Friday, 18 September 2026

Tag: Nellore Rural

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బీసీ, అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ భవనాల పనుల పరిశీలన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బీసీ భవన్, అంబేద్కర్ భవన్, బాబు జగ్జీవన్‌రామ్ భవనాల నిర్మాణ పనులను ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బీద రవిచంద్ర మాట్లాడుతూ బీసీ భవన్ నిర్మాణానికి మంత్రి నారాయణ, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు చెరో రూ.కోటి అందించడం సంతోషకరమన్నారు. ఈ నెల 22న బీసీ భవన్ పనులు, అక్టోబర్‌లో అంబేద్కర్ భవన్ పనులు పునఃప్రారంభిస్తామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సంబంధిత భవనాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. కార్యక్రమంలో బీసీ, ఎస్సీ నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.