Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మహబూబాబాద్

ఫామ్‌-6 దరఖాస్తులు 10.22 లక్షలు.. పెండింగ్‌లో 3.8 లక్షల దరఖాస్తులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫామ్‌-6 దరఖాస్తులు 10.22 లక్షలు.. పెండింగ్‌లో 3.8 లక్షల దరఖాస్తులు

వార్త ముఖ్యాంశాలు

  • ఓటు హక్కు కోసం రాష్ట్రంలో యువత పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
  • కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి లేదా ఒక నియోజకవర్గం నుంచి వేరొక నియోజకవర్గానికి ఓటు హకును మార్చుకోవడానికి ఫామ్‌-6 ద్వారా ఇప్పటివరకు 10.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
  • విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు(ఎన్నారైలు) తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం ఫామ్‌-6ఏ ద్వారా 8,100 మంది దరఖాస్తు చేశారు.

ఓటు హక్కు కోసం రాష్ట్రంలో యువత పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి లేదా ఒక నియోజకవర్గం నుంచి వేరొక నియోజకవర్గానికి ఓటు హకును మార్చుకోవడానికి ఫామ్‌-6 ద్వారా ఇప్పటివరకు 10.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు(ఎన్నారైలు) తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం ఫామ్‌-6ఏ ద్వారా 8,100 మంది దరఖాస్తు చేశారు.
వీటిలో 4.28 లక్షలకు ఆమోదం
పెండింగ్‌లో 3.8 లక్షల దరఖాస్తులు
ఫామ్‌ 7 దరఖాస్తులు 5,43,748
4.71 లక్షల ఓట్ల తొలగింపునకు ఓకే
వెల్లడించిన సీఈవో కార్యాలయం
హైదరాబాద్, రాష్ట్రంలో యువత పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి లేదా ఒక నియోజకవర్గం నుంచి వేరొక నియోజకవర్గానికి ఓటు హకును మార్చుకోవడానికి ఫామ్‌-6 ద్వారా ఇప్పటివరకు 10.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు(ఎన్నారైలు) తమ పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం కోసం ఫామ్‌-6ఏ ద్వారా 8,100 మంది దరఖాస్తు చేశారు.
ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్‌)లో పేరు, వయస్సు, ఫొటో, చిరునామా, తండ్రి/భర్త పేరు వంటి వివరాల మార్పులు లేదా సవరణల కోసం ఫామ్‌-8 ద్వారా 11.23 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయవర్గాల వివరాల ప్రకారం.. 7.91 లక్షల ఫామ్‌-8 దరఖాస్తులకు ఈసీ ఆమోదం తెలిపింది. ఫామ్‌-6 ద్వారా అందిన దరఖాస్తుల్లో 4,28,965 ఆమోదం పొందగా, 2,12,931 తిరసరణకు గురయ్యాయి. మరో 3,80,861 పెండింగ్‌లో ఉన్నాయి. ఓటర్ల జాబితాలో వివరాల సవరణ, చిరునామా మార్పు తదితర అవసరాలకు సంబంధించిన ఫామ్‌-8 కింద మొత్తం 11,23,245 దరఖాస్తులు అందాయి. వీటిలో 7,91,937 ఆమోదం పొందాయి. 1,32,975 తిరసరణకు గురికాగా, 1,98,333 పెండింగ్‌లో ఉన్నాయి.

భారీగా ఫామ్‌ -7 దరఖాస్తులు
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, కొత్త పేర్లను చేర్చడంపై అభ్యంతరాలకు సంబంధించిన ఫామ్‌ -7 దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మొత్తం 5,43,748 ఫామ్‌ -7 దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) స్వీకరించింది. వీటిలో 4,71,889 దరఖాస్తులను ఆమోదించింది. 44,920 తిరసరించింది. మరో 26,939 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. రాష్ట్రంలో ‘సర్‌’ ప్రారంభానికి ముందు ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్‌ 14 వరకు 5,13,375 ఫామ్‌ -7 దరఖాస్తులు దాఖలయ్యాయి. ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా అక్టోబర్‌ 12 నాటికి 30,373 ఫామ్‌ -7 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం ఓటర్ల జాబితాలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నది.

జ్ఞానేశ్‌కుమార్‌ను అభిశంసించండి

ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర నేతలు
ఎన్నికల కమిషన్‌ ఆఫీస్‌ ముట్టడి
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను రద్దుచేసి, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ తక్షణమే అభిశంసించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్‌, ప్రధాన కార్యదర్శి నేర్లెకంటి శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌కుమార్‌తోపాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఓట్‌ చోరీతో దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ సంయుక్తాధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ లిబర్టీ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. ‘ఓట్ల దొంగ, పదవి నుంచి తప్పుకో, జ్ఞానేశ్‌కుమార్‌, దిగిపో..’ అని నినాదాలు చేస్తూ బారికేడ్లను దాటి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులు.. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *