Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Nalgonda

నల్గొండ

కేసీఆర్‌కు రేవంత్ సవాల్.. అసెంబ్లీకి రా.. లేదంటే రాజీనామా చేయి!

కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలనపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి నకిరేకల్ సభలో ఘాటుగా స్పందించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో తమ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకోవాలని సవాల్ చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉద్యోగాల కల్పన వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ లెక్కలపై చర్చించాలని సవాల్ విసిరారు. సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్‌లోనూ కాంగ్రెస్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

నల్గొండ

‘బాబూ’ అన్న మాటతో వీడిన మర్డర్ మిస్టరీ

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివరాల ప్రకారం, అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు 16 ఏళ్ల విద్యార్థులే నిందితులు. డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి, ప్రతిఘటించిన రూపారెడ్డిపై కత్తితో దాడి చేసి రూ.2.50 లక్షలు, ఐఫోన్ అపహరించినట్లు పోలీసులు తెలిపారు. 70 సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్, కాల్‌డేటా ఆధారాలతో దర్యాప్తు సాగించి నిందితులను గుర్తించారు. వారి నుంచి రూ.1.56 లక్షలు, ఐఫోన్, కత్తి, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ

విద్యార్థులే హంతకులు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె వద్ద చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు డబ్బు కోసం ఇంట్లోకి చొరబడి, కత్తితో 27 సార్లు పొడిచి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ.2 లక్షలు తీసుకొని హైదరాబాద్‌లో జల్సాలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు బాల నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.