Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

ప్రైవేటు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి – మాజీ మంత్రి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రైవేటు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి – మాజీ మంత్రి

_*ప్రైవేటు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి – మాజీ మంత్రి సత్యవతి రాథోడ్*_

*మహబూబాబాద్, అక్టోబర్ 28:*

_మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని *గాదె రుక్మారెడ్డి మెమోరియల్ హైస్కూల్‌లో* ప్రైవేటు ఉపాధ్యాయులతో సమావేశమైన *మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మహబూబాబాద్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు* రానున్న నల్గొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రైవేటు ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు_

_ఇదే పాఠశాలలో తన ఇద్దరు పిల్లలు చదువుకున్నారని, ప్రస్తుతం వారు వైద్యవృత్తిలో కొనసాగుతున్నారని గుర్తుచేసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు_

_ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ,* తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రైవేటు విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు అందించిన సహకారం, చేసిన కృషి అభినందనీయమని అన్నారు,*గాదె రుక్మారెడ్డి పాఠశాల కరస్పాండెంట్, ప్రైవేటు స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (TRASMA) మహబూబాబాద్ మండల అధ్యక్షులు శ్రీ కమ్మగాని కృష్ణమూర్తి గౌడ్ గారు* తెలంగాణ ఉద్యమంలో చేసిన కృషిని అభినందించారు_

_ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని, ఇంకా ఓటరుగా నమోదు కాని అర్హులైన ఉపాధ్యాయులు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర అర్హులైన గ్రాడ్యుయేట్లను సైతం ఓటరుగా నమోదు చేయించేందుకు కృషి చేయాలని కోరారు_

_ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు, వారి హక్కులు, సంక్షేమం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, వారి గౌరవం, హక్కుల పరిరక్షణకు పార్టీ తరఫున కృషి చేస్తామని తెలిపారు_

_ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు శ్రీ బానోత్ శంకర్ నాయక్ గారు, పాఠశాల కరస్పాండెంట్ శ్రీ కమ్మగాని కృష్ణమూర్తి గౌడ్ గారు,డైరెక్టర్ వీణ గోపి కృష్ణ, ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు_

ప్రైవేటు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలి – మాజీ మంత్రి

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *