏయే సరుకులు అందిస్తారు? వాటి ధరలు, పరిమాణాలు ఎలా ఉంటాయి? సంక్రాంతి నుంచే పంపిణీ ప్రారంభమవుతుందా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. గమనిక: అదనపు ఆరు సరుకుల పంపిణీ, సంక్రాంతి నుంచి అమలు వంటి అంశాలు ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ప్రతిపాదనలుగానే ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించే వరకు వీటిని ఖరారైన పథకంగా భావించరాదు. వార్త: భూక్య రాము నాయక్ పున్నమి న్యూస్ రిపోర్టర్ మరిపెడ | మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.. అమరుల సేవలను స్మరిస్తూ మరిపెడలో పోలీసుల సైకిల్ ర్యాలీ

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరులకు ఘన నివాళి అమరుల సేవలను స్మరిస్తూ మరిపెడలో పోలీసుల సైకిల్ ర్యాలీ మరిపెడ, అక్టోబర్ 28 (పున్నమి న్యూస్): “మీ త్యాగం వృథా కాదు.. ప్రజల గుండెల్లో మీ స్థానం శాశ్వతం” అనే సందేశంతో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మరిపెడ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీస్ అమరవీరుల సేవలు, ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్రజలకు తెలియజేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారు. పండుగలు, ఉత్సవాలు, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు వంటి సందర్భాల్లోనూ ప్రజలకు అండగా నిలుస్తూ సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ కార్యక్రమం చాటిచెప్పింది. అమరవీరుల త్యాగాలు యువతకు స్ఫూర్తి పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, పోలీసుల సేవల పట్ల గౌరవభావాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. అమరుల త్యాగాలను కేవలం ఒక వారోత్సవానికి పరిమితం చేయకుండా, వారి స్ఫూర్తిని నిత్యజీవితంలో ఆచరించాలని సందేశమిచ్చారు. సమాజంలో శాంతి, భద్రతలు నెలకొనాలంటే ప్రజలు పోలీసులకు సహకరించాలని, చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని ఈ కార్యక్రమం ద్వారా సూచించారు. పోలీస్ అమరవీరులకు ఘన నివాళి “ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి. వారి సేవలు భావితరాలకు మార్గదర్శకాలు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే వారికి అర్పించే నిజమైన నివాళి” అనే సందేశాన్ని ఈ ర్యాలీ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ ఎల్. పవన్ కుమార్, మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్, ఎస్‌ఐ మైబూబీ, చిన్నగూడూరు ఎస్‌ఐ కుశ కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ ర్యాలీ ప్రజల్లో చైతన్యం నింపింది. — భూక్య రాము నాయక్ పున్నమి న్యూస్ రిపోర్టర్ మరిపెడ, మహబూబాబాద్ జిల్లా