*ఎన్టీఆర్ జిల్లా మైలవరం…*
*వైద్య చికిత్సకు రూ.5.01 లక్షల ఎల్.ఓ.సి మంజూరు.*
*ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారి సిఫారసుతో వైద్యసాయం.*
*ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, అక్టోబర్ 7:*
*విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి-5(R)కు చెందిన పాండ్రంగి విష్ణు నీల స్కందన్ గారికి వైద్య చికిత్స నిమిత్తం రూ.5,01,812 విలువైన ఎల్.ఓ.సి మంజూరైంది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ ఎల్.ఓ.సిని మంజూరు చేసింది.*
*అనారోగ్యంతో చికిత్స అవసరమైన పాండ్రంగి విష్ణు నీల స్కందన్ గారికి అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం రూ.5,01,812 వరకు ఆర్థిక సహాయం అందించేందుకు హామీ ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల విషయంలో ఆర్థిక భరోసా లభించింది.*
*పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్య చికిత్స సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్.ఓ.సి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారి సిఫారసుల మేరకు నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారికి వైద్యసాయం అందేలా చర్యలు కొనసాగుతున్నాయి.*
