Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: No

ఎన్ టి ఆర్ జిల్లా

పేద మధ్యతరగతికి తెలుగుదేశం పార్టీ ఆర్థిక సహాయం

*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…* *వైద్య చికిత్సకు రూ.5.01 లక్షల ఎల్.ఓ.సి మంజూరు.* *ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి సిఫారసుతో వైద్యసాయం.* *ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, అక్టోబర్ 7:* *విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి-5(R)కు చెందిన పాండ్రంగి విష్ణు నీల స్కందన్ గారికి వైద్య చికిత్స నిమిత్తం రూ.5,01,812 విలువైన ఎల్.ఓ.సి మంజూరైంది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ ఎల్.ఓ.సిని మంజూరు చేసింది.* *అనారోగ్యంతో చికిత్స అవసరమైన పాండ్రంగి విష్ణు నీల స్కందన్ గారికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రూ.5,01,812 వరకు ఆర్థిక సహాయం అందించేందుకు హామీ ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల విషయంలో ఆర్థిక భరోసా లభించింది.* *పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్స సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్.ఓ.సి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫారసుల మేరకు నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారికి వైద్యసాయం అందేలా చర్యలు కొనసాగుతున్నాయి.*

ASIFABAD

రేపు తిర్యాణి మండలంలో ఆటోల బంద్ లింగమూర్తి ప్రకటన.

పెరిగిన నిత్యవసరాలు ధరలు డీజిల్ ధరల నేపథ్యంలో ఆటో చార్జీల పెంపునకు తిర్యాణి ఆటో యూనియన్ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు ఆటోలో యూనియన్ అధ్యక్షుడు లింగమూర్తి తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన యూనియన్ సమావేశాలొ చర్చించిన అంశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బంద్ అనంతరం బిర్యాని నుంచి ఐబి తాండూర్ వరకు పెరిగిన చార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ లింగమూర్తి గారు తెలియజేశారు.