Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Public

మహబూబాబాద్

తెలంగాణలో ఎండలు మండు వేసవిని తలపిస్తుండటంతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు.

పగటిపూట వాతావరణం నిప్పుల కొలిమిలా మారుతోంది. రాత్రి వేళల్లో ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.* గాలిలో తేమ శాతం పడిపోవడంతో వేడి తీవ్రత అధికంగా పెరిగింది. ఎండలు వేసవి గుర్తుచేస్తుండటం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. కొన్ని రోజులుగా ఖమ్మం, మహబూబ్‌నగర్‌ వంటి తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 60 నుంచి 70 శాతం మధ్య నమోదు కావాల్సి ఉండగా కొన్నిచోట్ల 50 శాతం కంటే తక్కువగా ఉంటోంది. మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న చోట గాలి కాలుష్యం వల్ల వేడి పెరుగుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. *గాలిలోని తేమ పడిపోవడం* వేసవిలోనూ చల్లని వాతావరణం ఉండే హైదరాబాద్‌లో శుక్రవారం 49 శాతానికి గాలిలోని తేమ పడిపోవడం తీవ్రతకు అద్దం పడుతోంది. రామగుండంలో గాలిలో తేమ శాతం 42, హనుమకొండలో 49, మహబూబ్‌నగర్‌లో 51, నిజామాబాద్‌లో 45, నల్గొండలో 45 శాతం నమోదైంది. రానున్న మరో మూడు రోజుల్లో పెద్దపల్లి, ఖమ్మం, మంచిర్యాల, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, నిర్మల్‌, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జగిత్యాల, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. *మరోవైపు నైరుతి రుతుపవనాలు ఒకట్రెండు రోజుల్లో తెలంగాణపై నుంచి పూర్తిగా నిష్క్రమించడం గమనార్హం.*

మహబూబాబాద్

జనన, మరణ ధ్రువపత్రాల జారీలో నిబంధనలు కఠినతరం..ఆలస్యం చేశారో అంతే!

_21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి_ – _గడువు దాటితే తిప్పలు తప్పవు_ – _ఈ నెల నుంచే అమలు_ _*జనన, మరణ ధ్రువపత్రాల జారీకి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇంట్లో ఎవరైన పుట్టినా లేదా మరణించినా 21 రోజుల్లోపు సంబంధిత ధ్రువపత్రాల కోసం కుటుంబ సభ్యులు గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో దరఖాస్తు చేసుకోవాలి. గడువు దాటితే ధ్రువపత్రాలు పొందేందుకు తిప్పలు తప్పవు. 21 రోజులు దాటి ఒక సంవత్సరంలోపు దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం నిర్ణయించిన ఆలస్య రుసుం చెల్లించి స్థానిక అధికారుల ద్వారా ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది.*_ _*ఒక సంవత్సరం నుంచి రెండేళ్లు ఆలస్యమైతే సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్‌, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ లేదా వారు అధికారం కల్పించిన ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. రెండేళ్లు దాటితే స్థానిక అధికారులు నేరుగా జనన, మరణ ధ్రువపత్రాలను జారీ చేయరు. దీనికి కచ్చితంగా ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చుకోవలసి ఉంటుంది. అయితే, ఒక సంవత్సరం దాటిన తరువాత సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఆ సమాచారం సరైనదే అని ధ్రువీకరణకు వస్తేనే ధ్రువపత్రం మంజూరవుతుంది.*_ * _ఈ ధ్రువపత్రాలు చాలా కీలకం..!_ _*జనన, మరణ ధ్రువపత్రాలు చాలా విషయాల్లో అత్యంత కీలకమైనవి. బర్త్‌ సర్టిఫికెట్‌ లేకపోతే పిల్లల ఆధార్‌ నమోదు, చదువు తదితర అంశాల్లో ఇబ్బందులు తప్పవు. అలాగే మరణ ధ్రువపత్రం లేకపోతే ఆస్తి పంపకాలు, వారసత్వాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనం, ఇతర అధికారిక, ఆర్థిక వ్యవహారాలు ముందుకు సాగడం కష్టమే. ఇలాంటి కీలక ధ్రువపత్రాల కోసం కుటుంబ సభ్యులు సకాలంలో నమోదు చేసుకోవాలి. లేదంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక వ్యక్తి వేరొక జిల్లాకు వెళ్లి అక్కడ మృత్యువాత పడితే కచ్చితంగా ఆ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఇచ్చే ధ్రువీకరణ పత్రాన్ని తీసుకోవాలి. దీనిని మీసేవ కేంద్రాల్లో సమర్పించి డెత్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చని అధికారులు చెబుతున్నారు.*_ * _ఆలస్యం చేయొద్దు_ _*జనన, మరణ ధ్రువపత్రాలు పొందే విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజా సవరణ చట్టం చేసింది. 21 రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే సులువుగా ధ్రువపత్రాలు మంజూరవుతాయి. ఏడాదిలోపు అయితే తహసీల్దార్‌ స్థాయి, ఏడాది దాటి రెండేళ్లలోపు ఆర్డీవో స్థాయి అధికారులు, రెండేళ్లు దాటితే ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలతో ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంట్లో ఎవరైన జన్మించినా, మరణించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.*_

మహబూబాబాద్

ఇటీవల రైతుని నువ్వు ఇంకా చావలేదా అని చెప్పిన తాసిల్దార్ సస్పెండ్

సిద్దిపేట జిల్లా తహశీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హైమావతి ఉత్తర్వులు జారీ.. శనివారం ఓ రైతును ఉద్దేశించి తహశీల్దారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన ప్రభుత్వం కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్.

మహబూబాబాద్

హరే రామ నామస్మరణకు కోతి స్పందన.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

బద్రీనాథ్‌లో ఆసక్తికర ఘటన బద్రీనాథ్‌ సందర్శనకు వెళ్లిన కేరళకు చెందిన ఓ కుటుంబానికి రెస్టారెంట్‌లో ఆసక్తికర అనుభవం ఎదురైంది. కుటుంబ సభ్యులు రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా, ఓ కోతి వారిని అనుసరిస్తూ లోపలికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మహిళ ‘హరే రామ’, ‘శ్రీ రామ్ జై రామ్’ అంటూ భక్తితో రామనామాన్ని జపించింది. దీంతో ఆ కోతి స్పందించిన తీరు వీడియోలో కనిపించడంతో ఈ దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మహిళ రామనామాన్ని జపిస్తుండగా కోతి ఇచ్చిన స్పందన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. హనుమంతుడిని శ్రీరాముని పరమ భక్తుడిగా కొలిచే నేపథ్యంలో, ఈ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ఘటనతో రామనామ స్మరణ, హనుమంతుడిపై భక్తి మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, కోతి స్పందనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు స్వతంత్రంగా నిర్ధారించాల్సి ఉంది. Uploaded Video:

మహబూబాబాద్

మరిపెడ సంతలో రుసుముల వసూళ్ల దందా!

కాంట్రాక్టర్ల పేరుతో ప్రైవేట్ వ్యక్తుల హడావుడి.. వ్యాపారులు, దళారులపై అదనపు భారం? వసూళ్లపై అధికారుల పర్యవేక్షణ ఏదీ? రుసుముల వివరాలు బహిర్గతం చేయాలని వ్యాపారుల డిమాండ్ మరిపెడ, అక్టోబర్ 11: మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో నిర్వహించే సంతలో రుసుముల వసూళ్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ల పేరుతో కొందరు ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారులు, దళారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంతకు వివిధ ప్రాంతాల నుంచి సరుకులు తీసుకొచ్చే వ్యాపారులు, కొనుగోలు–అమ్మకాలకు వచ్చే దళారులు ఈ వసూళ్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనలు ఒకవైపు.. వసూళ్లు మరోవైపు? మరిపెడ పట్టణ సంతకు ప్రతి వారం వివిధ గ్రామాలు, పరిసర ప్రాంతాల నుంచి వ్యాపారులు, రైతులు, దళారులు వస్తుంటారు. కూరగాయలు, పండ్లు, నిత్యావసర సరుకులు, ఇతర వ్యాపార వస్తువులను విక్రయించేందుకు సంతలో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే సంత రుసుముల పేరుతో వసూలు చేస్తున్న మొత్తాలు ఏ ప్రాతిపదికన నిర్ణయించబడ్డాయి? అధికారికంగా నిర్ణయించిన రుసుముల పట్టిక ఉందా? కాంట్రాక్టు నిబంధనల ప్రకారమే వసూళ్లు జరుగుతున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంట్రాక్టు నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లయితే, దానికి సంబంధించిన నిబంధనలు, రుసుముల వివరాలు స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టు పరిధి ఎంత? ఏ రకమైన వ్యాపారానికి ఎంత రుసుము వసూలు చేయాలి? ఎవరెవరు రుసుములు వసూలు చేసేందుకు అధికారం కలిగి ఉన్నారు? అనే వివరాలను సంబంధిత అధికారులు ప్రజలకు తెలియజేయాలని వ్యాపారులు కోరుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల వసూళ్లపై విచారణ జరగాలి కాంట్రాక్టర్ల పేరుతో ప్రైవేట్ వ్యక్తులు రుసుములు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో, వారికి అధికారికంగా అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనుమతులు ఉన్నవారే వసూళ్లు చేస్తున్నారా? వసూలు చేసిన మొత్తాలకు రసీదులు అందజేస్తున్నారా? వసూళ్ల వివరాలు సంబంధిత శాఖ రికార్డుల్లో నమోదవుతున్నాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రుసుములు వసూలు చేసే వ్యక్తులు అధికారిక గుర్తింపు వివరాలు చూపించడంతో పాటు, నిర్ణీత రుసుముల పట్టికను అందుబాటులో ఉంచాలని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. రసీదులు ఇవ్వకుండా లేదా నిర్ణీత రేట్లకు మించి వసూళ్లు చేస్తున్నట్లు విచారణలో తేలితే, సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిరు వ్యాపారులపై ఆర్థిక భారం సంతలో వ్యాపారం చేసే చిరు వ్యాపారులు రోజువారీ అమ్మకాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. సరుకుల కొనుగోలు, రవాణా, కూలీల ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలు భరిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంత రుసుముల పేరుతో అదనపు భారం పడితే తమ ఆదాయంపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విక్రేతలు రుసుముల విషయంలో స్పష్టత లేక ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సంతకు వచ్చే ప్రతి వ్యాపారికి ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని, రుసుముల వసూళ్లలో పారదర్శకత పాటించాలని కోరుతున్నారు. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? సంత రుసుముల వసూళ్లు ఏ శాఖ లేదా స్థానిక సంస్థ పరిధిలోకి వస్తాయో సంబంధిత అధికారులు స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాంట్రాక్టు ఒప్పందం, వసూళ్లకు సంబంధించిన అనుమతులు, నిర్ణీత రుసుముల వివరాలను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంతలో జరుగుతున్న వసూళ్లపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టి, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులకు విజ్ఞప్తి: మరిపెడ పట్టణ సంతలో రుసుముల వసూళ్లపై తక్షణమే విచారణ చేపట్టి, అధికారికంగా నిర్ణయించిన రేట్లను బహిరంగంగా ప్రదర్శించాలి. ప్రతి వసూలుకు రసీదు అందించేలా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సంతకు వచ్చే వ్యాపారులు, రైతులు, దళారులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. Uploaded Video:

మహబూబాబాద్

నీళ్ళు లేక నేలపైనే బతుకమ్మను నిమజ్జనం చేసిన మహిళలు

పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మను నిమజ్జనం చేయడానికి రంగప్ప చెరువు వద్దకు వెళ్లిన మహిళలు అక్కడ నీళ్ళు లేకపోవడం, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భూమిపైనే బతుకమ్మలను నిమజ్జనం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు Uploaded Video:

మహబూబాబాద్

బాలికలకు భరోసా.. సమాన హక్కులతోనే బంగారు భవిష్యత్తు! నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం

నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం – బాల్యవివాహాల నిర్మూలన, బాలికల హక్కుల పరిరక్షణే లక్ష్యం ప్రత్యేక కథనం: ప్రతి ఇంట్లో ఆడపిల్ల నవ్వులు విరియాలి.. ప్రతి బాలిక కలలకు రెక్కలు రావాలి.. చదువుతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.. సమాజంలో గౌరవంగా, స్వేచ్ఛగా జీవించాలి. బాలికల హక్కులను గుర్తించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2011 డిసెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అక్టోబర్ 11ను అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా ప్రకటించింది. 2012 నుంచి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. 2026 నినాదం.. బాల్యవివాహాలకు ముగింపు పలికి బాలికల హక్కుల్లో పెట్టుబడి పెట్టాలి ఈ ఏడాది బాలికల దినోత్సవం ప్రధాన సందేశం బాల్యవివాహాలను అరికట్టడం, బాలికల హక్కులను పరిరక్షించడం. బాలికలకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, సురక్షిత వాతావరణం కల్పించడంతోపాటు వారి అభిప్రాయాలకు, ఆశయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ దినోత్సవం గుర్తుచేస్తోంది. ఆడపిల్ల ఎదిగితే.. సమాజం ఎదిగినట్టే! నేటి బాలికలే రేపటి శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బాలికలు వివక్ష, బాల్యవివాహాలు, చదువు మధ్యలో మానేయడం, పోషకాహార లోపం, వేధింపులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు కుటుంబాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం సమష్టిగా కృషి చేయాలి. ఆడపిల్ల పుట్టిందని బాధపడకుండా, ఆమెను కుటుంబానికి గర్వకారణంగా తీర్చిదిద్దాలి. అబ్బాయిలతో సమానంగా అవకాశాలు కల్పించాలి. బాలికల విద్యకు ఆటంకం కలగకుండా చూడాలి. వారి అభిరుచులు, ప్రతిభను ప్రోత్సహించాలి. ముఖ్యంగా 18 ఏళ్లలోపు వివాహాలను అరికట్టి, బాలికలు తమ చదువును పూర్తిచేసి స్వతంత్రంగా జీవిత నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. బాలికల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత బాలికలకు సురక్షితమైన పాఠశాలలు, మెరుగైన వైద్య సదుపాయాలు, పోషకాహారం, డిజిటల్ విద్య అందుబాటులో ఉండాలి. బాలికలపై జరిగే వివక్ష, హింస, వేధింపులను నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారి కలలను సాకారం చేసుకునేందుకు అండగా నిలవాలి. బాలికలకు సమాన హక్కులు కల్పించడం కేవలం ఒకరోజు నిర్వహించే కార్యక్రమంతో ముగియకూడదు. వారి హక్కులను గౌరవించడం, విద్యను ప్రోత్సహించడం, భద్రతకు భరోసా ఇవ్వడం నిరంతర బాధ్యతగా మారాలి. ప్రతి బాలికకు భయం లేని బాల్యం, నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవితం లభించినప్పుడే అంతర్జాతీయ బాలికల దినోత్సవానికి నిజమైన సార్థకత చేకూరుతుంది. బాలికలను కాపాడుదాం.. బాల్యాన్ని నిలబెడదాం.. చదువుతో వారి భవిష్యత్తును తీర్చిదిద్దుదాం!

మహబూబాబాద్

బంగాళాఖాతంలో మరోసారి ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఈ నెల 13వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.* ఈ అల్పపీడనం తదుపరి రోజుల్లో మరింత బలపడి.. ఈ నెల 15 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు తీరంలో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు మధ్య ఒడిశా ప్రాంతంలో కూడా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ద్వంద్వ ఆవర్తనాల ప్రభావంతో రాగల కొద్దిరోజుల్లో వివిధ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి, విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసే తదుపరి హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మహబూబాబాద్

తెలంగాణలో రెవెన్యూ అధికారుల బదిలీలు.. జీవో 630 విడుదల చేసిన సర్కార్.

తెలంగాణలో రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేస్తూ జీవో నంబర్- 630ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. తెలంగాణలో రెవెన్యూ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) బదిలీ చేసింది. ఈ మేరకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేస్తూ జీవో నంబర్- 630ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. బి. రాజాగౌడ్ జగిత్యాల అదనపు కలెక్టర్ (LB) నుంచి నిజామాబాద్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా బదిలీ చేసింది. ఎన్. ప్రసూనాంబ జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించింది. డి. వెంకట మాధవరావు నిర్మల్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా నియమించింది.

మహబూబాబాద్

సీతాఫలంపైనా ఎల్‌నినో ప్రభావం – పండును కొనేందుకు జంకుతున్న వినియోగదారులు

సీతాఫలం పంటపై ఎల్‌నినో ప్రభావం పడింది. సకాలంలో వర్షాలు లేక దిగుబడి భారీగా తగ్గాయి. దీంతో మార్కెట్‌కు సరుకు తగ్గడంతో ధరలు పెరిగాయి. ప్రస్తుతం డజను రూ.400 నుంచి 500 వరకు విక్రయిస్తున్నారు. రుచికి రుచి. పోషకాలకు పోషకాలు. సహజ కార్బోహైడ్రేట్లతో శరీరానికి శక్తినిచ్చే సీతాఫలంపై ఎల్‌నినో ప్రభావం పడింది. సకాలంలో వర్షాలు లేక పంట దిగుబడి భారీగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. పోషకాల ఖజానాగా పేరున్న ఈ పండును కొనేందుకు వినియోగదారులు వెనకాడే పరిస్థితి తలెత్తింది. అసలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీతాఫలం దిగుబడి ఎందుకు తగ్గింది? రైతుల నుంచి వ్యాపారి, సామాన్యుడి వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న “ధరల మోత” వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు రైతులకు మంచి ఆదాయాన్ని అందించిన సీతాఫలం సాగు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. పూత, పిందె దశల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం ఈ ఫలం దిగుబడికి కీలకం. అయితే ఈసారి సకాలంలో వర్షాలు లేక ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. దీనివల్ల పూత దశలోనే పంటపై ప్రభావం పడగా పిందెలు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా తోటల నుంచి మార్కెట్‌కు వచ్చే సరుకు గణనీయంగా తగ్గిపోయింది. దిగుబడి తగ్గినా, సాగు ఖర్చులు మాత్రం తగ్గలేదు. కూలీల ఖర్చు, తోటల సంరక్షణ, నీటి వసతి, ఎరువులు, ఇతర పెట్టుబడుల్లో మార్పులేదు. ధర పెరగడం కొంత ఊరటనిస్తున్నా, దిగుబడి తగ్గడంతో ఆ ప్రయోజనం పూర్తిగా తమకు దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనేందుకు జంకుతున్న వినియోగదారులు: మార్కెట్‌లో సీతాఫలం లభ్యత తగ్గి, ధరలు భారీగా పెరిగాయి. తోటల నుంచి తక్కువగా వచ్చే సరుకు కోసం వ్యాపారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. విక్రయించడం కష్టంగా మారుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. గతంలో ఎక్కువగా కొనుగోలు చేసే వినియోగదారులు ఈసారి ధరలను చూసి భయపడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. “ఎల్​నినో ప్రభావంతో వర్షాలు కురవక ఇబ్బందులు పడుతున్నాం. ఎక్కడక్కడా తోటలు పడిపోయాయి. వేసవికాలం దాటిన తర్వాత పిందులు వస్తాయి. నెలకు రెండు, మూడు వర్షాలు పడితే సీతాఫలం ఎదుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో సీతాఫలం పండ్లు ఎండిపోయాయి. సీతాఫలం సాగు గణనీయంగా తగ్గింది. దీంతో ఆదాయం కూడా అంతంత మాత్రంగా లేదు”- రైతులు గతంలో కంటే అధిక ధరలు: ఏటా ఈ సీజన్‌లో సీతాఫలానికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. గతంలో డజను సీతాఫలాలు రూ.150 నుంచి రూ.200 వరకు లభించగా, ప్రస్తుతం రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరల వల్ల పరిమితంగానే కొనాల్సి వస్తోందని సీతాఫల ప్రియులు అంటున్నారు. వాతావరణ మార్పులతో ప్రకృతి చూపిన ప్రతాపం. అన్నదాత నుంచి సామాన్యుడి వరకు అందరిపైనా ఆర్థిక భారాన్ని మోపుతోంది. పెట్టుబడులు పెరిగి, దిగుబడి పడిపోయి రైతు అల్లాడిపోతుంటే, ఆకాశాన్ని తాకుతున్న ధరలతో వినియోగదారుడు తనకు ఇష్టమైన పండును కొనలేని పరిస్థితి తలెత్తింది.