I&PR ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బి. శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌరసంబంధాల శాఖ (I&PR) ఇన్‌చార్జి డైరెక్టర్‌గా ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. డైరెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్ ఐఏఎస్ శిక్షణ కార్యక్రమానికి వెళ్లనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత మల్లవరపు సూర్యతేజకు అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ, తాజాగా ఉత్తర్వులను సవరించి 2018 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాసరావుకు బాధ్యతలు అప్పగించింది. సమర్థ అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.


