Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Health

నంద్యాల

నంద్యాలలో క్యాన్సర్ అవగాహన భారీ పింక్ వాకథాన్

నంద్యాల:ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ఐఎంఏ (IMA) మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో భారీ ‘పింక్ వాకథాన్’ నిర్వహించారు. ఎన్టీఆర్ టౌన్‌హాల్ నుండి మార్కెట్ యార్డు వరకు సాగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌పై మహిళలు అవగాహన పెంచుకోవాలని, ప్రాథమిక దశలోనే గుర్తిస్తే చికిత్స సులువవుతుందని తెలిపారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం స్వీయ పరీక్ష విధానంపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఐఎంఏ మహిళా వైద్యులు, కళాశాల విద్యార్థినులు భారీగా హాజరయ్యారు.

నంద్యాల

నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పింక్ మారథాన్

నంద్యాల:మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. శనివారం నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నుంచి టెక్కె మార్కెట్ యార్డ్ వరకు నిర్వహించిన ‘పింక్ మారథాన్’ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరితో కలిసి ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రొమ్ము క్యాన్సర్‌పై మహిళల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. రొమ్ములో గడ్డలు, అసాధారణ నొప్పి, చర్మంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ప్రతి గడ్డ క్యాన్సర్ కాదని భయాందోళన చెందవద్దని తెలిపారు. మహిళలు క్రమం తప్పకుండా స్వీయ పరిశీలన చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నంద్యాల

నంద్యాలలో విజయవంతంగా ఐఎంఏ మహిళా విభాగం “పింక్ వాకథన్” భారీ ర్యాలీ

నంద్యాల:ప్రపంచ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నంద్యాల శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో “పింక్ వాకథన్” పేరిట భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్ నుండి మార్కెట్ యార్డ్ వరకు జరిగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి జండా ఊపి ప్రారంభించి, ముగింపు వరకు నడిచారు. ప్రధాన ముఖ్యాంశాలు: ప్రాథమిక దశలోనే గుర్తింపు: రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు మహిళలు స్వీయ పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని ఎంపీ బైరెడ్డి శబరి సూచించారు. ప్రభుత్వ ప్రోత్సాహం: మహిళా ఆరోగ్యంపై ఐఎంఏ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఆరోగ్య శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. విశేష స్పందన: ర్యాలీ ప్రారంభంలో వైద్యులు లఘు నాటికలు, ప్రసంగాల ద్వారా స్వీయ పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఎంపీ, కలెక్టర్ కలిసి రొమ్ము క్యాన్సర్ అవగాహనా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారద బాయ్, ఐఎంఏ మహిళా విభాగం ప్రతినిధులు (డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, డాక్టర్ నర్మద, డాక్టర్ నాగమణి), ఇతర సీనియర్ వైద్యులు, ఎస్.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల మరియు రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థినులు పింక్ క్యాప్‌లు ధరించి భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నంద్యాల

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

నంద్యాల: మహిళలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, రొమ్ములో వచ్చే మార్పులను తొలిదశలోనే గుర్తిస్తే క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలోని క్యాంపు కార్యాలయంలో ఐఎంఏ ఉమెన్ డాక్టర్స్ వింగ్, నంద్యాల అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన రొమ్ముల స్వీయ పరీక్ష అవగాహన కరపత్రాన్ని మంత్రి ఫరూక్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆవిష్కరించారు. ప్రతి మహిళ నెలకు ఒకసారి స్వీయ పరీక్ష చేసుకోవాలని, గడ్డలు లేదా ఇతర మార్పులు గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి సూచించారు.అక్టోబర్ 3న ఉదయం 10 గంటలకు మున్సిపల్ టౌన్ హాల్ నుంచి టేక్కే మార్కెట్ యార్డ్ వరకు పింక్ వాకథాన్ నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు వి. అనిల్ కుమార్, వి. హరిత, ఎస్. వసుధరణి, పి. సునీత పాల్గొన్నారు.

నంద్యాల

రేబీస్‌పై అప్రమత్తతే రక్షణ

ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా నంద్యాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శారద బాయి, జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ ఎస్. అశ్రుఫ్ ఆలీ రేబీస్ దినోత్సవ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రేబీస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కుక్కలు, ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బు, నీటితో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా ప్రభుత్వ వైద్యసంస్థను సంప్రదించి యాంటీ రేబీస్ టీకా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రసన్న లక్ష్మీ, డీపీఎంవో డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రీజ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

నంద్యాల

ఆయుర్వేద దినోత్సవం: కలెక్టరేట్‌లో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా పరీక్షలు చేయించుకుని మందులు పొందిన కలెక్టర్, ఆయుర్వేదం మన సంప్రదాయ విజ్ఞానంలో కీలకమైనదని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలి వల్ల వచ్చే నడుము నొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు ఆయుర్వేద వైద్యం ఎంతో మేలు చేస్తుందని, ప్రజలు అర్హులైన వైద్యుల సలహాతో ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.జిల్లా ఆయుష్ అధికారి యశోద మాట్లాడుతూ సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవన విధానం ద్వారా ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. నాడీ, బిఎమ్‌డి, హెచ్‌బి పరీక్షలు నిర్వహించిన ఈ శిబిరంలో పాల్గొన్న అధికారులకు, ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు

నంద్యాల

ఎయిడ్స్‌ నియంత్రణకు సమష్టిగా పోరాడుదాం: డాక్టర్‌ శారదాబాయి

నంద్యాల: ఎయిడ్స్‌ నియంత్రణకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం సమన్వయంతో పనిచేసి 95-95-95 లక్ష్యాలను సాధించాలని డాక్టర్ శారదాబాయి సూచించారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఏఆర్‌టీ సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. హెచ్‌ఐవీ పరీక్షలపై ప్రజల్లో అవగాహన పెంచి, బాధితులకు ఏఆర్‌టీ కేంద్రాల ద్వారా నిరంతరం మందులు అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు.ముఖ్యంగా గర్భిణులు, క్షయ వ్యాధిగ్రస్తులు, అధిక ప్రమాదంలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. బాధితుల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌టీ వైద్యులు, సీపీఎం అలీ హైదర్, కౌన్సిలర్లు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

నంద్యాల

కుష్టు సర్వేకు ప్రజలు సహకరించాలి: డీఎంహెచ్‌ఓ శారదా బాయి

నంద్యాల: జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనలో భాగంగా ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకు ఇంటింటి కుష్టు వ్యాధి సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా కుష్టు నిర్మూలన అధికారి డా. ఎం. శారదా బాయి తెలిపారు. 2027 మార్చి నాటికి కుష్టు రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో ఆశా కార్యకర్తలు, పురుష వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి వ్యాధి లక్షణాలను గుర్తిస్తారని చెప్పారు.చర్మంపై స్పర్శలేని మచ్చలు, అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా బహుళ ఔషధ చికిత్స (MDT) అందిస్తామని తెలిపారు. ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, బాధితుల పట్ల వివక్ష చూపకుండా సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.

నంద్యాల

జిల్లెల పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్

గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్‌, ఇన్‌పేషెంట్‌, ల్యాబ్‌ విభాగాలను పరిశీలించిన ఆమె, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ల్యాబ్‌లోని హిమోగ్లోబిన్‌ పరీక్షల వివరాలు తెలుసుకోవడంతో పాటు, వైద్య సేవల నమోదు ప్రక్రియను కలెక్టర్ సమీక్షించారు. ఆస్పత్రిలోని రోగులతో నేరుగా మాట్లాడి ఉచిత మందుల పంపిణీ, వైద్య సేవలపై ఆరా తీశారు. అందుతున్న వైద్య సేవల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ టి. వెంకటేశ్వర్లు, డాక్టర్‌ కే.సి. శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు

నంద్యాల

దీబగుంట్లలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పీహెచ్‌సీలో వైద్య సేవలు, మందుల నిల్వలను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. కొత్త భవనం పూర్తయ్యే వరకు ఆరోగ్య కేంద్రాన్ని తాత్కాలికంగా సచివాలయ భవనంలోకి మార్చాలని సూచించారు. అనంతరం సచివాలయంలో హాజరు, ఆధార్ సేవలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్.. ప్రజల అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ గోవర్ధన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు