Wednesday, 16 September 2026

Tag: #Khammamrtc

ఖమ్మం

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూకు అన్యాయం? చలో హైదరాబాద్‌కు ఖమ్మం నుంచి 200 మంది కార్మికులు

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)కు పోటీ చేసే అర్హత లేదంటూ రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్‌లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. టీఎంయూ నాయకుడు అశ్వత్థామారెడ్డి నాయకత్వంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఖమ్మం నుంచి సుమారు 200 మంది ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. రవీందర్‌నాథ్ నాయకత్వంలో కార్మికులు ప్రత్యేకంగా బయలుదేరారు. టీఎంయూకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని, రిటర్నింగ్ అధికారి ఉత్తర్వులను పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.