ఆధునిక హంగులతో ఆర్ఎస్ఆర్–డిఎస్ఆర్ పాఠశాలలు
నగరంలోని ఆర్ఎస్ఆర్, డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తన కుమార్తె షరణితో కలిసి పనులను పరిశీలించి, ఈ నెల 15లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పాఠశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం మూసివేసిన వీఆర్సీని ఆధునీకరించామని, నగరంలోని 15 ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని నారాయణ చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమన్నారు. డిఎస్ఆర్ స్కూల్‌లో విద్యార్థులతో కలిసి బాస్కెట్‌బాల్ ఆడి మంత్రి సందడి చేశారు. కార్యక్రమంలో బీదా రవిచంద్ర, రూప్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


