Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Public

మహబూబాబాద్

పాలేరు రిజర్వాయర్ పాత కాలువ వద్ద పోలీసుల గస్తీ.. నీటి విడుదలపై రైతుల్లో ఆందోళన!

రెండు పంటలు సాగు చేసుకోలేమోనని అన్నదాతల ఆవేదన ఖమ్మం జిల్లా: పాలేరు రిజర్వాయర్ పరిధిలోని పాత కాలువ ద్వారా సాగునీటి విడుదల విషయంలో నెలకొన్న పరిస్థితులతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలువ వద్ద నీటి విడుదలను అడ్డుకునే పరిస్థితులు నెలకొన్నాయని, పోలీసులు రాత్రింబవళ్లు గస్తీ కాస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో సాగునీటిపై ఆధారపడిన రైతులు తమ పంటల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులకు సాగునీరు అందకపోతే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడుల కోసం అప్పులు చేసి సాగు చేస్తున్న అన్నదాతలకు నీటి సమస్య మరింత భారంగా మారే అవకాశం ఉందని వాపోతున్నారు. సాగునీరు సకాలంలో అందకపోతే రెండు పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సాగునీరు అందించాలి రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు కోరుతున్నారు. కాలువల ద్వారా సాగునీటి సరఫరాపై స్పష్టతనిచ్చి, పంటలకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి వ్యవసాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రైతులు రెండు పంటలు సాగు చేసుకునేలా నీటి సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.

మహబూబాబాద్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకన్న మృతి పట్ల సంతాపం

కురవి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకన్న మరణించడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ గారు, టౌన్ అధ్యక్షులు నారాయణ రాజేందర్ కుమార్ గారు తదితరులు ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కురవి మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు దైద భద్రయ్య, కాంగ్రెస్ నాయకులు బూర్గుల కృష్ణ, బీఎల్ఏ కురవి నాగరాజ్, కాట్యాల శంకర్, సీనియర్ జర్నలిస్ట్ బాలగాని నవీన్ తదితర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని కత్తి వెంకన్న పార్థివదేహానికి నివాళులర్పించారు.

