Wednesday, 30 September 2026

Tag: Peddapalli

తెలంగాణ పెద్దపల్లి

అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

*అంతర్గాం మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అంతర్గాం, జులై 17, పున్నమి ప్రతినిధి: పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అంతర్గాం మండలం మద్దిరాల గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, పోట్యాల గ్రామంలోని ఎంపీపీఎస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గోలివాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని, పాఠశాల ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. పాఠశాలల్లోని పిల్లలకు విష జ్వరాలు రాకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ‌పాఠశాలలకు ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాబోయే 5 సంవత్సరాల పాటు ఎటువంటి అవసరాలు లేకుండా పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని, వాటిని వెను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మద్దిరాల గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారం అధికారులు అందించాలని కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట అంతర్గాం ఎంపీడీఓ వేణుమాధవ్, హౌసింగ్ ఈఈ రాజేశ్వర్, హౌసింగ్ డీఈ దస్తగిరి, పంచాయతీ రాజ్ డీఈ అప్పల నాయుడు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

జులై 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఎంబీసి అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం

*జులై 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఎంబీసి అభ్యర్థుల దరఖాస్తులకు ఆహ్వానం* *_పెద్దపల్లి జిల్లా బీసి అభివృద్ధి అధికారి జే.రంగారెడ్డి_* పెద్దపల్లి, జులై 17, పున్నమి ప్రతినిధి: ఈ నెల 21 లోపు నైపుణ్య శిక్షణ కోసం ఆసక్తి, అర్హత గల ఎంబీసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జె.రంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎంబీసీ నిరుద్యోగ యువతీ యువకుల కు వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమం 4 రోజుల పాటు హైదరాబాద్ లో అందించడం జరుగుతుందని అన్నారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు భోజన సదుపాయం, టీఏ, వసతి కల్పించడం జరుగుతుందని అన్నారు. అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల వయసు లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలని, ఎంబిసి 36 కులాల వారికి మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమం అందుతుందని, వీరి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు ఉండాలని అన్నారు. ఆసక్తి, అర్హత కల అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 21 లోపు tgobmms.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకొని, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, విద్యార్హత సర్టిఫికెట్లతో దరఖాస్తు జత చేసి పెద్దపల్లి కలెక్టరేట్ లో ఉన్న బీసీ అభివృద్ధి అధికారి కార్యాలయంలో జూలై 22 లోపు సమర్పించాలని, నిరుద్యోగ ఎంబీసీ యువతీ యువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే. రంగారెడ్డి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పోస్టులు మoజూరు చేయండి

ముధోల్, జులై 16(తెలంగాణ పున్నమి ప్రతినిధి ):మండల కేంద్రమైన ముధోల్లో ప్రారంభం అయినా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2024 సంవత్సరంలో 54 విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. 8మంది అతిథి అధ్యాపకుల నియామకం జరిగింది. ఈ సంవత్సరo కుడా అధ్యాపకుల సహకారంతో ఫేస్ 3 వరకు 86 మంది విద్యార్థులు అడ్మిషన్స్ పొందారు. కానీ ఇప్పట్టి వరకు అధ్యాపకులకు పర్మిషన్ ఇవ్వలేదు. అడ్మిషన్స్ షెడ్యూల్ ప్రకారం క్లాస్ లు ప్రారంభమయ్యాయి. అధ్యాపకుల నియామకంలో ఆలస్యం వలన విద్యార్థులు నష్టపోతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీవోలో ముధోల్ డిగ్రీ కళాశాల కు పోస్ట్ లు మంజూరు చేయలేదు. దీని వలన ఇక్కడ ఉన్న అధ్యాపకులకు విద్యార్థులకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కమీషనర్ వెంటనే స్పందించి ముధోల్ కళాశాలకు పోస్ట్ లు-నిధులు విడుదల చేయాలని ముధోల్ వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి ముధోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ కి స్థానిక నాయకులు ఫోన్ చేసి వివరించారు. ఎమ్మెల్యే కూడా ఈ విషయం పై ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్య పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది.

తెలంగాణ పెద్దపల్లి

రైతులకు యూరియా కొరత లేకుండా సరఫరా చేయాలి: సీపీఐ

*రైతులకు యూరియా కొరతను నివారించి, సరఫరా చేయాలి* *జూలై 17 న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి* *సీపీఐ పూర్వ జిల్లా కార్యదర్శి గౌతం గోవర్ధన్* ముత్తారం, జులై 15, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఉన్న రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని, కొరతను నివారించి సరపరా చేయాలని సీపీఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ ప్రభుత్వ అధికారులను కోరారు. మంగళవారం ముత్తారం మండల సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వర్షా కాలం ప్రారంభమై రైతులు తమ వ్యవసాయ అవసరాలకు సరిపడా యూరియా దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారని, మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న రైతులకు సరిపడా యూరియాను అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) పెద్దపల్లి జిల్లా మహాసభలు జూలై 17 న జిల్లా కేంద్రంలోని ఎస్ .ఎన్ గార్డెన్ లో జరుగుతాయని ఆయన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆయన అన్నారు. సీపీఐ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ మహాసభలు నిర్వహించి నూతన నాయకత్వాన్ని ఎన్నుకుని భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ జాతీయ సమితి నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 17 న జరిగే జిల్లా మహాసభల్లో ముత్తారం మండల సీపీఐ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరౌతారని ఆయన అన్నారు. ముత్తారం మండల సీపీఐ కార్యదర్శి కామ్రేడ్ గాదె సమ్మయ్య అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ నాయకులు అల్లం ఓదేలు, గుండ విజయ్ కుమార్, రేగుంట మహేశ్, గంధం రాజయ్య, ముంజ సతీష్, సి.హెచ్. రాజ్ కుమార్, ఎం.చంద్రమౌళి, నల్లి శంకర్, జి.గంగయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా పి.ఆర్.టి.యు.టి.ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎంపిక

పెద్దపల్లి జిల్లా పి.ఆర్.టి.యు.టి.ఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎంపిక పెద్దపల్లి, జులై 15, పున్నమి ప్రతినిధి: పెద్దపల్లి జిల్లా నూతన పి.ఆర్.టి.యు.టి.ఎస్ అధ్యక్షుడుగా గండు కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శిగా కానుగంటి శ్రీనివాస్ ను ఎంపిక చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర రెడ్డి లు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిల్లా ఆవిర్భావం తర్వాత కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కానుగంటి శ్రీనివాస్ ను తిరిగి ఆ పదవి కోసం ఎంపిక చేసి, అధ్యక్షుడుగా గండు కృష్ణ మూర్తిని నియామకం చేసినందుకు పి.ఆర్.టి.యు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డికి, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి, రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి, వివిధ మండల శాఖల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శిలకు, జిల్లా, రాష్ట్ర బాధ్యులు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.