నడిపించే నాయకుడెవరు? కేడర్ ఉన్నా లీడర్ సున్నా!
నెల్లూరు జిల్లాలో జనసేనకు బలమైన కేడర్, యువతలో అపార ఆదరణ ఉన్నప్పటికీ పార్టీని సమన్వయం చేసి ముందుకు నడిపించే అధికారిక నాయకత్వం లేకపోవడం చర్చనీయాంశమైంది. జిల్లా అధ్యక్ష పదవికి చిట్టమూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, నూనె మల్లికార్జున్ యాదవ్, సుకుమార్ రెడ్డి, మాగుంట శరత్ చంద్రారెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పరిశీలకుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా పరిస్థితులను అధ్యయనం చేసినట్లు సమాచారం. మరోవైపు వేములపాటి అజయ్ కుమార్ టిడ్కో చైర్మన్‌గా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడితో పాటు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలను త్వరగా ప్రకటించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.