మహబూబాబాద్

ఆధార్‌’ సవరింపులు ఇక ఈజీ

ఆధార్ కార్డుల్లో పేరు, ఇంటిపేరు, చిరునామాల్లో స్పెల్లింగ్‌, భాషాపరమైన తప్పులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ-ఉడాయ్‌) పరిష్కారాన్ని తీసుకొచ్చింది. పేరు మార్చుకోవడంతో పాటు తప్పులను సవరించుకునేందుకు ఉడాయ్‌ నూతన నిబంధనలను అందు బాటులోకి తీసుకవచ్చింది. ఆధార్‌లో పేరు, ఇంటిపేరు, చిరునామాలోని తప్పుల ను సరి చేయడం ఇప్పుడు చాలా తేలిక. అలాగే వివాహం, విడాకుల అనంతరం మహిళలు తమ ఇంటి పేరును సులువుగా మార్చుకునే వెసులుబా టును కూడా ఉడాయ్‌ కల్పించింది. అంతేకాదు ఆధార్‌లో కింతమంది అలియాస్‌ పేరుతో రెండు పేర్లు ఉన్నవారు కూడా ఇప్పుడు తాము శాశ్వతంగా వినియోగించుకునే ఒక పేరునే ఆధార్‌లో పెట్టుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, ఇంటి పేరు, చిరునామాలో ఎలాంటి తప్పులున్నా ఉడాయ్‌ జారీ చేసిన నిర్దేశిత డాక్యుమెంట్లతో ఆధార్‌ కేంద్రానికి వెళ్లి రూ.75చెల్లించి తేలికగా మార్చుకోవచ్చు. అయితే పేరు పూర్తిగా మార్చుకోవాలంటే మాత్రం అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ తప్పనిసరి. – చిన్నపాటి సవరణలు.. పేరు, ఇంటి పేరు, చిరునామాలో చిన్నపాటి సవర ణలను మైనర్‌ కరెక్షన్‌ కేటగిరీలో సరిచేసుకోవచ్చు. పొట్టిగా ఉన్న పేర్లను కుదించడం, పూర్తిగా మార్చడం, ఇంటి పేరు తొలగించడం, జోడించడం, పేర్ల క్రమాన్ని మార్చుకోవడం, ఉచ్చారణ పరంగా ఒకేలా ఉండే అక్షర దోషాలను ఈ కేటగిరీలో సరిచేసుకోవచ్చు. అయితే వీటికి సంబంధిత ఏదైనా డాక్యుమెంట్‌ సమర్పిస్తే సరిపోతుంది. ఉదాహరణకు కుబీ రాజును కొండవీటి భాస్కర్‌ రాజుగా మార్చుకో వచ్చు. ఇందుకు ఏదైనా గుర్తింపు పత్రం ఉంటే కరెక్షన్‌ చేసుకోవచ్చు. – వివాహం/విడాకుల సందర్భాల్లో.. మహిళలకు సంబంధించిన ఇంటిపూరు మార్పు లు, వివాహం, విడాకుల సందర్భాల్లో అవసరం పడుతుంది. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రంతో పాటుగా అవసరమైన అఫిడవిట్‌(అనెక్షర్‌ డీ) సమర్పించాల్సి ఉంటుంది. బాల ఆధార్‌లోని బూబీ ఆఫ్‌ స్థానంలో పిల్లల పేరు నమోదు చేసేందుకు ఐడెంటిటీ ప్రూఫ్‌, రిలేషన్‌షిప్‌ ప్రూఫ్‌ సమర్పించాలి. అలాగే ఉరఫ్‌/అలియాస్‌ తొలగించుకు నేందుకు మేజర్లయితే సంబంధిత గుర్తింపుతో పాటు ఐడెంటిటీ ప్రూఫ్‌, అనెక్షర్‌ ఈ అఫిడవిట్‌ సమర్పించాలి. అలాగే మైనర్లు అయితే సంబంధిత గుర్తింపు పత్రంతో పాటుగా ఐడెంటిటీ ప్రూఫ్‌, రిలేషన్‌షిప్‌తో పాటుగా అనెక్షర్‌ ఎఫ్‌ అఫిడవిట్‌ సమర్పించాలి. – వివరాలు నమోదు లోపాలు.. ఆధార్‌ నమోదు సందర్భంలో సరైన పత్రాలు ఇచ్చినప్పటికీ వివరాలు నమోదు చేసేటప్పుడు అక్షర దోషాల కారణంగా ఆధార్‌ కార్డులో వివరాలు తప్పుగా పడితే సవరించుకోవచ్చు. ఇందుకు పెద్దలు సంబంధిత అఫిడవిట్‌ (అనెక్షర్‌ బీ)తో పాటు ఐడెంటిటీ ప్రూఫ్‌, రిలేషన్‌షిప్‌ ప్రూఫ్‌ సమర్పించాలి. మైనర్ల డేటా తప్పుల సవరణకు ప్రత్యేకమైన మైనర్‌ అఫిడవిట్‌(అనెక్షర్‌ సీ) సమర్పించాలి. కాగా ఆధార్‌లో పేరు, చిరునామా వివరాలు ఇంగ్లీష్‌తో పాటుగా తెలుగులో కూడా ఉంటాయి. అయితే ఇంగ్లీష్‌లో పేరు సరిగ్గా ఉండి తెలుగులో తప్పుగా ఉంటే సంబంధిత గుర్తింపు పత్రం, అఫిడవిట్‌ సమర్పించితే సవరించుతారు. – పేరు మార్పునకు గెజిట్‌.. ఆధార్‌లోని వ్యక్తి పేరును పూర్తిగా మార్చాలంటే మాత్రం తప్పనిసరిగా పేరు మార్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌ కావాలి. ప్రభుత్వ గెజిట్‌ నోటిఫికేషన్‌ సమర్పించిన వారికే గెజిట్‌లో ఉన్నట్లుగా పేరు మారుస్తారు. అయితే పేరు మార్పు అనేది ఒకసారి మాత్రమే. ఆధార్‌లోని పేరు, ఇంటిపేరు, చిరునామా వివరాలు, స్పెల్లింగ్‌, భాసాపరమైన తప్పు లు, ఇంటిపేరు మార్పులతో పాటుగా పేరు మార్పు లు చేసుకోవాలంటే సంబంధిత డాక్యుమెంట్లు, అఫిడవిట్‌లతో ఆధార్‌ సేవా కేంద్రానికి స్వయంగా వెళ్లాలి. అలాగే ఈ వివరాలు అప్‌డేట్‌ చేసుకునేం దుకు బయోమెట్రిక్‌ అథంటిఫికేషన్‌ పూర్తి చేశాక సంబంధిత డాక్యుమెంట్లు, అఫిడవిట్లు సమర్పించి రూ.75చెల్లిస్తే సవరణ చేస్తారు. ఆధార్‌ సేవా కేంద్రంలో సవరణలు చేశాక వారం నుంచి నెల రోజు ల లోపు మొబైల్‌కు అప్‌డేట్‌ చేసినట్లుగా మెసేజ్‌ వస్తుంది. అలాగే తప్పులు, పొరపాట్లు సవరణ చేసిన ఆధార్‌ కార్డు ఇంటికి పోస్టులో వస్తుంది.

మహబూబాబాద్

ఫామ్‌-6 దరఖాస్తులు 10.22 లక్షలు.. పెండింగ్‌లో 3.8 లక్షల దరఖాస్తులు

ఓటు హక్కు కోసం రాష్ట్రంలో యువత పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి లేదా ఒక నియోజకవర్గం నుంచి వేరొక నియోజకవర్గానికి ఓటు హకును మార్చుకోవడానికి ఫామ్‌-6 ద్వారా ఇప్పటివరకు 10.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు(ఎన్నారైలు) తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం ఫామ్‌-6ఏ ద్వారా 8,100 మంది దరఖాస్తు చేశారు. వీటిలో 4.28 లక్షలకు ఆమోదం పెండింగ్‌లో 3.8 లక్షల దరఖాస్తులు ఫామ్‌ 7 దరఖాస్తులు 5,43,748 4.71 లక్షల ఓట్ల తొలగింపునకు ఓకే వెల్లడించిన సీఈవో కార్యాలయం హైదరాబాద్, రాష్ట్రంలో యువత పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి లేదా ఒక నియోజకవర్గం నుంచి వేరొక నియోజకవర్గానికి ఓటు హకును మార్చుకోవడానికి ఫామ్‌-6 ద్వారా ఇప్పటివరకు 10.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు(ఎన్నారైలు) తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం ఫామ్‌-6ఏ ద్వారా 8,100 మంది దరఖాస్తు చేశారు. ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్‌)లో పేరు, వయస్సు, ఫొటో, చిరునామా, తండ్రి/భర్త పేరు వంటి వివరాల మార్పులు లేదా సవరణల కోసం ఫామ్‌-8 ద్వారా 11.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయవర్గాల వివరాల ప్రకారం.. 7.91 లక్షల ఫామ్‌-8 దరఖాస్తులకు ఈసీ ఆమోదం తెలిపింది. ఫామ్‌-6 ద్వారా అందిన దరఖాస్తుల్లో 4,28,965 ఆమోదం పొందగా, 2,12,931 తిరసరణకు గురయ్యాయి. మరో 3,80,861 పెండింగ్‌లో ఉన్నాయి. ఓటర్ల జాబితాలో వివరాల సవరణ, చిరునామా మార్పు తదితర అవసరాలకు సంబంధించిన ఫామ్‌-8 కింద మొత్తం 11,23,245 దరఖాస్తులు అందాయి. వీటిలో 7,91,937 ఆమోదం పొందాయి. 1,32,975 తిరసరణకు గురికాగా, 1,98,333 పెండింగ్‌లో ఉన్నాయి. భారీగా ఫామ్‌ -7 దరఖాస్తులు ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, కొత్త పేర్లను చేర్చడంపై అభ్యంతరాలకు సంబంధించిన ఫామ్‌ -7 దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మొత్తం 5,43,748 ఫామ్‌ -7 దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్వీకరించింది. వీటిలో 4,71,889 దరఖాస్తులను ఆమోదించింది. 44,920 తిరసరించింది. మరో 26,939 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. రాష్ట్రంలో ‘సర్‌’ ప్రారంభానికి ముందు ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్‌ 14 వరకు 5,13,375 ఫామ్‌ -7 దరఖాస్తులు దాఖలయ్యాయి. ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా అక్టోబర్‌ 12 నాటికి 30,373 ఫామ్‌ -7 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం ఓటర్ల జాబితాలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నది. జ్ఞానేశ్‌కుమార్‌ను అభిశంసించండి ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నేతలు ఎన్నికల కమిషన్‌ ఆఫీస్‌ ముట్టడి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దుచేసి, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ తక్షణమే అభిశంసించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్‌, ప్రధాన కార్యదర్శి నేర్లెకంటి శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌తోపాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఓట్‌ చోరీతో దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ సంయుక్తాధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ లిబర్టీ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ‘ఓట్ల దొంగ, పదవి నుంచి తప్పుకో, జ్ఞానేశ్‌కుమార్‌, దిగిపో..’ అని నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు.. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

మహబూబాబాద్

భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్ర బీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు* *కురవి: ■ డోర్నకల్ నియోజకవర్గం, కురవి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని *మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు రాష్ట్ర బీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు* ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ● ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మ దేవేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీ డీఎస్ రెడ్యానాయక్ గారు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్లు శ్రీమతి తుల ఉమ గారు, కుమారి బిందు అంగోత్ గారు, మంత్రి శ్రీదేవి గారు, కురవి సర్పంచ్ లక్ష్మీ రాజు నాయక్ గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య గారు, పిచ్చి రెడ్డి గారు, నూతక్కి నరసింహారావు. సాంబశివరావు. ముళ్ళ రమేష్ భోజ్య నాయక్ గారు నామ సైదులు మాజీ వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య పెద్ది వెంకన్న గౌడ్ గారు, ఐలి నరహరి గౌడ్ గారు, బొడ శ్రీను నాయక్ గారు, గుగులోత్ నెహ్రూ నాయక్ గారు, సంగేమ్ భరత్ గారు బానోతు వీరన్న నాయక్ ,భద్రు గారు, , బాణోత్ శారద గారు, అంగోత్ కాంతి గారు తదితరులు పాల్గొన్నారు

మహబూబాబాద్

మరిపెడలో విషాదం.. నీటి కుంటలో పడి బాలుడి మృతి

సెలవు రోజుల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణ పరిధిలోని నీటి కుంటలో పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. స్థానికంగా అందిన సమాచారం ప్రకారం, ఎలక్ట్రిషియన్ హరీష్ కుమారుడు అఖిల్ (9) ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సెలవుల్లో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం పాఠశాలలకు సెలవులు వచ్చినప్పుడు పిల్లలు ఎక్కువ సమయం ఆటపాటల్లో గడుపుతుంటారు. ఈ సమయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పిల్లల కదలికలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. చెరువులు, కుంటలు, బావులు, వ్యవసాయ బోర్లు, నీరు నిల్వ ఉండే గుంతల వద్ద పిల్లలు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత రాని పిల్లలను నీటి ప్రాంతాల వద్దకు అనుమతించకూడదు. పిల్లల భద్రతకు పాటించాల్సిన జాగ్రత్తలు * పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఆడుకుంటున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి. * చెరువులు, కుంటలు, బావులు, వ్యవసాయ బోర్ల వద్ద పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు. * నీటి కుంటలు, ప్రమాదకర గుంతల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలి. * విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, నిర్మాణంలో ఉన్న భవనాలు, రోడ్లపై వాహనాల రాకపోకల విషయంలో పిల్లలకు అవగాహన కల్పించాలి. * తెలియని వ్యక్తులతో వెళ్లకూడదని, ప్రమాదకర ప్రదేశాల్లో ఆడకూడదని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. * పిల్లలు కనిపించకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వెతకడంతో పాటు అవసరమైతే పోలీసులకు సమాచారం అందించాలి. అప్రమత్తతే ప్రమాదాలకు నివారణ ఒక్క క్షణం అజాగ్రత్త కూడా కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చవచ్చు. పిల్లలకు స్వేచ్ఛనివ్వడంతో పాటు వారి భద్రతను నిరంతరం పర్యవేక్షించడం తల్లిదండ్రుల బాధ్యత. పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.

మహబూబాబాద్

మరిపెడలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ వేడుకలు

మరిపెడ మండల కేంద్రంలో ఐదో రోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారి సతీమణి డాక్టర్ ప్రమీల గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రమీల గారు మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని, వారితో కలిసి పండుగ సంబరాలను పంచుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకలతో మరిపెడ మండల కేంద్రంలో పండుగ సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ చైర్మన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, మరిపెడ మండల అధ్యక్షులు గుగులోత్ రవి నాయక్, టౌన్ అధ్యక్షులు రామ్ లాల్, జిల్లా నాయకులు, మరిపెడ మాజీ మండల అధ్యక్షులు పెండ్లి రఘు రెడ్డి, జిల్లా యువజన నాయకులు నరసింహారెడ్డి, గుండబోయిన వేణు, సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

సీరోల్‌లో బతుకమ్మ విగ్రహావిష్కరణ: రాజ్యవర్ధన్ రెడ్డి!

మహబూబాబాద్ జిల్లా సీరోల్‌లో ఐదో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. దివంగత వెడవెల్లి వెంకటమ్మ స్మారకార్థం ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు సీరోల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఐదో రోజు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని, దివంగత శ్రీమతి వెడవెల్లి వెంకటమ్మ స్మారకార్థం, మాజీ ఎమ్మెల్సీ, స్వాతంత్ర్య సమరయోధుడు, సీరోల్ అభివృద్ధి ప్రదాత వెడవెల్లి వెంకట్ రెడ్డి కుటుంబం సౌజన్యంతో ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని వెడవెల్లి రాజ్యవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. మ్యాప్‌లు చూడండి ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను గ్రామస్తులంతా కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. సర్పంచ్ అనుమంతుల రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొల్లికొండ నాగేశ్వర్ రావు, మాజీ ఎంపీటీసీ మక్కల మంగమ్మ, వెంకన్న, మాజీ ఉపసర్పంచులు తగరం గురువయ్య, అనుమంతుల నగేష్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మంగళపెల్లి కన్నా, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

కరెంటు లేదు.. సాగునీరు లేదు.. మిర్చి పంటను వదిలేసిన రైతు!

మరిపెడ మండలంలో రైతుల కష్టాలు పట్టించుకునేదెవరు? మరిపెడ, అక్టోబర్ 14: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల పరిధిలోని బురహాన్‌పురం గ్రామంలో విద్యుత్ సరఫరా, సాగునీటి సమస్యల కారణంగా మిర్చి పంటను కాపాడుకోలేక రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గ్రామానికి చెందిన రైతు బానోతు రామ్ సింగ్ మిర్చి పంటకు అవసరమైన నీరు అందకపోవడంతో పంటను వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం, సాగునీరు అందకపోవడంతో పంటకు నీరు పెట్టలేకపోతున్నామని రైతు వాపోతున్నాడు. ఇప్పటికే పంట సాగు కోసం పెట్టుబడులు పెట్టిన రైతుకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరింత ఆర్థిక భారంగా మారాయి. కష్టపడి సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోయే పరిస్థితి రావడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు ఆవేదన రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, సాగునీరు అందిస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ గ్రామంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని బాధావత్ శివ కోరుతున్నాడు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా అందించడంతో పాటు, సాగునీటి సమస్యను పరిష్కరించి మిర్చి పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. సంబంధిత అధికారులు బురహాన్‌పురం గ్రామంలోని వ్యవసాయ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యుత్ మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచి తగిన సహాయం అందించాలని బానోతు రామ్ సింగ్ విజ్ఞప్తి చేస్తున్నాడు.

మహబూబాబాద్

మరిపెడ ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు

మరిపెడ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాల్లో ఐదో రోజును అట్ల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, ఉద్యోగులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడి చేశారు. డీజే సౌండ్‌లకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. అట్ల బతుకమ్మ సందర్భంగా అమ్మవారికి అట్లు నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. వేడుకలతో ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. మరిపెడలో ఘనంగా ఐదో రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఆటపాటలు, డీజే సౌండ్‌తో మార్మోగిన పట్టణం.. మహిళల నృత్యాలతో పండుగ సందడి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మరిపెడ పట్టణంలో ఘనంగా కొనసాగుతోంది. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు వేడుకలను పట్టణంలో ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను మధ్యలో ఉంచి మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. డీజే సౌండ్‌ల నడుమ మహిళలు, యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చారు. భారీగా తరలివచ్చిన జనసమూహంతో మరిపెడ పట్టణంలో ఎటుచూసినా బతుకమ్మ సంబరాల సందడి కనిపించింది. సంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, యువతులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. వివిధ రకాల సహజ పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి పాటలు పాడటం, నృత్యాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామీణ ప్రజలు ఒకచోట చేరి ఐక్యతను చాటుకోవడం ఈ వేడుకల విశిష్టత. ఐదో రోజు బతుకమ్మ వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొనడంతో పట్టణమంతా పండుగ శోభను సంతరించుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు పేర్కొన్నారు. మరిపెడలో జరిగిన ఈ వేడుకలు ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపాయి.