Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Public

మహబూబాబాద్

ఆరోగ్యమే మహాభాగ్యం.. చిన్న జాగ్రత్తలే కుటుంబానికి శ్రీరామరక్ష!

ఆరోగ్యమే మహాభాగ్యం.. చిన్న జాగ్రత్తలే కుటుంబానికి శ్రీరామరక్ష! మారుతున్న జీవనశైలితో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. అప్రమత్తతతోనే ఆరోగ్యకరమైన సమాజం ప్రత్యేక కథనం | పున్నమి నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. పని ఒత్తిడి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. అనారోగ్యం వచ్చిన తర్వాత ఆసుపత్రుల చుట్టూ తిరగడం కంటే, ముందుగానే జాగ్రత్తలు పాటించడం ఎంతో మేలు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ అవసరం ప్రతిరోజూ సమతుల ఆహారం తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను, అధికంగా నూనెలో వేయించిన పదార్థాలను పరిమితం చేయాలి. తగినంత సురక్షితమైన నీరు తాగడం కూడా అవసరం. నడకతో ఆరోగ్యానికి మేలు రోజువారీ జీవితంలో నడకకు సమయం కేటాయించడం, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితికి తగిన శారీరక శ్రమ చేయడం ఉపయోగకరం. పెద్దలు సాధ్యమైనంతవరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయించకుండా ఆటలు, శారీరక కార్యకలాపాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. నిద్రను నిర్లక్ష్యం చేయవద్దు తగినంత నిద్ర శరీరానికి, మనసుకు అవసరం. నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించడం, క్రమబద్ధమైన నిద్రవేళలను పాటించడం మంచిది. దీర్ఘకాలంగా నిద్ర సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. వ్యాధి రాకముందే పరీక్షలు రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కొందరిలో ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు చూపకపోవచ్చు. అందువల్ల వయస్సు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సూచన మేరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం, ఇతరులు వాడే మందులను తీసుకోవడం ప్రమాదకరం. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. తాగునీటిని సురక్షితంగా ఉంచుకోవాలి. భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అనేక అంటువ్యాధుల ముప్పును తగ్గించవచ్చు. ప్రజలకు ఒక చిన్న సందేశం ఆరోగ్యం అనేది ఒక్కరోజులో సంపాదించేది కాదు. ప్రతిరోజూ పాటించే చిన్న చిన్న మంచి అలవాట్లే దీర్ఘకాలంలో మంచి ఫలితాలను అందిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం, అవసరమైనప్పుడు వైద్య సహాయం పొందడం, ఆరోగ్యంపై సరైన అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రజలందరికీ విజ్ఞప్తి: ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మంచి ఆహారం, క్రమబద్ధమైన నిద్ర, నిత్య శారీరక శ్రమ, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి. ఆరోగ్యవంతమైన కుటుంబమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది. — భూక్య రాము నాయక్ పున్నమి రిపోర్టర్ | ప్రజా అవగాహన ప్రత్యేక కథనం

మహబూబాబాద్

తెలంగాణ సంస్కృతికి ప్రతీక సద్దుల బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక సద్దుల బతుకమ్మ మహిళల ఆటపాటలతో మారుమోగనున్న పల్లెలు.. ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మరిపెడ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో చివరి రోజైన సద్దుల బతుకమ్మను మహిళలు, యువతులు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకల్లో చివరి రోజును సద్దుల బతుకమ్మగా పిలుస్తారు. ప్రకృతిలో లభించే రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, గౌరమ్మను పూజిస్తూ సంప్రదాయ బతుకమ్మ పాటలతో ఆటపాటలు నిర్వహిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలను పేర్చడం ఈ పండుగ ప్రత్యేకత. మహిళలు, యువతులు ఒకచోట చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడడం తెలంగాణ గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది. కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి పండుగను సంప్రదాయబద్ధంగా ముగిస్తారు. ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలందరి ఇళ్లలో ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలని కోరుకుంటూ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లు.. భూక్య రాము నాయక్, పున్నమి రిపోర్టర్, లైసెన్స్ సర్వేయర్.

మహబూబాబాద్

గడువులోగా భూ రీసర్వే పూర్తి చేయాలి

భూ రీసర్వే పనులను వేగవంతంచేసి గడువులోగా పూర్తిచేయాలని అదనపు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెట్‌పల్లి మండలంలోని మేడిపల్లి గ్రామంలో, మండలంలో జరుగుతున్న నాన్‌ కెడస్ట్రల్‌ రీసర్వే, ఎంజాయ్‌మెంట్‌ రీసర్వేపనులను ఆయామండలాల ఆర్డీవోలు నరసింహా రావు, జీవకర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. గ్రామాల్లో ఇప్పటివరకు పూర్తి చేసిన సర్వే విస్తీర్ణం, సర్వేనంబర్ల వారీగా వివరాలను పరిశీలించి, ఇంకా చేపట్టాల్సిన పనులు, పూర్తియ్యే సమయం తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందుగా గ్రామ సరిహద్దులను నిర్ధారించి, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, మండల సర్వే సిబ్బంది సమన్వయంతో రీసర్వే చేపట్టాలన్నారు. అనంతరం రైతుల భూములను సర్వే చేస్తామన్నారు. రీ సర్వేలో గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శంగా పనులు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ యుద్ధప్రాతిపదికన సర్వే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమంలో తహసీల్దార్‌ ముక్తార్‌ఆలీ, ఆర్‌ కాంతయ్య, కోరుట్ల రూరల్‌లో తహసీల్దార్‌ కృష్ణ చైతన్య, గ్రామ సర్పంచ్‌ రంజిత్‌ రెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాస్‌, రాజేందర్‌రావుతోపాటు రెవ్వెన్యూ అధికారులు పాల్గొన్నారు.

మహబూబాబాద్

రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి నేరుగా రూ.2 వేలు.. జమ అయ్యేది అప్పుడే..!

దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఆర్థిక సాయం పొందుతున్న రైతులు తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పుడు 24వ విడత నిధులు ఎప్పుడు విడుదలవుతాయనే అంశంపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో అక్టోబర్‌లోనే డబ్బులు జమ కావచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే, 24వ విడత విడుదల తేదీపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చినట్లు ప్రస్తుతం నిర్ధారణ కాలేదు. కాబట్టి డబ్బులు ఏ తేదీన వస్తాయనే విషయాన్ని అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఏం చేయాలి? తదుపరి విడత నిధులు అందుకోవాలంటే రైతులు తమ లబ్ధిదారుల వివరాలను సరిచూసుకోవాలి. ముఖ్యంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. e-KYC: పీఎం కిసాన్ నమోదిత రైతులకు e-KYC తప్పనిసరి. భూమి వివరాలు: భూమి రికార్డులు, లబ్ధిదారుల అర్హత వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి. బ్యాంక్ ఖాతా: బ్యాంక్ ఖాతా వివరాలు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఆధార్, NPCI వివరాలు: బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఆధార్ సీడింగ్, NPCI మ్యాపింగ్ స్థితిని అవసరమైన చోట తనిఖీ చేసుకోవాలి. అర్హత లేదా ధ్రువీకరణలో సమస్యలు ఉంటే చెల్లింపులు నిలిచిపోయే అవకాశం ఉంది. అధికారిక పోర్టల్‌లోని ‘Know Your Status’ విభాగంలో లబ్ధిదారులు తమ వివరాలను పరిశీలించవచ్చు. PM Kisan Payment Status ఎలా చెక్ చేయాలి? అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి. ‘Know Your Status’ ఎంపికను ఎంచుకోండి. అడిగిన రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా వివరాలను నమోదు చేయండి. అవసరమైతే రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే OTP ద్వారా ధ్రువీకరించండి. మీ చెల్లింపు స్థితి, బ్యాంక్ వివరాలు, ఇతర అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించండి. మొత్తంగా, పీఎం కిసాన్ 24వ విడతగా అర్హులైన రైతులకు రూ.2,000 అందే అవకాశం ఉన్నప్పటికీ, విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఖచ్చితమైన తేదీని చెప్పడం సాధ్యం కాదు. రైతులు తమ e-KYC, బ్యాంక్, భూమి వివరాలను సరిచూసుకుని అధికారిక పోర్టల్‌లో తాజా అప్‌డేట్స్‌ను గమనించాలి.

మహబూబాబాద్

రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి

కరువుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది. పరిస్థితి చేయి దాటిపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో తామేం చేయలేమంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి నిస్సహాయత వ్యక్తంచేశారు. | రైతులు పంటలు వెయ్యొద్దు.. వద్దన్నా పంటలు వేస్తామంటే మీ కర్మ.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి అనుకున్నదంతా అయ్యింది! సర్కార్‌ చేతులెత్తేసింది!! నదులు ప్రవాహాలతో హోరెత్తినప్పుడు చుక్క నీరెత్తకుండా ఆంధ్రా చంద్రబాబు కోసం కింది రాష్ర్టానికి వాడుకోమని వదిలేసి.. ఇప్పుడు తన వైఫల్యాన్ని ఎల్‌ నినో పైకి నెట్టేస్తున్నది రేవంత్‌ సర్కార్‌. భజన మీడియా దానికి చిడతలు వాయిస్తున్నది. బహుశా దేశ చరిత్రలో సొంత రాష్ట్రంలో పారే నీటిని పక్క రాష్ర్టానికి దానమిచ్చి ఇంతటి ద్రోహానికి పాల్పడిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా ఉండి ఉండదు. ఇటు కాళేశ్వరం బాగు చేసి నీటిని ఎత్తి పోయకుండా ఉత్తర తెలంగాణను, అటు అర కిలోమీటర్‌ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణను ఈ సర్కార్‌ నిలువునా ముంచింది. నీళ్లన్నీ వెళ్లిపోయాక, అంతా అయిపోయాక పాలమూరు పంపులు నడిపి నాటకానికి తెర తీసింది. మనకు హక్కుభుక్తమైన నదుల జలాలను గురువు కోసం ధారపోసింది. క్యాబినెట్‌లో ఉన్న ఏ ఒక్క మంత్రీ నోరెత్తలేదు. చేలలో కండ్లముందు పంటలు ఎండి పోతుంటే చూడలేక.. బతికించుకోలేక రైతులు గోడుగోడున విలపిస్తున్నారంటే అది నూటికి నూరుశాతం ఈ సర్కార్‌ చేతగాని, చేవలేని తనమే. ఈ దేశంలో ఎందరెందరో సీఎంలుగా పని చేశారు. అందులో తమ రాష్ట్ర ప్రజలకు సాగు, తాగునీటి కోసం కేంద్రంతోనూ, కోర్టుల్లోనూ యుద్ధాలు చేసిన వారున్నారు. కానీ ప్రకృతి ఇచ్చిన నీటిని పక్క రాష్ర్టానికి ధారపోసిన సీఎంను మాత్రం తొలిసారి చూస్తున్నాం. తమ రాష్ట్రం కోసం ప్రజలు, రైతుల కోసం ఎందరు సీఎంలు ఎన్ని యుద్ధాలు చేశారో! కావేరీ నీటి విడుదల కోసం తమిళనాడులో ఎంజీఆర్‌ నుంచి మొదలుకొని జయలలిత, స్టాలిన్‌ దాకా సీఎంలంతా నిరాహార దీక్షలు జరిపి కేంద్రాన్ని కదిలించిన వారే. ఢిల్లీలో తాగునీటి అవసరాల కోసం హర్యానాతో రాజకీయ యుద్ధాలు చేసిన సీఎంలున్నారు. ఎందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తట్టుకొని నర్మదా వంటి భారీ ప్రాజెక్టులు కట్టిన వారున్నారు. మహారాష్ట్రలో చెరుకు రైతులకు నీటి కోసం పవార్‌ లాంటి నాయకులు ఉద్యమాలు చేసిన ఉదంతాలున్నాయి. రైతు బిడ్డగా పుట్టి రైతు కష్టం తెలిసిన, నీటి విలువ తెలిసిన దేవెగౌడ వంటి వారు కృష్ణా నది పొడవునా భారీ ప్రాజెక్టులు కట్టారు. అపర భగీరథుడు కేసీఆర్‌ తెలంగాణ నీటి కష్టాలను తీర్చడానికి కేవలం మూడున్నర ఏండ్లలో నే కాళేశ్వరం వంటి అద్భుతమైన ప్రాజెక్టును కట్టి చూపించారు. దక్షిత తెలంగాణ కోసం పాలమూరు ప్రాజెక్టును సిద్ధం చేశారు. చెరువులను బాగు చేసి, వాగులపై అడుగడుగునా చెక్‌డ్యాములు కట్టారు. కానీ, వెన్నుపోటు పార్టీలో పుట్టి పెరిగి పంటభూముల్లో కమర్షియల్‌ విలువను తప్ప పచ్చని ధాన్యలక్ష్మిని చూడని వాళ్లకు రైతు అర్థం కాలేదు. నీటి విలువ తెలిసిరాలేదు. కాంట్రాక్టులు, కమీషన్లు, కప్పాలు మరిగిన సర్కార్‌ తెచ్చి పెట్టిన విపత్తు ఇది. ప్రకృతి తెచ్చే కరువుకు పరిహారం ఉన్నది గానీ ప్రభుత్వం తెచ్చిన కరువుకు పరిహారం ఉండదు కదా?! ఇదా అభయహస్తం.. ఇందిరమ్మ రాజ్యం.. ప్రజాపాలన? సిగ్గు అనిపిస్తలేదా? కరువుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతులెత్తేసింది. పరిస్థితి చేయి దాటిపోయిందని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో తామేం చేయలేమంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి నిస్సహాయత వ్యక్తంచేశారు. కరువును ఎదుర్కొనే భారాన్ని ప్రజలు, రైతులపైనే మోపారు. పెద్దమనస్సుతో అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. ప్రజలకు, రైతులకు భరోసా ఇవ్వకుండా మరింత భయపెట్టే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టులన్నీ నీళ్లు లేక వట్టిపోయాయని, పంటలకు సాగు నీళ్లిచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. తాగునీళ్లకు కూడా క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే యాసంగిలో పంటలు సాగు చేయొద్దని సీఎం పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా వరి సాగును పూర్తిగా బంద్‌ చేయాలని సూచనలాంటి హెచ్చరిక జారీ చేశారు. పంటలకు సాగు నీళ్లు, కరెంట్‌ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని చేతులెత్తేశారు. ఇప్పుడున్న నీళ్లు నార్లకే సరిపోతాయని, ప్రభుత్వం చెప్పిన మాట వినకుండా పంటలు సాగుచేస్తే అది రైతుల కర్మ అనే విధంగా మాట్లాడారు. పంటలు సాగు చేస్తే సాగునీళ్లు, కరెంట్‌ లేక ఎండిపోవడం ఖాయమని, రైతులు నష్టపోవడం పక్కా అని స్పష్టంచేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఎల్‌ నినో, కరువు పరిస్థితులు, భవిష్యత్‌ కార్యాచరణపై సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నట్టే ఎల్‌ నినోతో ఇప్పుడు చేయి దాటే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నీటి సమస్యే కాకుండా విద్యుత్‌ సంక్షోభాన్ని ప్రజలు ఎదుర్కోబోతున్నారని స్పష్టంచేశారు. పంటల సీజన్‌ వాయిదా వేసుకోండి ‘తెలంగాణ సీఎంగా విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రకృతి ప్రకోపించింది. ఈ రోజు ప్రకృతి విపత్తును ఎదుర్కోబోతున్నాం. ప్రజలు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏ ప్రభావమైనా ముందు రైతులపైనే పడుతుంది.’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వరి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారని, కానీ వరికి చాలా నీళ్లు కావాలని పేర్కొన్నారు. విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉన్నదని, కొనుగోలు చేద్దామన్నా దొరుకడం లేదని చెప్పారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో చలికాలానికి ముందే వట్టిపోయే పరిస్థితి ఉన్నదని, గతంతో పోల్చితే కృష్ణా బేసిన్‌లో 72శాతం, గోదావరిలో 40శాతం తక్కువ నీళ్లు ఉన్నాయన్నారు. తాగునీటికే కష్టమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో సాగునీళ్లు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో 209 టీఎంసీల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ నీళ్లు నార్లకే సరిపోతాయని, పంటకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. ఒకవేళ సాగుకు నీళ్లు ఇస్తే ఇక తాగునీళ్లు అసలే ఇవ్వలేమన్నారు. యాసంగిలో పంటలు వేయడం తగ్గించుకోవాలని, డిసెంబర్‌లో నార్లు పోసి పంటలు వేయడానికి వెళ్లే పరిస్థితి లేదని చెప్పారు. ఒక సీజన్‌ పంట వేయడం వాయిదా వేసుకొని ఆ నీళ్లను పొదుపుగా వాడుకొని.. తాగడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చెప్పిన మాట వినకుండా వరి పంట వేస్తే నారు మళ్లకే నీళ్లు అందించలేక పంటలు ఎండిపోతాయని, మోటర్లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా కాలిపోతాయని, రైతులు పెద్ద మనసు చేసుకొని వరి పంటను ఒక సీజన్‌ వాయిదా వేసుకోవాలని కోరారు. 12 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. వానకాలానికి ముందే పంటల సాగు తగ్గించాలని సూచించినా రైతులు సాగు చేశారని, కానీ సాగు, కరెంట్‌ కొరతతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినట్టు గుర్తించామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మిగిలిన పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పంటలకు నీళ్లు అందించేందుకు 30 లక్షల పంపుసెట్లు ఆన్‌ చేయడంతో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగిందని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను అందిస్తున్నట్టు చెప్పారు. మేం ఏం చేయలేం… రైతులు, ప్రజలపైనే భారం కరువును ఎదుర్కోవడంలో, దీన్ని నుంచి ప్రజలు, రైతులను బయటపడేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేసినట్టు కనిపించింది. అందుకే నిస్తేజంగా ఇక ప్రభుత్వం తరఫున ఏం చేయలేమన్నట్టు తేల్చిచెప్పారు. భారమంతా ప్రజలు, రైతులపైనే నెట్టేశారు. ఒక్క ప్రభుత్వమో లేక ముఖ్యమంత్రో, లేక అధికారో చేస్తే ఈ కరువు బయటపడలేమని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కుల సంఘాలు, మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అందరం కలిసికట్టుగా నిలబడి ప్రకృతి విపత్తును ఎదుర్కొందామని కోరారు. ఇది మనందరి సమస్య.. మనందరం కలిసి ఎదుర్కోవాల్సిన సమస్య.. ఇది మానవులకు వచ్చిన సమస్య అంటూ వేదాలు వల్లించడం గమనార్హం. అదే విధంగా మీడియా, నిపుణులు కూడా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూనే, వ్యతిరేక వార్తలు రాయొద్దని చెప్పారు. సినీనటులతో ప్రచారం చేయించాలని సూచించారు. కళాజాత బృందాలు కూడా మాటలు, పాటల రూపంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని, ఎల్‌ నినోను ఎదుర్కొనేందుకు ప్రజలు అండగా నిలబడాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రంపైనే పరిహార భారం సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పగానే.. కరువుతో జరిగిన పంట నష్టానికి, యాసంగిలో జరుగబోయే నష్టానికి ప్రభుత్వం తరఫున రైతులకు పరిహారం ప్రకటిస్తారేమోనని భావించారు. కానీ సీఎం మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వకపోగా, కేంద్ర ప్రభుత్వంపై నెట్టేశారు. వానకాలం పంట నష్టపోయిన పంటకు, యాసంగిలో పంట వేయకుండా జరిగే నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని, విపత్తు నిధుల నుంచి రాష్ర్టానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయం తీసుకోవాలో ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇక విద్యుత్‌ సంక్షోభం నేపథ్యంలో ఎక్కువగా విద్యుత్‌ ఉత్పత్తి చేసే రాష్ర్టాల నుంచి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి మిగిలిన రాష్ర్టాలకు ఇవ్వాలని చెప్పారు. అది కూడా సబ్సిడీలో విద్యుత్‌ను అందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. 8-10 నెలలకు ఎంత విద్యుత్‌ అవసరం అవుతుందో, మన వద్ద ఎంత ఉందో లెక్క వేయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై దసరా తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్‌ కమిటీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. సబ్‌ కమిటీ, అధికారులు అందించే నివేదికల ఆధారంగా తన నేతృత్వంలో అఖిలపక్ష బృందం నవంబర్‌ మొదటి వారంలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి కరువు సాయంపై నివేదిక అందిస్తామని తెలిపారు. మీడియాకు సమాచారం అందించేందుకు ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావును నోడల్‌ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌ నినో సన్నద్ధతపై చేతులెత్తేసిన సర్కార్‌ ఎల్‌ నినో సంక్షోభ సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరచింది. తరుముకొచ్చిన కరువును ఎదుర్కొనే తరుణోపాయం ఆలోచించాల్సిన సర్కార్‌ ప్రజలను భయపెట్టింది. ధైర్యాన్ని నూరిపోయకుండా ఇది ప్రపంచాన్ని ముంచెత్తే విపత్తని, చెట్లూ పిట్టలకు కూడా ఇబ్బందులు తప్పవని ఆందోళనకు గురిచేసింది. ఎల్‌ నినో సన్నద్ధతపై తీసుకుంటున్న చర్యలేందో చెప్పకుండా

మహబూబాబాద్

భూభారతి సేవలకు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి!

భూభారతి పోర్టల్ద్వారా అందించే పలు సేవలకు ఆధార్‌ అథెంటికేషన్‌(ధ్రువీకరణ) తప్పనిసరి చేస్తూ సీసీఎల్‌ఏ డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. మ్యుటేషన్‌, ఫౌతి మ్యుటేషన్‌,డేటా సవరణ తదితరాలకు.. సీసీఎల్‌ఏ ఉత్తర్వులు హైదరాబాద్‌, భూభారతి పోర్టల్‌ ద్వారా అందించే పలు సేవలకు ఆధార్‌ అథెంటికేషన్‌(ధ్రువీకరణ) తప్పనిసరి చేస్తూ సీసీఎల్‌ఏ డీఎస్‌ లోకేశ్‌ కుమార్‌ ఉత్తర్వులిచ్చారు. భూ లావాదేవీలకు సంబంధించిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు, భూముల మ్యుటేషన్‌కు, పట్టాదారు మరణించినప్పుడు వారసత్వ హక్కుల బదిలీ (ఫౌతి మ్యుటేషన్‌) కోసం, పట్దాదారు పాస్‌పుస్తకం దరఖాస్తులకు, పాస్‌ పుస్తకాల్లో డేటా సవరణకు, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి(నాలా) చేసేందుకు ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి చేశారు. ఈ సేవలకు సంబంధించి పౌరుల గుర్తింపు కోసం ఓటీపీ లేదా, ఈ కేవైసీకి సంబంధించిన బయోమెట్రిక్‌ ఐరిష్‌ ధ్రువీకరణ ద్వారా నిర్ధారించేందుకు రెవెన్యూశాఖ అనుమతించింది. భూభారతి పోర్టల్‌లో శాఖాపరమైన సేవలకు కూడా ఆధార్‌ ధ్రువీకరణను అనుమతించారు. సీసీఎల్‌ఏ ప్రధాన కార్యాలయం, జిల్లా కలెక్టరేట్లలో ఉద్యోగుల హాజరు నమోదు, భూభారతి పోర్టల్‌లో ఉద్యోగుల లాగిన్‌ అథెంటికేషన్‌, పట్టాదారుల ఖాతా వివరాల నవీకరణ వంటి సేవల్లో ఆధార్‌ తప్పనిసరి చేశారు. ఆధార్‌ అథెంటికేషన్‌ అమలు చేసే ముందు సంబంధిత వ్యక్తుల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆధార్‌ఉన్న వ్యక్తి సమ్మతి తీసుకోవడంతోపాటు,అథెంటికేషన్‌ స్వచ్ఛందంగా ఉండాలని ఆదేశించారు.

మహబూబాబాద్

శిరోలు మండలంలో వారాంతపు సంత ఏర్పాటు చేయాలని వినతి

శిరోలు మండలంలో వారాంతపు సంత ఏర్పాటు చేయాలని వినతి శిరోలు: శిరోలు మండలంలో వారాంతపు సంత ఏర్పాటు చేయాలని కోరుతూ తహసీల్దార్ పూర్ణచంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. మండలంలో వారాంతపు సంత ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక రైతులు, వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. వారాంతపు సంత అందుబాటులో ఉంటే రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించుకోవడంతో పాటు, గ్రామీణ ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. సంత ఏర్పాటు వల్ల స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభించడంతో పాటు ప్రజలకు రవాణా ఖర్చులు, సమయం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని శిరోలు మండలంలో వారాంతపు సంత ఏర్పాటుకు సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వినతిదారులు కోరారు.

మహబూబాబాద్

వరి.. వర్రీ

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ఈ ఖరీ్‌ఫలో వరిసాగు గణనీయంగా పడిపోయింది. ఎటుచూసినా పచ్చటి వరిపొలాలతో కళకళలాడే ఈ ప్రాంతం నేడు బోసిపోయింది. కాస్త పంట ఎండుముఖం అమాంతం పెరిగిన బియ్యం ధరలు: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో ఈ ఖరీ్‌ఫలో వరిసాగు గణనీయంగా పడిపోయింది. ఎటుచూసినా పచ్చటి వరిపొలాలతో కళకళలాడే ఈ ప్రాంతం నేడు బోసిపోయింది. గతంలో ఏ వర్షాకాలంలోను ఇలాంటి పరిస్థితి ఎదుర్కొలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీ, తెలుగు గంగ కాలవతోపాటు చెరువుల్లో కడా నీరు లేదు. కేవలం బోర్ల కింద మాత్రమే ఈ ఏడాది వరి సాగు చేపట్టారు. ఎల్‌నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక పోవడంతో వరి సాగుచేస్తే నీటి కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. గణనీయంగా పడిపోయిన సాగు వ్యవసాయ అధికారుల లెక్కల మేరకు ఖరీ్‌ఫలో 6 వేల హెక్టార్లలో వరి సాగు చేసేవారు. అయితే ఈ ఏడాది 3వేల హెక్టార్లలో మాత్రమే సాగుచేశారు. తీవ్ర వేడి వతావరణం ప్రభావంతో ఉన్న కాస్త పంట కూడా ఎండుమఖం పట్టింది. కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలైన మినుము, మొక్కజొన్న, కంది, జొన్న, ఉద్యాన పంటలైన అరటి, పసుపు, బొప్పాయి సాగుచేశారు. మరికొందరు భూములను బీడుగా వదిలేశారు. ప్రభుత్వం కరువు మండలం కింద ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బియ్యం ధరలకు రెక్కలు.. వరి పంట లేకపోవడంతో మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. గతంలో నంద్యాల సోనా 50కేజీల ప్యాకెట్‌ మార్కెట్‌లో రూ.1,500 ఉండేది. ఈ ఏడాది ఖరీఫ్‌ ఆరంభంలోనే రూ.4వేలు పైగానే పలకడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. నీటి కొరత ఉన్నా సాగుచేశా.. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో నీటి కొరత ఉన్నా 4 ఎకరాల్లో బోరు కింద వరి సాగు చేశా. గతేడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో అధిక దిగుబడి వచ్చి ఆదాయం లభించింది. అయితే ఈ ఏడాదిఅందుకు పరిస్థితి విరుద్ధం. దేవుడిపై నమ్మకంతో సాగు చేశాను. – లాలునాయక్‌, రైతు, కేపీ తండా ఆరుతడి పంటలు వేయండి రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలి. రబీలో మినుము, కంది, పెసర, ఆముదం, కొర్రలు, రాగులు, జొన్న సాగుచేస్తే మేలు. ఎల్‌నినో ప్రభావం దృష్టిలో ఉంచుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

మహబూబాబాద్

ప్రియుడి బెయిల్ కోసం డ్రగ్స్ క్యారియర్‌గా యువతి.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్

బెంగళూరు నుంచి 110 గ్రాముల ఎండీఎంఏ తరలింపు.. రూ.50 వేల కమిషన్ ఆశతో అక్రమ రవాణాకు అంగీకారం* జైల్లో ఉన్న ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ యువతి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. బెంగళూరు నుంచి విజయవాడకు 110 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ తీసుకొస్తుండగా నాగసౌమ్య అనే యువతిని విజయవాడ రైల్వే స్టేషన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న బషీర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. *బెయిల్ డబ్బుల కోసం అక్రమ మార్గం* విజయవాడ పటమటకు చెందిన నాగసౌమ్యకు మాదకద్రవ్యాల అలవాటు ఉన్నట్లు కథనంలో పేర్కొన్నారు. ఆమె ప్రియుడు కాశీవర్ధన్ మూడు నెలల క్రితం డ్రగ్స్ సరఫరా కేసులో చిత్తూరులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నట్లు సమాచారం. అతడికి బెయిల్ ఇప్పించేందుకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఆమె డ్రగ్స్ రవాణాకు అంగీకరించినట్లు పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది. విజయవాడ కృష్ణలంకకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు బషీర్‌.. బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలు తీసుకొస్తే రూ.50 వేల కమిషన్ ఇస్తానని నాగసౌమ్యకు ఆఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆఫర్‌కు అంగీకరించిన ఆమె అక్రమ రవాణాలో భాగస్వామిగా మారినట్లు దర్యాప్తులో వెల్లడైందని సమాచారం. *ప్రత్యేక జేబులో డ్రగ్స్ ప్యాకెట్లు* ఈ నెల 13న నాగసౌమ్య బెంగళూరులోని యలహంకకు వెళ్లి, అక్కడ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రెండు ప్యాకెట్లలో ఉన్న 110 గ్రాముల ఎండీఎంఏను తీసుకున్నట్లు సమాచారం. అనంతరం బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో విజయవాడకు బయలుదేరింది. ముందస్తు సమాచారంతో ఈగల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర, జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ రమణ ఆధ్వర్యంలోని పోలీసు బృందాలు విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిఘా ఏర్పాటు చేశాయి. తనిఖీలు జరుగుతున్న విషయాన్ని గమనించిన నాగసౌమ్య బషీర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో బషీర్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు కథనంలో పేర్కొన్నారు. పోలీసులు నాగసౌమ్యను తనిఖీ చేయగా, ఆమె ప్యాంటు లోపల ప్రత్యేకంగా కుట్టించిన జేబులో దాచిన డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం పరారీలో ఉన్న బషీర్‌ను కూడా విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. *యువతకు హెచ్చరిక.. తాత్కాలిక డబ్బు కోసం జీవితాన్ని పణంగా పెట్టొద్దు* మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో క్యారియర్‌గా వ్యవహరించడం కూడా తీవ్రమైన చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చు. డబ్బు అవసరం, వ్యక్తిగత సంబంధాలు లేదా త్వరగా సంపాదించాలనే ఆశతో ఇలాంటి నేరాల్లో భాగస్వాములు కావడం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టవచ్చు. మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా రెండూ వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ ఘటనలో స్వాధీనం చేసుకున్న పదార్థం, దాని పరిమాణం, నిందితుల పాత్ర, తదితర అంశాలు దర్యాప్తు మరియు న్యాయప్రక్రియలో నిర్ధారణ కావాల్సి ఉంటుంది. నిందితులపై ఆరోపణలు ఉన్నంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదు. కేసు వివరాలపై అధికారిక పోలీసు ప్రకటన ఆధారంగా మరిన్ని విషయాలు స్పష్టమవుతాయి.

మహబూబాబాద్

దివ్యాంగులకు కేంద్రం శుభవార్త.. పెన్షన్ అర్హత 40 శాతానికి తగ్గింపు!

*పుట్టుకతోనే అర్హత.. 18 ఏళ్ల వయోపరిమితి తొలగింపు.. రూ.53,428 కోట్లతో సామాజిక భద్రతా పథకం కొనసాగింపు* అక్టోబర్ 15, 2026: దేశవ్యాప్తంగా దివ్యాంగులకు మరింత విస్తృతంగా సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అక్టోబర్ 14న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (National Social Assistance Programme – NSAP)ను 2026–27 నుంచి 2030–31 వరకు మరో ఐదేళ్లపాటు కొనసాగించేందుకు రూ.53,428 కోట్ల నిధులను ఆమోదించారు. ఈ పథకానికి ‘ప్రధానమంత్రి సామాజిక సహాయత యోజన’గా కొత్త పేరు పెట్టారు. ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్ అర్హత నిబంధనలను సడలిస్తూ, మరింత మందికి ప్రయోజనం చేకూరేలా మార్పులు ప్రకటించారు. *80 శాతం నుంచి 40 శాతానికి అర్హత* ఇప్పటివరకు ఈ పథకం కింద దివ్యాంగుల పెన్షన్ పొందేందుకు అవసరమైన కనీస దివ్యాంగత్వ ప్రమాణాన్ని 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో 40 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ధ్రువీకరించిన దివ్యాంగత్వం ఉన్న అర్హులైన వ్యక్తులు కూడా ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దివ్యాంగుల హక్కుల చట్టం–2016లోని ప్రమాణాలకు అనుగుణంగా ఈ మార్పు చేపట్టినట్లు కేంద్రం వెల్లడించింది. *పుట్టుకతోనే పెన్షన్ అర్హత* దివ్యాంగుల పెన్షన్‌కు సంబంధించి ఉన్న కనీస వయోపరిమితిని తొలగించారు. గతంలో ఉన్న 18 ఏళ్ల వయోపరిమితి స్థానంలో పుట్టుక నుంచే అర్హతను పరిగణనలోకి తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే, పెన్షన్ పొందేందుకు సంబంధిత పథకం నిబంధనలు, దివ్యాంగత్వ ధ్రువీకరణ, ఆదాయం లేదా కుటుంబ అర్హత వంటి వర్తించే షరతులను పరిశీలించాల్సి ఉంటుంది. *నెలవారీ పెన్షన్ ఎంత?* కొత్త నిర్ణయం ప్రకారం కేంద్ర పథకం కింద దివ్యాంగుల ఆర్థిక సహాయాన్ని వయస్సును బట్టి ఈ విధంగా నిర్ణయించారు. – 0 నుంచి 79 ఏళ్ల వరకు: నెలకు రూ.375. – 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి: నెలకు రూ.625. దివ్యాంగుల కోసం అందించే సహాయాన్ని, ఇతర సమాన పథకాల కింద ఇచ్చే సహాయంతో పోలిస్తే కనీసం 25 శాతం ఎక్కువగా ఉండాలనే నిబంధనకు అనుగుణంగా ఈ మార్పులు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. *దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మందికి ప్రయోజనం* ఈ పథకం కొనసాగింపుతో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 3.20 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఈ సంఖ్య మొత్తం సామాజిక సహాయ కార్యక్రమానికి సంబంధించినది. దివ్యాంగుల పెన్షన్‌లో కొత్త అర్హతల వల్ల అదనంగా ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందనే అంశాన్ని వేరుగా చూడాలి. *ఇతర పెన్షన్ పథకాల పేర్లలోనూ మార్పులు* సామాజిక సహాయ కార్యక్రమంలో భాగంగా మరికొన్ని పథకాల పేర్లను కూడా కేంద్రం మార్చింది. – ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం – ప్రధానమంత్రి వృద్ధాప్య పెన్షన్ యోజన. – ఇందిరాగాంధీ జాతీయ వితంతు పెన్షన్ పథకం – ప్రధానమంత్రి విధవ పెన్షన్ యోజన. – ఇందిరాగాంధీ జాతీయ దివ్యాంగుల పెన్షన్ పథకం – ప్రధానమంత్రి దివ్యాంగజన్ పెన్షన్ యోజన. – జాతీయ కుటుంబ ప్రయోజన పథకం – ప్రధానమంత్రి కుటుంబ లాభ యోజన. వృద్ధులు, వితంతువులకు సంబంధించిన పెన్షన్ పథకాలు, కుటుంబ ప్రయోజన పథకం ప్రస్తుత విధానంలో కొనసాగుతాయని కేంద్రం తెలిపింది. *ఎప్పటి నుంచి అమలు?* దివ్యాంగుల పెన్షన్‌కు సంబంధించి అర్హతలు, లబ్ధిదారుల సంఖ్య, ఆర్థిక సహాయం వంటి అంశాలపై మార్గదర్శకాలను మూడు నెలల్లోగా జారీ చేసి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల అర్హులైన వారు కొత్త నిబంధనల అమలు తేదీ, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలపై అధికారిక మార్గదర్శకాలను గమనించాలి. *ముఖ్య గమనిక:* ఈ పెన్షన్ కేంద్ర ప్రభుత్వ సామాజిక సహాయ పథకానికి సంబంధించినది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే దివ్యాంగుల పెన్షన్ మొత్తాలు, అర్హతలు వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి కేంద్ర పథకంలో ప్రకటించిన మొత్తాలను రాష్ట్రంలో ప్రస్తుతం అందుతున్న పెన్షన్ మొత్తంతో కలిపి చూడకూడదు.